breaking news
Rag Mayur
-
వరస సినిమాలతో అలరిస్తున్న రాగ్ మయూర్
'సివరపల్లి' సక్సెస్ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోతూ తనదైన నటనతో రాగ్ మయూర్ మెప్పిస్తున్నాడు. రీసెంట్గా సమంత నిర్మించిన 'శుభం'లోనూ రాగ్ మయూర్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) నేను ఇంతకు ముందు చేసిన 'సినిమా బండి' ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మరిడేష్ బాబు పాత్రకు కొనసాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్రను దర్శకుడు ప్రవీణ్ చాలా సరదాగా డిజైన్ చేశారు. ఆయన కథ నెరేట్ చేసిన తర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అర్థమైంది. అందుకే 'శుభం' అవకాశాన్ని కాదనలేకపోయాను. నా నమ్మకం నిజమైంది. నా పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమంత, ప్రవీణ్ కి థాంక్స్. సినిమా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందని అన్నాడు. ప్రవీణ్ కండ్రేగుల తీస్తున్న మూడో సినిమా 'పరదా'లోనూ రాగ్ మయూర్ నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో కలిసి కనిపించబోతున్నాడు. 'పరదా'లో పూర్తి నిడివి పాత్ర చేశానని చెప్పాడు. జీఏ2 తీస్తున్న బడ్డీ కామెడీ చిత్రంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలోనూ మయూర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!
సివరపల్లి వెబ్ సిరీస్‌తో దూసుకుపోతున్న హీరో రాగ్ మయూర్ మరో ఘనతను సాధించారు. సెన్సేషనల్ హీరో అయిపోదామని కాకుండా... పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతూ, నటనలో రాటుదేలుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న రాగ్ తాజాగా మరో అడుగు ముందుకేసారు. సివరపల్లి సిరీస్‌లో నటనకు గాను ఇంటర్నేషనల్ ఐకానిక్ బెస్ట్ యాక్టర్ ఓటీటీ తెలుగు అవార్డ్ కోసం నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ అభినందనలు తెలియజేశారు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్ నటనపై ఆసక్తితో ఉన్నత చదువును పక్కన బెట్టి మరీ హీరో రాణిస్తున్నారు. అద్భుతమైన నటనతో సినీ లవర్స్‌కు దగ్గరవుతున్నారు. సినిమానే తన ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్లు.. ప్రేక్షకులు లిచ్చిన ప్రేమ, వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అంటున్న వాలెంటైన్స్ డే సందర్బంగా హీరో రాగ్మయూర్తో స్పెషల్ చిట్ చాట్ రెండో భాగం. (చివరిది) మీకోసం! -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్‌తో సాక్షి.కామ్ స్పెషల్‌గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్‌చాట్‌ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.