న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్-2026 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత ప్రతినిధి కజియా లిజ్ మెజో టాప్-12లో చోటు సంపాదించలేకపోయింది. అయితే అంతకుముందు టాప్-30లో స్థానం దక్కించుకుని తన ప్రతిభను చాటుకుంది. ప్యూర్టోరికో వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 19 ఏళ్ల కేరళ యువతి భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని, తన సొంత రాష్ట్రం కేరళ సంప్రదాయాలను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసింది.


