రెండో భర్త వేధిస్తున్నాడని యువతి ఆత్మహత్య
కాపురంలో చిచ్చురేపిన సోషల్ మీడియా
బంజారాహిల్స్‌లో ఘటన
హైదరాబాద్: ఇష్టమైన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలివచ్చిన ఓ యువతి రెండో పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అతనితో వేగలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్ కొట్టూర్ తెలిపిన వివరాల ప్రకారం... అన్నవరానికి చెందిన ఎం.రాజేశ్వరి (23) వివాహం 2023లో ముత్యాలరావుతో జరిగింది. అదే ఏడాది బంజారాహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన అంతటి సాయికుమార్ (28)తో పెళ్లి జరిగిన నెల రోజులకే (ఏప్రిల్‌లో) ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో ఏడాది జూన్‌లో సాయికుమార్.. రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను ఇందిరానగర్ తీసుకువచ్చి కాపురం పెట్టాడు.
ఓ నగల షాపులో పనిచేస్తున్న రాజేశ్వరిని అదే ఏడాది నెల తర్వాత జులైలో మొదటి భర్త ముత్యాలరావు వచ్చి తీసుకువెళ్లాడు. అదే ఏడాది ఆగస్టు 13న సాయికుమార్ మళ్లీ వెళ్లి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చి, 2023 ఆగస్టు 16న తాళి కట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ నివాసముంటున్నారు.
నగల షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి గత నాలుగైదు నెలల నుంచి ఇన్‌స్ట్రాగామ్‌లో మరో యువకుడితో చాటింగ్ చేస్తుండడం, ఫోన్‌లో మాట్లాడుతుండడాన్ని సాయికుమార్ గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్దలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్యా తీవ్ర గొడవ జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇద్దరి మధ్యా జరిగింది. అనుమానంతో సాయికుమార్ ఆమెను తిట్టడంతో పాటు తీవ్రంగా వేధించి మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవ జరిగింది.
ఈ అనుమానాన్ని, అవమానాన్ని భరించలేక రాజేశ్వరి బాత్‌రూమ్‌లోకి వెళ్లి షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంట గడిచినా బయటకు రాకపోయేసరికి సాయికుమార్ బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా షవర్ కొక్కానికి వేలాడుతూ కనిపించింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు సాయికుమార్‌పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి: తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం


