ఓటీటీకి గరివిడి లక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Tollywood Movie Garividi Lakshmi Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Garividi Lakshmi: ఓటీటీకి గరివిడి లక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nov 25 2026 12:25 PM | Updated on Nov 25 2026 12:32 PM

Tollywood Movie Garividi Lakshmi Streaming On This Ott From This Date

ఆనంది, రాగ్‌ మయూర్‌ జంటగా, వీకే నరేష్‌, రాశి, శరణ్య, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ గరివిడి లక్ష్మి. ప్రముఖ ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. అక్టోబర్‌ 17న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకీ తీసుకొస్తున్నారు. ఈనెల 26 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సినిమాకు చరణ్ అర్జున్‌ సంగీతం అందించారు.

(ఇది చదవండి: టాలీవుడ్‌ బోల్డ్‌ ఎంటర్‌టైనర్‌.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్)

ఈ మూవీ కథేంటంటే?..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నాటి విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతంలో పుట్టిన కళాకారిణి జీవిత కథే ఈ చిత్రం. దేవుడమ్మ (రాశి), తాత నాయుడులకు పుట్టిన గారాలపట్టి విజయలక్ష్మి (ఆనంది). చదువు పెద్దగా అబ్బకపోయినా.. ఒక్కసారి వింటే చాలు, ఆ విషయాన్ని ఇట్టే పట్టేసే ప్రతిభ ఆమె సొంతం. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న లక్ష్మి జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. పలు కారణాలతో భర్తకు దూరమైన దేవుడమ్మ ఆమెకు అన్నీ  తానే అయి పెంచుతుంది. అయితే లక్ష్మికి 12 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆ పెళ్లి ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? లక్ష్మి జానపద కళల వైపు అడుగులు వేయడానికి కారణమేంటి? బుర్రకథ నేర్చుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురయ్యాయి? గరివిడి లక్ష్మిగా ఆమె ఎలా గుర్తింపు తెచ్చుకుంది? అనేది తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement