ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...
విశాఖపట్నం : స్వర్ణ వర్ణపు హరివిల్లులా ఉండే ఆర్కే బీచ్ .. వాతావరణ మార్పుల మాయలో పడి, నల్లటి మేఘాల నీడను మోస్తున్నట్లు నల్లటి ఇసుకతో సరికొత్త రూపు సంతరించుకుంది.
దిగంతంలో నింగీ నేలా కౌగిలించుకుంటున్న వేళ... నీలి సముద్రపు గర్భం నుంచి ఉదయిస్తున్నట్లుగా, వందలాది పసుపు తెరచాపలు గాలి కెరటాలపై తేలియాడుతున్నాయి. మత్స్యకారుల శ్రమకు ప్రకృతి ఆశీర్వాదమై, వారి జీవన పోరాటం కళాత్మకంగా ఆవిష్కృతమవుతోంది. విశాఖ తీరాన్ని స్వర్ణమయం చేస్తున్న ఈ పసుపు వర్ణాల సందడి, చూసే కన్నులకు ఒక అనిర్వచనీయమైన దృశ్య కావ్యం.
ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


