భాతీయ వంటకాల రుచి పడిపోవని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆహా ఇదేమి రుచి తినరా మైమరచి..అంటూ లొట్టలేసుకుంటూ విదేశీయులు సైతం ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మన వంటకాల కోసం మన భారత్‌లో పర్యటించేవాళ్లు కూడా ఉన్నారు. ఇదెంతా ఎందుకంటే మన వంటకాల టేస్ట్‌కి ఫిదా అవ్వుతూ ఓ అమెరికన్ వ్యక్తి తన ఆవేదనంత గక్కేశాడు. స్వతహాగా మాంసహార ప్రియుడినైనా తాను భారతీయ వంటకాల దెబ్బకు..మరో రుచి చూడలేకపోతున్నానంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇదేంటి మన వంటకాల టేస్ట్ నచ్చలేదా? అని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ అమెరికన్ వ్యక్తి మన వంటకాల తోపాటు మన వెటకారం కూడా వంటబట్టించుకుని మరి ఇలా వ్యగ్యంగా చెబుతున్నాడు. ఇంతకీ ఏంటంటే అసలు కథ..!.
స్నాక్ మాస్టర్ జనరల్‌గా అభివర్ణించే స్నాక్ డిటెక్టివ్ ఎడ్ నాథన్సన్ అనే అమెరికన్ వ్యక్తి భారతీయ వంటకాలు తన రుచి మొగ్గలను పాడు చేశాయట. భారతీయ వంటకాల్లోని అద్భుత రుచి, విభిన్నమైన రెసిపీల మాధుర్యానికి మరో వంటకం టేస్ట్ నాథన్సన్‌కి తెలియడం లేదట. మన వంటకాల రుచి ఆ రేంజ్‌లో ఉందని, అందులో ఉపయోగించే 47 మసాలాలే ఇందుకు కారణం అని అంటున్నాడు. ఆ కారణంగానే అతడి నాలుకు మరో టేస్ట్‌ని క్యాచ్ చేయలేక వాటి జోలికే పోవడం లేదంటూ చమత్కరిస్తున్నాడు.
భారత వంటకాల రుచితో తనకు గొప్ప చిక్కొచ్చి పడిందంటూ వ్యగ్యంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నాడు. ఇది అక్షరాల మిగతా వంటకాల రుచి పాడుచేస్తోందని ఆరోపణలు చేస్తున్నాడు. తాను సుమారు నాలుగైదు ఏళ్ల నుంచి భారతీయ ఆహారం ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించారు. ఒకరోజు స్వర్గంలోంచి దేవుడే తనను ఆహ్వానిస్తూ..ఈ భారతీయ వంటకాల రుచి చూడమన్నాడని ఆసువుగా కథ కూడా చెప్పేస్తున్నాడు. అంతేగాదు అస్సలు ఈ వంటకాలు టేస్ట్ చూడాలని దిగారో..మళ్లీ వెనక్కి వెళ్లీ మరో వంటకం వైపుకి చూడను కూడా చూడరని శపథం చేసి మరి చెబుతున్నాడు.
ఇంకా.. మన రెసిపీ పేర్లు ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు. పారీ పూరీ తిన్నారో..మళ్లీ మళ్లీ తినాలనే కోరిక చావను కూడా చావదు, ఆ చికెన్ కర్రీ టేస్ట్ చేశారో..మదిలో గుర్తుకొచ్చినప్పుడల్లా నోటిలో నీళ్లూరిపోతుంటాయని, ఇక ఆ కాలీఫ్లవర్ చూస్తే..భారతీయ వంటకం గోబీ మంచూరియన్ మనసుని తాకుతుందని..అందువల్ల నాలుకని కట్టడి చేయడం అసాధ్యం అంటూ ఇండియన్ వంటకాలపై ప్రేమనంత ఒలకపోశాడు నాథన్సన్.
అంతేగాదు తాను స్వతహాగా మాంసాహార ప్రియుడినైనా తనని శాకాహార వంటకాల వైపుకి మళ్లేలా చేసిందని అంటున్నాడు. అంతేగాదు తొలిసారిగా భారతీయ వంటకాలను ట్రై చేసే ముందు ఓసారి ఆలోచించుకోండి. లేదంటే దాని రుచికి బానిసైపోతారు, మళ్లీ దాన్నుంచి బయటపడటం అంత ఈజీ కాదు సుమీ అని హాస్యంగా హెచ్చరిస్తున్నాడు నాథన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
(చదవండి: మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్..! ప్రత్యేకత ఇదే)


