
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్‌లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.
మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.