ఏషనాగుల సాంగ్.. నాని, అనిరుధ్ వీడియో వైరల్ | Nani and Anirudh Video Goes Viral on Esha Nagula Song of Paradise Movie | Sakshi
Sakshi News home page

Paradise Movie: ఏషనాగుల సాంగ్.. నాని, అనిరుధ్ వీడియో వైరల్

Aug 31 2026 8:04 PM | Updated on Aug 31 2026 8:08 PM

Nani and Anirudh Video Goes Viral on Esha Nagula Song of Paradise Movie

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్'.  ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఆయా షేర్ సాంగ్ ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్‌ దక్కించుకున్నాయి.

ఇటీవలే ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఏషనాగుల కట్టమీద అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సైతం ఊహించని విధంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది.

తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ కలిసి చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నాని, అనిరుధ్ న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద లైట్లతో ఓ రిక్షాలో సందడి చేశారు. ఈ క్రమంలో ఏషనాగుల పాట బీట్‌కు దరువు వేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement