‘కల్కి2​‍’పై బిగ్‌ అప్‌డేట్‌..! | Kalki Part 2 Update By Nag Ashwin In Iam The Game Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

‘కల్కి2​‍’పై బిగ్‌ అప్‌డేట్‌..!

Sep 1 2026 1:01 PM | Updated on Sep 1 2026 1:10 PM

Kalki Part 2 Update By Nag Ashwin In Iam The Game Movie Pre Release Event

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన  పాన్‌ ఇండియా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఐయామ్‌ ది గేమ్‌’.   ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేఫెరర్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్, జోమ్‌ వర్గీస్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘కల్కి2’కి సంబంధించిన అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది.

‘ఇప్పటివరకు పది రోజుల షూటింగ్‌ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రభాస్‌కు సమయం దొరకపోవడంతో లేట్‌ అవుతుంది. అతనికి సమయం దొరికాక పెద్ద షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తాం’ అని వెల్లడించారు.

ఎక్కువమంది చదివింది: శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్

2024లో విడుదలై..
కాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ 'కల్కి 2898 ఏడీ'.  2024 జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌ హాసన్‌, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కల్కి2’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఈ తరహాలో ‘కల్కి2’కి సంబంధించిన అప్‌డేట్‌ అభిమానుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement