‘వేట’ ఓ గ్రామీణ కథ | Nagababu Attended the Launch of Veta Movie | Sakshi
Sakshi News home page

‘వేట’ ఓ గ్రామీణ కథ

Aug 31 2026 4:08 PM | Updated on Aug 31 2026 4:46 PM

Nagababu Attended the Launch of Veta Movie

అశోక్‌ కోటిపల్లి దర్శకత్వంలో సందీప్ సరోజ్, సాత్విక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేట’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం​ సోమవారం(ఆగస్టు 31) ఘనంగా నిర్వహించారు. కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో సందీప్‌ మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన నాగబాబుకి ధన్యవాదాలు. ‘వేట’ అనేది చిరంజీవి సినిమా టైటిల్.  ఇది ఓ గ్రామీణ కథ. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా ఎస్ఆర్‌డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తున్నారు. 

చదవండి: గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement