ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు హీరో శ్రీవిష్ణు. కొంత గ్యాప్ తరువాత మరోసారి అదే జానర్‌లోకి ఎంటరయ్యాడు ఈ హీరో. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
నేటి యువత అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, జీవిత పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఇది మన అందరి కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. యానిమేషన్‌తో మొదలైన ఈ గ్లింప్స్ హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేసింది. సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాతో సన్నీ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన మిడిల్ క్లాస్ పాత్రతో ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఈ చిత్రానికి చందు, రవి సంగీతమందించనున్నారు.
ఈ సినిమా తరువాత హీరో రవితేజతో కలిసి 2027 సంక్రాంతి పండక్కి ఆడియన్స్ ముందుకు రానున్నారట. రవితేజ హీరోగా ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్‌గోలి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. కథ రీత్యా ఇది మల్టీస్టారర్ మూవీ అని, రవితేజతో పాటు శ్రీవిష్ణు మరో లీడ్ రోల్‌లో నటించనున్నారని సమాచారం.


