కాలేజీలు చదువు చెప్పడానికా? సినిమా ఫంక్షన్లకా? | Movie Events In Colleges Begin Social Media Debate | Sakshi
Sakshi News home page

Toxic Event Issue: కాలేజీలో మూవీ ప్రమోషన్లు.. ఎవరికోసం ఇవన్నీ?

Aug 24 2026 3:19 PM | Updated on Aug 24 2026 3:31 PM

Movie Events In Colleges Begin Social Media Debate

స్కూల్స్, కాలేజీలు ఉన్నది దేనికి? చదువు చెప్పడానికి. కానీ రీసెంట్ టైంలో వాటిని చదువు కంటే సినిమా ఈవెంట్స్ కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రైవేట్ కాలేజీలు ఇదే పనిచేస్తున్నాయి. ఇన్నిరోజులు ఈ విషయాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు గానీ రీసెంట్‌గా 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ప్రమాదమే ఇప్పుడు చర్చకు కారణం. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో ఇది జరగ్గా.. నలుగురైదుగురు విద్యార్థులు గాయపడటంతో పోలీసు కేసు కూడా నమోదైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలువురు విద్యార్థులు.. ఎత్తులో పెట్టిన సౌండ్ బాక్సులు పట్టుకుని వేలాడారు. దీంతో అది పట్టుతప్పి కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు అబ్బాయిలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. అసలు చదువుకోవాల్సిన ఈ విద్యార్థులని సినిమా వేడుకకు రమ్మని చెప్పింది ఎవరు? కాలేజీ యాజమాన్యం ఇలా చేస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ముచ్చటపడ్డారని వదిలేశారా? మా సినిమా ఈవెంట్‌కి ఇంతమంది వచ్చారని ఆర్భాటం చూపించుకోవడానికి ఇలా చేశారా?

కాలేజీలో సినిమా ఈవెంట్లు చేయడంపై అటు సోషల్ మీడియాలో ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కోపం కనిపిస్తోంది. చదువు చెప్పే చోట ఇలాంటి కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హీరోలకు ఫ్యానిజం/బానిసత్వం పేరిట తెలుగు రాష్ట్రాలో యువత చాలామంది చెడిపోయారు, చెడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు అనవసర విద్వేషం పెంచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు కాలేజీల్లోనూ మూవీ ఈవెంట్స్ పెడుతుండటం షాకింగ్‌గా అనిపిస్తుంది. అందరూ కలిసి యువతని చెడగొట్టాలా ఏమైనా పూనుకున్నారా? అని సందేహం కలుగుతోంది.

ప్రైవేట్ కాలేజీలు.. ఇలా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సాంగ్ లాంచ్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఫ్రీ ప్రమోషనే కారణమని తెలుస్తోంది. సినిమా సెలబ్రిటీలు వచ్చారంటే మీడియా, సోషల్ మీడియాలో వాళ్ల కాలేజీ పేరు వినిపిస్తుంది. తద్వారా ఉచితంగా ప్రమోషన్ దొరుకుతుందని చాలా కాలేజీలు భావిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఇదే పనిచేస్తున్నారు. మరికొన్ని కాలేజీలు అయితే ఏకంగా స్టార్ హీరోహీరోయిన్లతో ప్రకటనలు ఇస్తున్నాయి.

అసలు సెల‍బ్రిటీలకు కాలేజీలతో ఏం సంబంధం? వాళ్లేమైనా దేశ సేవ చేస్తున్నారా? లేదంటే యాడ్ షూటింగ్ చేస్తున్నారా? అని పలువురు నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో కాలేజీ యాజమాన్యాలని నిలదీస్తున్నారు. 'టాక్సిక్' ఈవెంట్‌లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. 'ఇలా అరిచి గోల చేస్తే ఇకపై ఏ మూవీ ఈవెంట్లకు మన కాలేజీలో అనుమతి ఇవ్వం' అని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే కాలేజీలు పెట్టింది చదువు చెప్పడానికి. ఈమె మాటలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి.

(ఇదీ చదవండి: హోటల్‌లో ఏం జరిగిందో మీకు 90% తెలియదు: ఈశ్వర్ సాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement