‘రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి​’ | Allari Naresh Speech In Ramba Oorvasi Menaka Pre Release Event, Comments Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Allari Naresh: రూ.100 కోట్లు ఇస్తా.. సినిమా నాతోనే చేయాలి​

Sep 3 2026 11:05 AM | Updated on Sep 3 2026 11:26 AM

Allari Naresh Speech In Ramba Oorvasi Menaka Pre Release Event

అల్లరి నరేశ్‌ హీరోగా చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌–హాస్య మూవీస్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. ఈచిత్రం రేపు(సెప్టెంబర్‌4) రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.  ఈవెంట్‌లో పాల్గొన్న అల్లరి నరేష్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివింది: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
యాంకర్‌ సుమ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘మీకు వందకోట్లు వరం వస్తే వాటిని ఎవరికి ఇస్తారు? అని అల్లరి నరేశ్‌కి అడిగారు. దీనికి బదులిస్తూ.. ‘ప్రస్తుతం ఇండస్ట్రీలో బాగా లీడ్‌లో ఉన్న మైత్రీ మేకర్స్‌కు రూ.50 కోట్లు, అన్నపూర్ణ స్డూడియోస్‌కు రూ.25 కోట్లు, హాస్య మూవీస్‌కి రూ.25 కోట్లు ఇస్తాను. కానీ వీరంతా నాతోనే సినిమా తీయాలి. అదే నా కండిషన్’ అని చెప్పి నవ్వులు పూయించారు. 
ఇదీ చదవండి: అబ్బాయిలా ఉండేనన్ను.. అమ్మాయిగా మార్చారు: విష్ణుప్రియ

కాగా ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కిన ఈ సినిమా వినోదభరితమైన ఘటనలతో సరికొత్త థియేట్రికల్‌ అనుభూతిని అందించనుంది. నరేష్‌ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement