తరచుగా ఉపయోగిస్తున్న 96 శాతం మంది ఉద్యోగులు
ఆసియా–పసిఫిక్‌పై బీసీజీ నివేదిక
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంత దేశాల్లో ఎక్కువగా భారత్‌లో ఉద్యోగులే కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగిస్తున్నారు. తద్వారా వారానికి సగటున 15 గంటల సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదిక ప్రకారం.. భారత్‌లో 96% మంది ప్రతి రోజూ లేదా వారానికి రెండు, మూడు సార్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. తొమ్మిది ఆసియా పసిఫిక్ మార్కెట్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఏపీఏసీలో ఉద్యోగుల్లో ఏఐ వినియోగం సగటున 85%గా ఉంది. ప్రాంతీయంగా ఉద్యోగులు సగటున 9.4 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా, భారత్‌లో ఇది 15 గంటలుగా ఉంది. పనిని వేగవంతంగా పూర్తి చేయడంలో ఉపయోగపడటంతో పాటు ఉద్యోగులు దృష్టి పెట్టాల్సిన అంశాలను కూడా ఏఐ ప్రభావితం చేస్తోందని బీసీజీ ఎక్స్ ఇండియా లీడర్ నిపుణ్ కల్రా తెలిపారు.
ఇప్పుడిక నాయకత్వ స్థానాల్లో ఉన్న వారు పని విధానాలను సరికొత్తగా తీర్చిదిద్దడంతో పాటు ఉద్యోగుల సామ ర్థ్యాలను మెరుగుపర్చడం, ఏఐతో అర్థవంతమైన ఫలితాలను సాధించడంపై ఉద్యోగుల్లో స్పష్టతనివ్వడం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని కల్రా చెప్పారు. మరిన్ని విశేషాలు..
⇒ ఏఐతో ఆదా అయ్యే సమయాన్ని ఇతరత్రా వ్యూహాత్మక పనుల కోసం వెచ్చిస్తున్నట్లు భారత్‌లో 61% మంది ఉద్యోగులు తెలిపారు. ఏపీఏసీలో ఇది 44%గా ఉంది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల కంటే భారత్ ముందంజలో ఉంది. ఆస్ట్రేలియాలో ఇది 60%గా, చైనాలో 37%గా ఉంది.
⇒ ఏఐపై ఏపీఏసీలో 20% ఉద్యోగులకు, దేశీయంగా 38% మంది ఉద్యోగులకు స్పష్టత ఉంది.
⇒ భారత్‌లో 42% మంది తమకు ఏఐపై తగినంత శిక్షణ లభించినట్లు తెలపగా, 59% మంది తమ కంపెనీల్లో మానవ–ఏఐ బృందాలు కలిసి పనిచేయడానికి నిర్దిష్ట నిబంధనలు అమలవుతున్నాయన్నారు.


