టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీతో హిట్ అందుకున్న మన హీరో.. మరో మూవీని ప్రకటించారు. ఆయన నిర్మాతగా తాజాగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి హతః అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తోనే ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశారు. 'ఈ పిల్లి బతికి ఉందా.. లేక చనిపోయిందా' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు అనుశ్ గోరఖ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అటు హీరోగా రాణిస్తూనే.. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం దూసుకెళ్తున్నారు.
HATAH - What you never saw coming 🐈⬛
Teaser soon ❤️#HATAH #STAYLOST pic.twitter.com/W1qmiqkovL— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 31, 2026


