అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ పెట్టా..! | Vishnu Priya Spoke About Instagram Subscriptions During The Rambha Urvasi Menaka Promotions | Sakshi
Sakshi News home page

అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ పెట్టా..!

Aug 31 2026 3:30 PM | Updated on Aug 31 2026 4:05 PM

Vishnu Priya Spoke About Instagram Subscriptions During The Rambha Urvasi Menaka Promotions

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విష్ణుప్రియ. సోషల్‌ మీడియాలోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. త్వరలో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించనుంది విష్ణుప్రియ.  ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌, సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ఆదాయం కోసం వెల్లడించారు. 
షోలో కంటే ఇక్కడే ఎక్కువ..
‘షోల కంటే, మూవీస్‌ కంటే కూడా విష్ణుప్రియ సోషల్‌ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తోంది’ అనే ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇది తన ఒక్కరి విషయంలోనే కాదని.. చాలా మంది సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా డబ్బులు ఎక్కువ అర్జిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్రాండ్‌ ప్రమోషన్స్‌, సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ప్రాజెక్టుల నుంచి రెమ్యునరేషన్‌ గణనీయంగా ఉంటుందని చెప్పారు. 
ఇది అదృష్టంగా భావిస్తున్నా..
‘టీవీలో రెండు ఎపిసోడ్లకు వచ్చే పారితోషికం కంటే సోషల్‌ మీడియాలో ఒక్క ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అక్కడ పడే కష్టానికి.. ఇలా ప్రతిఫలం ఉంటుంది. అయితే చాలామందిలో టాలెంట్‌ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. నా విషయంలో మాత్రం ఫోన్‌ ప్రతిరోజూ అవకాశాల కోసం మోగుతూనే ఉంటుంది. ఇది అదృష్టంగా భావిస్తున్నా’ అని విష్టప్రియ తెలిపింది.

ఎక్కువ మంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్‌లో తోపులు.. ఎవరికి ఎంతంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదన ఎంత? 
విష్టుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో బాగానే సంపాదిస్తోందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవాళ్లు 4728 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక నెలకి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే రూ.390లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం సుమారు.రూ.18లక్షల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా బ్రాండ్‌ ప్రమోషన్స్‌, సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ప్రాజెక్టులు ద్వారా కూడా అదనంగా రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం.

సినిమా విషయానికి వస్తే..
అల్లరి నరేష్‌ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ సినిమాకు చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు.  సురభి హీరోయిన్‌. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్‌– హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన సాంగ్‌లో అల్లరి నరేశ్‌తో కలిసి రాశీ సింగ్‌, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌లు చిందులేశారు. నరేష్‌ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి: గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement