సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించారు. ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ ఈ శుక్రవారమే(సెప్టెంబర్ 4) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ వివి.వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశాడని చంద్రబోస్ నాతో చెప్పారు. కథ బాగా నచ్చి ఈ సినిమాకు ఒక్క రూపాయి తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాశానని ఆయన అన్నారు. ఇది గొప్ప సినిమా అవుతుందనే నమ్ముతున్నాను అని వినాయక్ చెప్పుకొచ్చారు.
రంగస్థలం తర్వాత అంత సంతోషంగా ఈ చిత్రానికే పాటలు రాశాను. అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే సందర్భాలు ఈ సినిమాలో ఉన్నాయి. అలాంటి సందర్భాలను దర్శకుడు జ్ఞానప్రభ క్రియేట్ చేశారు. ఐదు పాటలు ఎంతో సంతృప్తినిచ్చాయి అని చంద్రబోస్ అన్నారు.


