చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్‌గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్న యాకంర్, నటి విష్ణుప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ సినిమాలో నన్ను అందంగా చూపించిన మేకప్ అండ్ స్టైలింగ్ టీమ్ రామరెడ్డికి స్పెషల్ థాంక్స్ . నేను కొంచెం అబ్బాయిలా ఉండేదాన్ని. అలాంటి నన్ను ఒక అందమైన అమ్మాయిలా కనిపించేలా చేశారు.. మీకు చాలా థాంక్స్’ అంటూ చెప్పి అక్కడున్నవాళ్లని నవ్వులు పూయించారు. అంతేకాకుండా యాంకర్ సుమ ‘నీ ముక్కు పొడుగు ఎంత’ అని అడిగిన ప్రశ్నకు బుదులు ఇస్తూ ఆకాశమంత అని నవ్వుతూ చెప్తూ అక్కడున్న వాళ్లని ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమాలో విష్ణుప్రియ ఊర్వశిగా కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రం రేపు(సెప్టెంబర్4) రిలీజ్ కానుంది.
ఇదీ చదవండి: అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
Anchor #Suma : మీ ముక్కు పొడుగు ఎంత ??#VishnuPriya : ఆకాశమంతా 🤯#RambaOorvasiMenaka pic.twitter.com/ZzmJIxzg9D
— ANANTAPUR CINEMA (@AnantapurCinema) September 2, 2026


