పాప పుడితే అలా.. అబ్బాయి పుడితే ఇలా.. సామ్‌కు పేరు సలహా..! | Samantha about Her child Name discussion with Fans Goes Viral | Sakshi
Sakshi News home page

Samantha: పుట్టబోయే బిడ్డకు అలాంటి పేర్లు.. సామ్ రియాక్షన్‌ ఇదే..!

Aug 31 2026 3:17 PM | Updated on Aug 31 2026 3:39 PM

Samantha about Her child Name discussion with Fans Goes Viral

ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన టాలీవుడ్ బ్యూటీ సమంత. ఈ మూవీ సూపర్ హిట్‌తో పాటు అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. కాగా.. గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సంగతి తెలిసిందే.  

అయితే ఇటీవల సమంత నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన ప్రెగ్నెన్సీతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిట్‌ చాట్‌లో సమంతకు పుట్టబోయే బిడ్డ గురించి చర్చ జరిగింది. మీ బిడ్డకు ఇద్దరి పేర్లు వచ్చేలా పేరు పెట్టుకోవాలని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. పాప పుడితే సమైరా.. బాబు పుడితే సామ్రాజ్ అని పెట్టుకోవాలని కామెంట్‌ చేశాడు.  దీనిపై సమంత స్పందించింది.  మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ? అంటూ స్మైలీ ఎమోజీలను జోడించింది.

సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈసినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్‌ దేవయ్య, దిగంత్‌ మంచాలే కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం సమంత మాతృత్వం కోసం సినిమాలకు విరామం ప్రకటించింది.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement