343 కిమీ రేంజ్ అందించే బైక్.. డెలివరీలు స్టార్ట్ | Ultraviolette X 47 Venom Deliveries Start | Sakshi
Sakshi News home page

343 కిమీ రేంజ్ అందించే బైక్.. డెలివరీలు స్టార్ట్

Nov 24 2026 11:09 AM | Updated on Nov 24 2026 11:15 AM

Ultraviolette X 47 Venom Deliveries Start

ప్రముఖ వాహన తయారీ సంస్థ అల్ట్రావయొలెట్, తన సరికొత్త ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ మోటార్‌సైకిల్ ఎక్స్-47 వెనమ్ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. సూపర్‌బైక్‌లకు పోటీనిచ్చే వేగాన్ని, రోజువారీ ప్రయాణాలకు అనువైన విధంగా ఉన్న ఈ బైక్ దేశీయ విఫణిలో మంచి ఆదరణ పొందుతోంది.

కంపెనీ ఈ బైకును లాంచ్ చేసిన సమయంలోనే.. భారీ బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు డెలివరీలు మొదలయ్యాయి. కాబట్టి.. సంస్థ తన రిటైల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా దశలవారీగా కస్టమర్లకు బైక్‌లను అందించనుంది.

11 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ పొందిన ఎక్స్-47 వెనమ్ 40 హార్స్ పవర్, 550 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ./గం. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 155 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 343 కిలోమీటర్ల వరకు (IDC సర్టిఫైడ్ రేంజ్) ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.

ఇదీ చదవండి: రూ.85 లక్షల బీఎండబ్ల్యూ కారు.. క్రెడిట్ కార్డులతో కొనేసాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement