టెక్ దిగ్గజంలో భారీ లేఆఫ్స్?.. ఉద్యోగులకు 24 గంటల డెడ్‌లైన్! | Google Dismisses Mass Layoff Rumours In India Know The Fact Here | Sakshi
Sakshi News home page

టెక్ దిగ్గజంలో భారీ లేఆఫ్స్?.. ఉద్యోగులకు 24 గంటల డెడ్‌లైన్!

Nov 24 2026 12:25 PM | Updated on Nov 24 2026 12:34 PM

Google Dismisses Mass Layoff Rumours In India Know The Fact Here

టెక్ దిగ్గజం గూగుల్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయంటూ.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లోని గూగుల్ క్లౌడ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని ఇంటికి పంపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఉద్యోగులకు రాజీనామా చేయడానికి 24 గంటల సమయం ఇస్తున్నారని, లేదంటే కంపెనీనే తొలగిస్తుందని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

సోషల్ మీడియాలో వైరల్
ఈ వార్తలు మొదట బ్లైండ్ అనే అనామక ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించాయి. బెంగళూరులో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగినని చెప్పుకున్న ఓ వ్యక్తి భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయని పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ విషయం 'ఎక్స్'లోనూ వైరల్‌గా మారింది. గూగుల్ ఇండియాలో అసలేం జరుగుతోందంటూ పలువురు ప్రశ్నలు లేవనెత్తారు.

స్పందించిన గూగుల్ క్లౌడ్
ఈ వార్తలపై వెంకటేష్ అల్లా కంపెనీ పరిస్థితిపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన.. గూగుల్ క్లౌడ్ ఇండియా ''సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. గత వారం భారత్‌లోని గూగుల్ క్లౌడ్ విభాగంలో చిన్నపాటి సంస్థాగత మార్పులు మాత్రమే చేపట్టామని వెల్లడించింది. పనులకు ప్రాధాన్యతలను మార్చుకునే క్రమంలో భాగంగా సుమారు 30 ఉద్యోగాలను మాత్రమే తొలగించినట్లు తెలిపింది. అంతేకానీ, ప్రచారం జరుగుతున్నట్లుగా సగం మంది ఉద్యోగులను తీసేయలేదని క్లారిటీ ఇచ్చింది''.

ఇదీ చదవండి: ఊహించని ట్విస్ట్.. బంగారం ధరలు జంప్!

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు లేఆఫ్
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా టెక్  కంపెనీల్లో ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోంది. ఖర్చులను తగ్గించుకోవడం, వ్యాపార వ్యూహాలను మార్చుకోవడం వంటి కారణాలతో పలు సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. గత నెలలో మైక్రోసాఫ్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్యాకేజీలు అందించినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భారతీయ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement