Electric Bike
-
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ బైక్స్ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులుపెట్రోల్ బైక్స్చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణంఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి. -
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ సైకిల్!: వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసే భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా.. ఓ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియాలో ఒక వ్యక్తి.. ప్రపంచంలోనే మొట్టమొదటి డైమండ్ ఫ్రేమ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ వినియోగించడం చూడవచ్చు. అతని అవసరం తీరిపోయిన తరువాత దానిని ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్లడంతో వీడియో ముగుస్తుంది. కేవలం 34 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.వీడియోలో కనిపించే ఫోల్డబుల్ సైకిల్.. పేరు హార్న్‌బ్యాక్. ఆనంద్ మహీంద్రా కూడా ఇలాంటి సైకిల్ ఉపయోగించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని ఐఐటీ బాంబే స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టార్టప్‌లో కూడా తాను పెట్టుబడి పెట్టినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఇలాంటి ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఇంట్లో ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. The Hornback. The world’s first diamond frame electric foldable bike. Designed & developed in India. Now, even easier to fold….Because innovation never ceases(Disclosure: My Family Office has invested in the company) pic.twitter.com/ntoRd3ljwb— anand mahindra (@anandmahindra) March 15, 2025 -
అల్ట్రావయొలెట్ తొలి స్కూటర్ వచ్చేసింది..
ఎలక్ట్రిక్ బైక్‌లు తయారు చేసే అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ (Ultraviolette Tesseract) విడుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన కంపెనీ "ఫాస్ట్ ఫార్వర్డ్ ఇండియా" కార్యక్రమంలో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌తోపాటు అడ్వెంచర్-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘షాక్ వేవ్’ను ఆవిష్కరించింది.ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటి 10,000 కొనుగోలుదారులకు మాత్రమే రూ .1.20 లక్షలకు (ప్రారంభ ధర) లభిస్తుంది. ఆ తర్వాత రూ .1.45 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుంది. టెస్సరాక్ట్ అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 20.1 బీహెచ్నీ పవర్ మోటార్ తో నడిచే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 125 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది.7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను టెస్సెక్ట్ కలిగి ఉంది. రాడార్ అసిస్టెడ్ కొలిషన్ అలర్ట్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేక్ అలర్ట్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ టెక్నాలజీలను ఇందులో పొందుపరిచారు. ఈ స్కూటర్లో విశాలమైన 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు. యుద్ధ హెలికాప్టర్ల ప్రేరణతో దీని సొగసైన డిజైన్‌ను రూపొందించారు.షాక్వేవ్.. తొలి ఎలక్ట్రిక్ ఎండ్యూరో బైక్టెస్సెరాక్ట్ తో పాటు అల్ట్రావయోలెట్ భారతదేశపు మొట్టమొదటి రోడ్-లీగల్ ఎలక్ట్రిక్ ఎండ్యూరో మోటార్ సైకిల్ అయిన షాక్ వేవ్ (Ultraviolette Tesseract) ను కూడా లాంచ్ చేసింది. మొదటి 1,000 కొనుగోలుదారులు రూ .1.50 లక్షలకు (ఆ తర్వాత రూ .1.75 లక్షలు) దీన్ని సొంతం చేసుకోవచ్చు. అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం ఈ బైక్‌ను రూపొందించారు. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ బైక్ 165 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. ఈ బైక్ 2.9 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.షాక్వేవ్ కఠినమైన డిజైన్ లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లను కలిగి ఉంది. ఆఫ్-రోడ్‌తోపాటు పట్టణ భూభాగాలకు అనుకూలంగా ఉంటుంది. స్విచబుల్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్లు, ఆరు లెవల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరిక
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) హెచ్చరిక లేఖ జారీ చేసింది. సెబీకి ముందస్తు సమాచారం లేకుండా భవిష్ అగర్వాల్ తన ఎక్స్ వేదికలోనే కంపెనీకి చెందిన కీలక సమాచారాన్ని పంచుకున్నారని లేఖలో తెలిపింది.భవిష్ అగర్వాల్ డిసెంబర్ 2, 2024న కంపెనీ స్టోర్ల సంఖ్యను నెలలో 800 నుంచి 4,000కు విస్తరించాలనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం 9:58 సమయంలో ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. అయితే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు మాత్రం మధ్యాహ్నం 1:36 గంటలకు, 1:41 గంటలకు సమాచారాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.ముందు ఎక్స్‌లో.. తర్వాత ఎక్స్చేంజీలకు..సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ ఆవశ్యకతలు) రెగ్యులేషన్స్, 2015 నిబంధనలను ఓలా ఉల్లంఘించినట్లు హెచ్చరిక లేఖలో సెబీ తెలియజేసింది. సోషల్ మీడియా ప్రకటనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారులందరికీ ఏకకాలంలో, నియమాల ప్రకారం సకాలంలో సమాచారాన్ని అందించడంలో ఓలా ఎలక్ట్రిక్ విఫలమైందని నొక్కి చెప్పింది. మార్కెట్లో ఎలాంటి సమాచారాన్నైనా ముందుగా ఎక్స్చేంజీలకు తెలియజేయాలి. కానీ అందుకు విరుద్ధంగా భవిష్ అగర్వాల్ ముందుగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత రెగ్యులేటర్లకు సమాచారం అందించారు.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024అనైతికంగా లాభాలు..సామాజిక మాధ్యమాల్లో సీఈఓ స్థాయి వ్యక్తి ఏదైనా సమాచారాన్ని తెలియజేశాడంటే అది చూసిన పెట్టుబడిదారులు నమ్మి వెంటనే అందులో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకొందరు ఇన్వెస్టర్లు అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూంటారు. అలా ముందుగా సమాచారం పొందిన వారు అనైతికంగా లాభాలు సంపాదించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రతి సమాచారాన్ని ఎక్స్చేంజీలకు తెలియజేయాలి.ఇదీ చదవండి: ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేసిన మెటా‘మళ్లీ పునరావృతం అవ్వదు’సెబీ హెచ్చరిక లేఖపై ఓలా ఎలక్ట్రిక్ స్పందిస్తూ.. సెబీ ప్రమాణాలను మెరుగుపరచడానికి కంపెనీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహిస్తామని తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలకు ప్రతి కంపెనీ కట్టుబడి ఉండాలని ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. కార్పొరేట్ సమాచారాన్ని పారదర్శకతతో నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కొనసాగించేందుకు కంపెనీ కృషి చేయాలి. -
ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ను అనుసరించి ఎక్స్‌షోరూమ్ ధర కింది విధంగా ఉంది.ఏథర్ 450ఎస్ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్ 3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).ఏథర్ 450 అపెక్స్ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళంఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చని పేర్కొంది. -
ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ నుంచి సరికొత్త 35 సిరీస్‌ను ఆవిష్కరించింది. 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో వీటిని రూపొందించింది. ఒకసారి ఛార్జింగ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.కొత్త చేతక్ రూ.1.2 లక్షల ధరతో మిడ్ వేరియంట్ 3502, రూ.1.27 లక్షల ధరతో టాప్–ఎండ్ వేరియంట్ 3501 మాత్రమే ప్రస్తుతానికి విడుదలైంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లు. బేస్ వేరియంట్ అయిన 3503 కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. డెలివరీలు డిసెంబర్ చివరి వారం నుంచి ప్రారంభం అతుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్స్ అందుకునేలా స్మార్ట్ టచ్‌స్క్రీన్ పొందుపరిచారు. సీటు కింద 35 లీటర్ల స్టోరేజ్ ఏర్పాటు ఉంది. స్టోరేజ్ స్థలం పరంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో ఇదే అత్యధికం. రిమోట్ ఇమ్మొబిలైజేషన్, గైడ్ మీ హోమ్ లైట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 3501 మూడు గంటల్లో, 3502 వేరియంట్ 3 గంటల 25 నిముషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ తెలిపింది. వారంటీ మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. -
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
అదిరిపోయే ఎలక్ట్రిక్ ట్రెక్కింగ్ బైక్ (ఫొటోలు)
-
రిపేర్ బిల్లు రూ.90,000.. కోపంతో బండిని గుల్లగుల్ల చేసిన కస్టమర్...
-
HYD:పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఎనిమిది బైకులు దగ్ధం
సాక్షి,హైదరాబాద్: నగరంలో మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం బ్యాటరీ పేలింది. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో బుధవారం(నవంబర్ 27) తెల్లవారుజామున 3గంటల30నిమిషాలకు ఘటన జరిగింది.పార్క్ చేసి ఉన్న బైక్‌లో ఉన్న బ్యాటరీ పేలింది.పేలుడు దాటికి బైకు పూర్తిగా దగ్ధమైంది.మంటల తీవ్రతకు పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ఎనిమిది బైకులు కాలి బూడిదయ్యాయి. ఇదీ చదవండి: ఫ్యాబ్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం -
కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై హీరో కసరత్తు
న్యూఢిల్లీ: మధ్య స్థాయి పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీపై కసరత్తు చేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్ భాగస్వామ్యంలో ఈ వాహనం అభివృద్ధి చేసే ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు.జీరో మోటర్‌సైకిల్స్ ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్స్, పవర్‌ట్రెయిన్స్ తయారు చేస్తుంది. 2022 సెప్టెంబర్‌లో జీరోలో 60 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు హీరో బోర్డు ఆమోదముద్ర వేసింది. మరోవైపు, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని మరింతగా విస్తరిస్తున్నట్లు గుప్తా చెప్పారు.వచ్చే ఆరు నెలల్లో వివిధ ధర శ్రేణుల్లో, కస్టమర్ సెగ్మెంట్లలో తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని వివరించింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కి చెందిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో అమ్ముడవుతున్నాయి. -
ఛార్జింగ్ పెడితే పేలిన ఎలక్ట్రిక్ బండి
-
జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే..
సాక్షి, జగిత్యాల జిల్లా: కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే ఎలక్ట్రిక్ బైక్ పేలిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఛార్జింగ్ పెడుతుండగా ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం ఐదు నిమిషాల్లోనే బైక్ పేలిపోయింది.బైక్ పేలడంపై బాధితుడు బేతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమవ్వగా, స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు లక్షా 90 వేల రూపాయలున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.కాగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్ పేలుడుపై టీవీఎస్ మోటార్ డీలర్‌తో బాధితుడు వాగ్వాదానికి దిగారు. ఇన్సూరెన్స్ ద్వారా నష్టం పూడ్చే ప్రయత్నం చేస్తామని కంపెనీ డీలర్ తెలిపారు. వరసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో టెన్షన్ కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘ఈవీ’లు... టైంబాంబులు! -
ఈవీ బైక్ షోరూం యజమాని అరెస్టు
బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్ రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్, మేనేజర్ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఇష్టపడి కొంటే.. బూడిదైందికృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్ని కొన్నారు. పికప్ లేదని, సర్వీసింగ్ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్‌లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
హోండా మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (ఫొటోలు)
-
ఎలక్ట్రిక్ టూరర్ బైక్స్ ఎప్పుడైనా చూశారా?.. మతిపోగొడుతున్న ఫోటోలు
-
ఇక నుంచి అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్ టూ-వీలర్లు
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
టూవీలర్ వాహన మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటీవల ఆవిష్కరించింది. ‘ఫ్లైయింగ్ ఫ్లీ’ పేరుతో దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. విభిన్న వేరియంట్ల ద్వారా 250-750 సీసీ సామర్థ్యం కలిగిన బైక్‌లకు ధీటుగా ఈవీను అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.రాయల్ ఎన్ఫీల్డ్ మాతృసంస్థ ఐషర్ మోటార్స్ ఎండీ సిద్ధార్థ్ లాల్ మాట్లాడుతూ..‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ సీ6, స్క్రాంబ్లర్-స్టైల్ ఫ్లైయింగ్ ఫ్లీ ఎస్6 పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఈవీ టెక్నాలజీకి కస్టమర్లలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా కంపెనీ ఉత్పత్తులను అందిస్తుంది. కంపెనీ ఆవిష్కరించిన ఈవీ బైక్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు’ అని అన్నారు.రెండో ప్రపంచ యుద్ధం నాటి బైక్అక్టోబర్ చివరి వారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పారాచూట్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో శత్రువులపై దండెత్తడానికి బైక్‌లను పారాచూట్ ద్వారా ల్యాండ్ చేశారు. అందుకు తగ్గట్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ తేలికపాటి బైక్‌లు తయారు చేసింది. అదే మాదిరి ఈ బైక్ టీజర్ విడుదల సమయంలో పారాచూట్ ద్వారా ల్యాండ్ చేసినట్లు చూపించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన తేలికపాటి మోటార్‌సైకిళ్లను యుద్ధం తర్వాత విక్రయించారు.ఇదీ చదవండి: హైదరాబాద్ గోదామును డీలిస్ట్ చేసిన జొమాటోఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియ్ ఫ్రేమ్బ్యాటరీ: బరువు తక్కువగా ఉండేందకు వీలుగా మెగ్నీషియమ్ బ్యాటరీ వాడారు.డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యుయెల్ ట్యాంక్ మాదిరిగా కనిపించే డిజైన్, ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది.డిస్ప్లే: టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు, వెనక డిస్క్ బ్రేకులుంటాయి.రేంజ్: ఒకసారి ఛార్జీ చేస్తే 150-200 కి.మీ ప్రయాణం చేసేందుకు వీలుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఈవీ బైక్ చూశారా? (ఫొటోలు)
-
ఎలక్ట్రిక్ వాహనాలు.. ఎన్నెన్నో అనుమానాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల్లో విద్యుత్ వాహనాలపై అనేక అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ వాహనాల వినియోగం విరివిగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా ఓ కారణం అయితే, మెయింటెనెన్స్ కూడా మరో కారణంగా పలువురు వినియోగదారులు చెబుతున్నారు.అయితే ధరల విషయంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని, సామాన్యులకు అందుబాటులో లేవని పలువురి వాదనలు వినిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలో అనేక కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండెడ్ కాగా మరికొన్ని హైబ్రిడ్ వెహికల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే విద్యుత్ వాహనాల గురించి సమాచారం తెలుసుకునే వారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.కంపెనీల వారీగా వాహనాల ధర, ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు. మన్నిక, లేటెస్ట్ ఫీచర్స్, ఇతర అంశాలపై ఆన్లైన్లో శోధించడం పరిపాటిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని, అన్నింటినీ సరిపోల్చుకున్నాకే నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే విద్యుత్తు మోటారు సైకిల్ వరకూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నా, కార్లు, ఆటో రిక్షాల విషయంలో వినియోగదారుల మన్ననలు పొందలేకపోతున్నాయి.ఛార్జింగ్ స్టేషన్ల కొరత.. ప్రధానంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు వెనుకాడటానికి నగరంలో సరైన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా నగర పరిధి దాటి బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాలకు ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లను విద్యుత్ ఛార్జింగ్ విషయంలో కనిపించడం లేదు. దీంతో లోకల్లో తిరగడానికి మాత్రమే విద్యుత్ వాహనాలు ఉపయోగపడతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నగరంలో విద్యుత్ వాహనాల అమ్మకాల సంఖ్య సైతం దీన్నే సూచిస్తోంది. టూవీలర్ కొనుగోలుకు సై.. ఇప్పటి వరకూ సుమారు 1.20 లక్షల విద్యుత్ మోటారు సైకిళ్లు మార్కెట్లో అమ్మకాలు జరగగా, కార్లు, ఆటో రిక్షా, ఇతర వాహనాలన్నీ కలపి సుమారు 16 వేలు అమ్ముడయ్యాయి. సాధారణంగా మోటారు సైకిళ్లు 70 శాతం ఉంటే, ఇతర వాహనాలు 30 శాతం ఉంటాయి. విద్యుత్తు వాహనాల విషయంలో ఇతర వాహనాల సంఖ్య 15 శాతం కంటే తక్కువ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.లాంగ్‌డ్రైవ్ వెళ్లాలంటే ఇబ్బంది హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలనుకుంటే బస్సు, ట్రైన్ నమ్ముకుంటే సమయానికి చేరుకోలేము. డ్యూటీ అయ్యాక రాత్రి బయలుదేరితే ఉదయం విశాఖ చేరుకునేట్లు ప్లాన్ చేసుకుంటాం. విద్యుత్ కారులో పోవాలంటే ఛార్జింగ్ సరిపోదు. ప్రతి 300 కిలో మీటర్లకు ఒక దఫా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఎక్కడైనా ఛార్జింగ్ పెడదాం అంటే సుమారు 6 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు అన్నారు. ఆ తరువాత కారు విలువలో సుమారు 40 శాతం బ్యాటరీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పెట్రోల్ కారు తీసుకున్నాను. – వై.రాజేష్, కేపీహెచ్‌బీ నెలకు రూ.3 వేల ఖర్చు తగ్గిందిరెండేళ్ల క్రితం ఈవీ మోటారు సైకిల్ కొన్నాను. ప్రతి 5 వేల కిలో మీటర్లకు సర్వీసింగ్ చేయించాలి. ఫుల్ ఛార్జింగ్ చేశాక ఎకానమీ మోడ్‌లో వెళితే 105 కిలో మీటర్లు వస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో వెళితే 80 కిలో మీటర్లు వస్తుంది. పెట్రోల్ స్కూటీకి నెలకు రూ.3,500 పెట్రోల్ అయ్యేది. ఈవీ కొన్నాక నెల కరెంటు బిల్లు రూ.500 నుంచి రూ.700కి పెరిగింది. అదనంగా రూ.200 పెరిగినా పెట్రోల్ రూ.3,500 వరకూ తగ్గింది. – గాదిరాజు రామకృష్ణంరాజు, హైటెక్ సిటీ -
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్‌లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్‌పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - వీడియో చూశారా?
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్‌ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్ఆర్మ్, మోనోషాక్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. View this post on Instagram A post shared by Royal Enfield (@royalenfield) -
ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీలో ఉన్న ఓలాపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత, అమ్మకాల తర్వాత సేవకు సంబంధించి 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు పరిష్కరించకపోవడంతో వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఓలాకు నోటీసును జారీ చేసింది. నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) ఏడాది కాలంగా ఓలా ఎలక్ట్రిక్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిందిగా కంపెనీలో ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినా వారు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ క్లాస్ యాక్షన్ కోసం ఈ ఫిర్యాదులను పరిశీలించడం ప్రారంభించింది.ఏడాదిలో ఎన్‌సీహెచ్‌కు 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయని గుర్తించింది. చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని సీసీపీఏ వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, సేవల్లో లోపాలు, తప్పుదారి పట్టించే దావాలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవలంభించడంతో సీసీపీఏ అక్టోబర్ 7న ఓలాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రతిస్పందించడానికి కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. సీసీపీఏ నుండి షోకాజ్ నోటీసు అందుకున్నట్టు అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇవీ ఫిర్యాదులు..ఉచిత సేవా వ్యవధి/వారంటీ సమయంలో చార్జీల వసూలు, సేవలు ఆలస్యం కావడంతోపాటు అసంతృప్తికరం, వారంటీ ఉన్నప్పటికీ సర్వీసు తిరస్కరణ లేదా ఆలస్యం, సరిపోని సేవలు, పునరావృతం అవుతున్న లోపాలు, అస్థిర పనితీరు, అధిక చార్జీలు, ఇన్వాయిస్లో తేడాలు ఉంటున్నాయని ఓలాపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే రీఫండ్ చేయకపోవడం, డాక్యుమెంటేషన్‌ను అందించడంలో వైఫల్యం, వృత్తిపర ప్రవర్తన, పరష్కారం కానప్పటికీ ఫిర్యాదుల మూసివేత, బ్యాటరీ, వాహన విడి భాగాలతో బహుళ సమస్యలను వినియోగదార్లు ఎదుర్కొంటున్నారు.చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!కాగా, నేషనల్ కంజ్యూమర్ హెల్ప్‌లైన్‌ను (ఎన్సీహెచ్) డిపార్ట్మెంట్ ఆఫ్ కంజ్యూమర్ అఫైర్స్ పునరుద్ధరించింది. వ్యాజ్యానికి ముందు దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఒకే పాయింట్‌గా ఎన్సీహెచ్ ఉద్భవించింది. ఇది దేశంలోని వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. వినియోగదారులు 17 భాషలలో టోల్–ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915 ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్, ఎన్సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమంగ్ యాప్‌ల ద్వారా బాధితులు తమ సౌలభ్యం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.తగ్గుతున్న విక్రయాలు.. భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ సెప్టెంబర్‌లో 23,965 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. యూనిట్ల పరంగా అమ్మకాలు 11 నెలల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఓలా మార్కెట్ వాటా 39 శాతం కాగా సెప్టెంబర్‌లో ఇది 27 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో ఏకంగా 52,136 యూనిట్లను కంపెనీ విక్రయించింది. చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?ఈ–టూ వీలర్స్ విక్రయాల పరంగా భారత్‌లో టాప్–2లో ఉన్న టీవీఎస్ మోటార్ కో స్థానాన్ని బజాజ్ ఆటో కైవసం చేసుకోవడం విశేషం. గత నెలలో బజాజ్ ఆటో 166 శాతం అధికంగా 18,933 యూనిట్లు విక్రయించింది. జనవరి–సెప్టెంబర్ కాలంలో ఈ కంపెనీ అమ్మకాలు దాదాపు మూడింతలై 1,19,759 యూనిట్లను సాధించింది. 21.47 శాతం మార్కెట్ వాటాను పొందింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొద్ది నెలల్లోనే బజాజ్ చేతక్ తొలి స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
దూసుకెళ్లే టాప్10 ఎలక్ట్రిక్ బైక్‌లు
ప్రస్తుతం దేశమంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన సమయంలో మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మంచి రేంజ్, స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ల చూస్తున్నారా? అయితే మీ కోసమే రయ్‌మంటూ దూసుకెళ్లే టాప్10 లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ (Revolt RV400 BRZ) భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌గా ప్రసిద్ధి చెందింది. అధిక పనితీరు, సొగసైన డిజైన్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. రివోల్ట్ ఆర్వీ400 బీఆర్జెడ్ లాంచ్‌తో కంపెనీ ఇటీవలే ఆర్వీ400ని అప్డేట్ చేసింది. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.ఓలా రోడ్‌స్టర్ ప్రో ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఓలా రోడ్‌స్టర్ సిరీస్ విడుదలతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది అత్యుత్తమ రేంజ్, పనితీరు, ఫీచర్లను అందిస్తుంది. విడుదల చేసిన మోడళ్లలో టాప్-ఎండ్ వేరియంట్, ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro). దీని ప్రారంభ ధర రూ.1,99,999. అత్యధిక రేంజ్ 579 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 194 కిలో మీటర్లు.రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ఇటీవల రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ రివోల్ట్ ఆర్వీ1, ఆర్వీ1+ (Revolt RV1 and RV1+)లను విడుదల చేసింది. ఆర్వీ1, ఆర్వీ1 ప్లస్ ఇప్పుడు దేశ మొట్టమొదటి కమ్యూటర్ మోటార్‌సైకిళ్లుగా నిలిచాయి. బేస్ మోడల్ ధర రూ. 84,990, ప్లస్ వెర్షన్ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్). టాప్ రేంజ్ 160 కిలో మీటర్లు.ఒబెన్ రోర్బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ (Oben Rorr). ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. స్టైలిష్ నియో-క్లాస్ డిజైన్ లుక్స్‌తో ఉన్న ఈ బైక్ ప్రతి రైడర్‌ను ఆకట్టుకుంటుంది. దీని రేంజ్ 187 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు. ధర రూ.1,49,999.అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్‌లలో అల్ట్రావయోలెట్ అత్యంత ఇష్టమైన పేర్లలో ఒకటి. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఉత్తమ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) దాని ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదలైంది. దీని రేంజ్ 323 కి.మీ. కాగా టాప్ స్పీడ్ 155 కి.మీ. ప్రారంభ ధర రూ.2,99,000.కొమాకి రేంజర్ ఎక్స్పీకొమాకి రేంజర్ పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. అవి రేంజర్, ఎం16. రేంజర్‌ను భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్‌గా చెప్తారు. ఇది భారీ, దృఢమైన చక్రాలు, అద్భుతమైన క్రోమ్ ఎక్స్టీరియర్స్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కొమాకి రేంజర్ ఎక్స్పీ (Komaki Ranger XP) రేంజ్ 250 కిలో మీటర్లు కాగా స్పీడ్ 70-80 కిలో మీటర్లు. ఇక దీని ధర రూ.1,84,300.మ్యాటర్ ఏరామ్యాటర్ ఎనర్జీ కంపెనీ గత ఏడాది తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరా (Matter Aera)ను విడుదల చేసింది. ఇది సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్తో స్పష్టమైన, వినూత్న సాంకేతికతను మిళితం చేస్తూ బోల్డ్, స్ఫుటమైన డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ రేంజ్ 125 కి.మీ.కాగా ధర రూ.1,73,999 నుంచి ప్రారంభమవుతుంది.టోర్క్ క్రాటోస్-ఆర్ అర్బన్పుణెకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌మేకర్ టోర్క్ మోటార్స్ కొత్త క్రాటోస్-ఆర్ మోడల్ ( Tork Kratos R Urban)ను విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌ను రోజువారీ ప్రయాణాల కోసం, అర్బన్ రైడర్లకు సౌకర్యంగా రూపొందించారు. దీని ధర రూ.1.67 లక్షలు. ఇది 105 కిలో మీటర్ల టాప్ స్పీడ్, 120 కిలో మీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది.ఒకాయ ఫెర్రాటో డిస్రప్టర్ఒకాయ ఈవీ ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఫెర్రాటో బ్రాండ్ కింద డిస్రప్టర్ (Okaya Ferrato Disruptor)పేరుతో మొదటి మోడల్‌ను పరిచయం చేసింది.ఫెర్రాటో డిస్రప్టర్ ఆధునిక, ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కి.మీ. కాగా 129 కిలో మీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ధర రూ.1,59,999.ఓర్క్సా మాంటిస్ఓర్క్సా ఎనర్జీస్ గత సంవత్సరం మాంటిస్ (Orxa Mantis) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రీమియం ధర కలిగిన మాంటిస్, పదునైన ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్ట్రైకింగ్ ట్యాంక్ కౌల్, విలక్షణమైన కట్లు,క్రీజ్‌లతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.3.6 లక్షలు. 221 కి.మీ.రేంజ్‌ను, 135 కి.మీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీను ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.Dear @nitin_gadkari,The reported quality issues with @OlaElectric or any other Electric Vehicle company for that matter is not between the company and their customers. It concerns each and every tax payer of this country.We've been giving huge subsidies to these companies… pic.twitter.com/rbCbkTHOhL— Congress Kerala (@INCKerala) October 7, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
విద్యార్థులు అద్భుత సృష్టి.. ఏకంగా నాలుగు రికార్డ్స్! (ఫొటోలు)
-
భారీగా తగ్గిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర.. ఎంతంటే.?
పండగ సీజన్ వస్తుందంటేనే చాలా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఆఫర్ వెల్లడించింది. సంస్థ తయారు చేసిన ఎస్1 బేసిక్ మోడల్‌ను రూ.50 వేల నుంచి అందిస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మోడల్ ధర సుమారు రూ.80 వేలు వరకు ఉంది.ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధానంగా బ్యాటరీకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. చాలా కంపెనీలు బ్యాటరీతోపాటు టెక్నాలజీను అందిస్తున్నాయి. దాంతో వాహనాల తయారీ వ్యయం పెరుగుతోంది. ఈ పండగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓలా ప్రకటన కొంత ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. అయితే వినియోగదారులు తమ అవసరాలు, వాహనంలోని సౌకర్యాలు, మన్నిక, ఇప్పటికే ఆ వాహనాన్ని ఎవరైనా వాడుతుంటే తమ అభిప్రాయం..వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. వాటిలో కస్టమర్ల అవసరాలు, ఆర్థిక వ్యయాన్ని పరిగణించి సౌకర్యంగా ఉండే వాహనాన్ని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆఫర్లకు మొగ్గు చూపకుండా వాహనం నాణ్యతకు పెద్దపేట వేయాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..! -
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
-
హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లు
న్యూఢిల్లీ: వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఈ ఏడాది దీపావళి నాటికి పది నగరాలకు కార్యకలాపాలను విస్తరించనుంది. గురువారం తమ అయిదో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రమణియం ఈ విషయం తెలిపారు.ఇటీవలే 1,000 వాహనాల డెలివరీలను పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,000 బైక్‌ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ఎఫ్77 మాక్ 2 మోడల్ ధర రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.99 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) ఉందని, ఒకసారి చార్జి చేస్తే 323 పైచిలుకు కిలోమీటర్ల రేంజి, గంటకు 165 కి.మీ. గరిష్ట వేగం ఉంటుందని నారాయణ్ వివరించారు. బ్యాటరీపై అత్యధికంగా 8,00,000 కి.మీ. వారంటీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్‌కి సంబంధించి 4 విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా జర్మనీ తదితర దేశాల్లో 50 పైచిలుకు సెంటర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు నారాయణ్ చెప్పారు. టీవీఎస్ మోటర్స్, శ్రీధర్ వెంబు (జోహో) తదితర ఇన్వెస్టర్లు సంస్థలో 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 400 కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. సుమారు 3,500 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైన హైదరాబాద్ స్టోర్‌లో సేల్స్, సర్వీస్, స్పేర్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. -
షో రూమ్ కే నిప్పు పెట్టిన యువకుడు
-
భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) అమ్మకాలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏడు నెలల కాలంలో ఒక మిలియన్ యూనిట్ల విక్రయాల మార్కును చేరుకోవడం విశేషం. 2024 జనవరి–జూలైలో దేశవ్యాప్తంగా 10,75,060 ఈవీలు రోడ్డెక్కాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైతో ముగిసిన ఏడు నెలల్లో ఈ–టూ వీలర్స్ 29 శాతం దూసుకెళ్లి 6,34,770 యూనిట్లు నమోదయ్యాయి. ఈ–త్రీ వీలర్స్ 26 శాతం ఎగసి 3,77,439 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ (కార్, ఎస్యూవీ, ఎంపీవీ) రిటైల్ అమ్మకాలు 21 శాతం అధికమై 56,207 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ–కమర్షియల్ వెహికిల్స్ ఏకంగా 190 శాతం వృద్ధి చెంది 6,308 యూనిట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 2,13,036 ఎలక్ట్రిక్ వెహికిల్స్ కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. జూలైలో 1,78,948 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది 2 మిలియన్లపైనే.. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2024లో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు 20 లక్షల యూనిట్లను దాటడం ఖాయంగా కనిపిస్తోందని పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. 2023లో ఈవీల విక్రయాలు దేశవ్యాప్తంగా 50 శాతం వృద్ధితో 15.3 లక్షల యూనిట్లను నమోదు చేశాయి. 2022లో ఈ సంఖ్య 10.2 లక్షల యూనిట్లు మాత్రమే. మొత్తం వాహన రంగంలో ఎలక్ట్రిక్ విభాగం 2023లో 6.38 శాతానికి చేరింది. 2021లో ఇది 1.75 శాతమే. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఈ– టూ వీలర్స్, ఈ– త్రీ వీలర్స్ వాటా ఏకంగా 95 శాతంపైమాటే. ఇక ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను (ఈఎంపీఎస్) 2024 సెపె్టంబర్ వరకు పొడిగించింది. వాస్తవానికి ఈఎంపీఎస్ సబ్సిడీ పథకం జూలై 31న ముగియాల్సి ఉంది. మౌలిక వసతులు ‘చార్జింగ్’.. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల మార్కెట్ దేశంలో ఊహించనంతగా వృద్ధి చెందుతోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2022 ఫిబ్రవరిలో 1,800 ఉంది. 2024 మార్చి నాటికి ఈ సంఖ్య ఏకంగా 16,347కు చేరిందని ప్రొఫెషనల్ సరీ్వసుల్లో ఉన్న ఫోరి్వస్ మజర్స్ నివేదిక వెల్లడించింది. పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, అధికం అవుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఈవీల డిమాండ్ దేశంలో దూసుకెళుతోంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లోని మొత్తం ప్రయాణికుల వాహనాల మార్కెట్లో దాదాపు మూడింట ఒక వంతు ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బలమైన మౌలిక సదుపాయాల విస్తరణ కీలకం. 2030 నాటికి భారత రోడ్లపై 5 కోట్ల ఈవీలు పరుగెడతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. 40 వాహనాలకు ఒక కేంద్రం చొప్పున లెక్కిస్తే ఏటా భారత్‌లో 4,00,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఫోరి్వస్ మజర్స్ తెలిపింది. -
ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అనే పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని ప్రకటించింది. రోడ్‌స్టర్ ప్రో , రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ అనే మూడు వేరియంట్లను గురువారం తమ వార్షిక ఈవెంట్ “సంకల్ప్” సందర్భంగా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 2,49,999 మధ్య ఉండనున్నాయి. మూడు మోడల్స్‌కు రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.చౌకైన రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ మోడల్‌లు 2.5 KwH నుంచి 6 Kwh బ్యాటరీ బ్యాక్‌లతో వస్తాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. అలాగే ప్రీమియం రోడ్‌స్టర్ ప్రో 8 KwH, 16 KwH వేరియంట్లలో 2025 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఓలా రోడ్‌స్టర్ ఎక్స్రోడ్స్టర్ ఎక్స్ 11 kW గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు- 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఉన్నాయి. వీటిలో టాప్ వేరియంట్ 124 కి.మీ గరిష్ట వేగం, 200 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తోపాటు 4.3-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్లను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. 2.5 kWh వేరియంట్ ధర రూ. 74,999, 3.5 kWh రూ. 84,999, 4.5 kWh మోడల్ ధర రూ. 99,999.ఓలా రోడ్స్టర్రోడ్స్టర్ 13 kW మోటారుతో ఆధారితమైనది. ఇందులో 3.5 kWh, 4.5 kWh, 6 kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ గరిష్టంగా 126 కి.మీ గరిష్ట వేగం, 248 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. 6.8-అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, ప్రాక్సిమిటీ అన్‌లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటు కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్‌వాచ్ యాప్, రోడ్ వంటి ఏఐ- పవర్డ్ ఫీచర్లతో వస్తుంది. మోటార్‌సైకిల్ ముందు, వెనుక వైపున డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. 3.5 kWh మోడల్ ధర రూ. 1,04,999, 4.5 kWh రూ.1,19,999, 6 kWh ధర రూ.1,39,999.ఓలా రోడ్‌స్టర్ ప్రోఈ శ్రేణి మోటర్ సైకిళ్లు 52 kW గరిష్ట పవర్ అవుట్‌పుట్, 105 Nm టార్క్‌తో కూడిన మోటారుతో వస్తాయి. 16 kWh వేరియంట్ 194 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 579 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైనది మాత్రమే కాకుండా అత్యంత సమర్థవంతమైన మోటార్‌సైకిల్‌గా కూడా నిలిచింది. రోడ్‌స్టర్ ప్రోలో 10-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లకు ఏబీఎస్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 8 kWh వేరియంట్ ధర రూ. 1,99,999, 16 kWh వేరియంట్ ధరను రూ. 2,49,999 లుగా కంపెనీ పేర్కొంది. -
ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిక్ ఎక్స్పో
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్(సెటా) ఆగస్టు 29 నుంచి 31వ తేదీ వరకు హైటెక్స్‌లో ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వహిస్తున్నదని, జాతీయ స్థాయిలో పేరొందిన ఎలక్ట్రిక్ కంపెనీలు బ్రాండ్లు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని సెటా అధ్యక్షుడు సురేష్‌జైన్ తెలిపారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈ ఎక్స్‌పోకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ఎక్స్‌పోలో సుమారు 180 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇది అతిపెద్ద ఎక్స్పో కాబోతున్నదని తెలిపారు. -
మీడియాటెక్‌తో జియోథింగ్స్ జట్టు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సంస్థ మీడియాటెక్, జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ జియోథింగ్స్ జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించాయి. ఇది టూవీలర్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్స్‌ను అందిస్తుంది.ఈ విభాగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ మొదలైన వాటికి స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుగుతుంది. జియో వాయిస్ అసిస్టెంట్, జియోసావన్ మొదలైన సర్వీసులు ఉండే జియో ఆటోమోటివ్ యాప్ సూట్‌కి ఈ ప్లాట్‌ఫాం ద్వారా యాక్సెస్ లభిస్తుంది. -
ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల రీకాల్
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐకూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఐకూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నారు. వాహనాల సామర్థ్యం ఎలాఉందో నిర్థారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్‌ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీసు చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి డీలర్ భాగస్వాములు వ్యక్తిగతంగా కస్టమర్లను సంప్రదిస్తారని సంస్థ పేర్కొంది. -
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్ స్కూట్ మార్కెట్‌కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్డీసీ మోటార్‌కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. -
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా మార్చి నెలలో 1,37,146 యూనిట్లు రోడ్డెక్కితే.. గత నెలలో ఈ సంఖ్య సగానికంటే క్షీణించి 64,013 యూనిట్లకు పరిమితమైంది. సబ్సిడీ మొత్తం తగ్గడం, కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం.ఎన్నికల సీజన్ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ–టూవీలర్ల సంఖ్య 66,873 యూనిట్లు. 2024 జనవరి, ఫిబ్రవరిలో ప్రతినెలా 82 వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఫేమ్–2 సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా 1,37,146 యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది.కంపెనీలు మోడల్‌నుబట్టి రూ.4,000లతో మొదలుకుని రూ.16,000 వరకు ధరలను పెంచడం గమనార్హం. అయితే నూతన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000, ఈ–రిక్షా, ఈ–కార్ట్‌కు రూ.25,000, ఈ–ఆటోకు రూ.50,000 సబ్సిడీ ఆఫర్ చేస్తారు. ఇక ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కో, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్‌లో నిలిచాయి.ఇవి చదవండి: అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్.. -
అత్యంత చౌకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ దిగ్గజం ఓలా కీలక ప్రకటన చేసింది. తన తక్కువ ధర ఎస్1 ఎక్స్ మోడల్ ధరల్ని మరింత తగ్గిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కేంద్రం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌లకు సబ్సిడీ ఇచ్చేది. ఆ తర్వాత ఆ సబ్సిడీపై కోత విధించింది. దీంతో అప్పటి వరకు ఊపందుకున్న ఈవీ కొనుగోళ్లు, అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తమ వాహనల అమ్మకాల్ని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన వేరియంట్ ధరను 12.5శాతం తగ్గించిందని,తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావిస్తుంది. ఓలా దాని ఎస్1ఎక్స్ మోడల్ చౌకైన వేరియంట్ ధర రూ.79,999 నుండి రూ.69,999లకు తగ్గించిందని కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. ఇతర ఎస్1ఎక్స్ వేరియంట్ల ధరలు 5.6 శాతం, 9.1శాతం మధ్య తగ్గించినట్లు సమాచారం. ' ఓలా ఎస్1 ఎక్స్ (4కేడబ్ల్యూహెచ్) ఇప్పుడు దాని ధర రూ.1.09 లక్షల నుండి రూ.10,000 తగ్గి రూ.99,999 చేరింది. 3 డబ్ల్యూకేహెచ్ వేరియంట్ ధర రూ.84,999 కాగా.. 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే చవకైన వెర్షన్ రూ. 69,999 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. -
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి, ఇద్దరు మహిళలతో పాటు ఒక వృద్ధునికి గాయలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు,, పక్కనే ఉన్న గోడ కూలిపోయాయని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధిపతి యాసిన్ తాడ్వి తెలిపారు. శాంతి నగర్‌లోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాటరీ పేలిపోయిందని అధికారి తెలిపారు. ఛార్జింగ్ కోసం ఇంట్లోనే బైక్ పెట్టుకున్నారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో 28 ఏళ్ల మహిళ, పొరుగింట్లో ఉంటున్న 66 ఏళ్ల వృద్ధుడు, 56 ఏళ్ల మహిళ గాయపడ్డారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారి తెలిపారు. బ్యాటరీ పేలిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా రూ.40 వేల తగ్గింపు
-
ఈవీలపై ఎంత దూరమైనా ప్రయాణించేలా..
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. క్రమంగా వాటి అమ్మకాలు హెచ్చవుతున్నాయి. కానీ విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టి చాలాకాలం అయినా ఇప్పటికీ వాటికి బ్యాటరీ సమస్యగానే ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఛార్జింగ్రాక ఇబ్బందులు పడుతున్నారు. మార్గ మధ్యలో వాటిని ఛార్జ్ చేసుకోవాలన్నా చాలా సమయం పడుతుంది. అందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను అధిగమించేలా క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ, బ్యాటరీ స్మార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇదీ చదవండి: రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే.. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల బ్యాటరీను మార్చుకోవచ్చు. ఈ ఒప్పందం దేశంలోని అతిపెద్ద బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సహకారం ద్వారా 25 నగరాల్లోని 900కి పైగా స్వాప్ స్టేషన్ల్లో ‘బ్యాటరీ స్మార్ట్’ కంపెనీకు చెందిన బ్యాటరీలను క్వాంటమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం మార్చుకోవచ్చు. దాంతో క్వాంటమ్ వినియోగదారులు దూరప్రయాణాలు వెళ్తున్నపుడు పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని రెండు నిమిషాల్లో పొందే వీలుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఓలా మైండ్‌బ్లోయింగ్ ఆఫర్..అస్సలు మిస్సవ్వద్దు!
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధరల్ని రూ.25 వేల వరకు తగ్గించినట్లు వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ వాహనదారులకు మొత్తం మూడు మోడళ్లపై ఈ భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఓలా అఫిషియల్ వెబ్సైట్ ప్రకారం.. ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ధర రూ.79,999 (ఎక్స్ షోరూం ధర) ఉండగా, ఓలా ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,999 (ఎక్స్ షోరూం ధర), ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్ షోరూం) కే అందిస్తుంది. You asked, we delivered! We’re reducing our prices by upto ₹25,000 starting today for the month of Feb for all of you!! Breaking all barriers to #EndICEage! Valentine’s Day gift for all our customers 🙂❤️🇮🇳 pic.twitter.com/oKFAVzAWsC — Bhavish Aggarwal (@bhash) February 16, 2024 వాహన్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనరిలో ఓలా సంస్థకు మొత్తం 31000 యూనిట్ల ఆర్డర్లు వచ్చాయి. ఈ మొత్తం 2023 డిసెంబర్ నెలలో 30000 యూనిట్లు ఉన్నాయని హైలెట్ చేసింది. కాగా, ఓలా సంస్థ ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మార్కెట్ షేరు 40 శాతం ఉందని వాహన్ నివేదిక వెల్లడించింది. -
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ప్రముఖ కంపెనీ.. ధర ఎంతంటే..
విద్యుత్ వాహనాల వినియోగదారులు ఛార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, గురుగావ్, బెంగళూరులో ఈ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన దిల్లీ-ఛండీగఢ్, దిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, ముంబై-నాసిక్ రోడ్లపై ఐదు అల్ట్రా ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు రోజంతా తెరిచివుండనున్నాయని సంస్థ తెలిపింది. ఒక్కో స్టేషన్లలో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయిని చెప్పింది. హ్యుందాయ్ కస్టమర్లతోపాటు ఇతర కస్టమర్లు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగ్‌డ్రైవ్ చేసేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయని పేర్కొంది. ఇదీ చదవండి: డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్’.. ఎక్కడో తెలుసా.. కేవలం 21 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుండడంతో సమయం ఆదాకానుందని పేర్కొంది. 30 కిలోవాట్ల ఛార్జర్ ఒక్కో యూనిట్‌పై రూ.18, 60 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్‌పై రూ.21, 150 కిలోవాట్ల ఛార్జర్ యూనిట్‌కు రూ.24 ధర నిర్ణయించారు. ఛార్జింగ్ స్లాట్‌ను ముందస్తు బుకింగ్‌తోపాటు చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ ఏడాదిలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వివరించింది. -
సంచిలో పట్టే ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే?
ఎక్కడకు వెళ్లినా అక్కడ ఒక వాహనం అందుబాటులో ఉంటే ఆ సౌకర్యమే వేరు. రైళ్లలోను, విమానాల్లోను దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లు గమ్యం చేరుకున్నాక ఆటో లేదా ట్యాక్సీని ఆశ్రయించక తప్పదు. వెంట సొంత వాహనాన్ని తీసుకువెళ్లగలిగితే బాగుంటుందనుకున్నా, అందుకు వీలుండదు. అయితే, ఎక్కడకైనా తేలికగా సంచిలో పెట్టుకుని తీసుకుపోగలిగే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జపాన్‌కు చెందిన ‘ఆర్మా’ ఇటీవల విడుదల చేసింది. పని పూర్తయ్యాక దీన్ని సులువుగా మడిచేసుకుని సంచిలో లేదా సూట్‌కేసులో సర్దేసుకోవచ్చు. దీని బరువు 4.5 కిలోలు మాత్రమే! అంటే, స్కూలు పిల్లల పుస్తకాల బ్యాగు కంటే తక్కువే! కాబట్టి దీనిని మోసుకుపోవడం కష్టమేమీ కాదు. దీని గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు. రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో వాహనాల మధ్య కాస్తంత చోటులోంచి దీనిపై సులువుగా ప్రయాణించవచ్చు. దీని ధర 1.35 లక్షల యువాన్లు (రూ.76,203) మాత్రమే! -
ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ 190 కిలోమీటర్లు.. ధర ఎంతంటే?
ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ఓలా బడ్జెట్ వేరియంట్ బైక్ ఎక్స్ ఎక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్‌తో రూ.1.10లక్షలకే (ఎక్స్-షోరూమ్) ఈ బైక్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ కొత్త వేరియంట్ బైక్‌కు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే చాలు 190 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. ఛార్జింగ్ పెట్టేందుకు 6 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది. టాప్ స్పీడ్ 90 కేఎంపీఎహెచ్ వరకు ప్రయాణం చేయొచ్చని ఓలా యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త ఈవీ వేరియంట్‌తో పాటు, 8 ఏళ్ల వరకు ఎక్స్ టెండెండ్ వారెంటీని ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ సదుపాయం అన్నీ వాహనాలకు వర్తిస్తుంది. ఇందుకోసం వాహనదారులు రూ.5వేలు చెల్లించి 1,25,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశాన్ని ఓలా కల్పిస్తుంది. బుకింగ్స్ ప్రారంభం ఎప్పుడంటే? ఓలా ఎస్1 ఎక్స్ 4 కేడబ్యూహెచ్ డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. ఓలా ఎస్1 ఎక్స్ రెడ్ వెలాసిటీ, మిడ్నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. -
ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి..
ఎంత రుచికరమైనఫుడ్ అయినా వేడిగా లేకపోతే తినాలనిపించదు. పిజాలూ, బర్గర్లూ వంటివి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. బయటికి వెళ్లి అలా తిందామంటే అన్ని సార్లూ కుదరదు. అందుకని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటారు. కానీ రోడ్లపై ట్రాఫిక్ వల్ల ఆర్డర్ వచ్చేవరకు అదికాస్త చల్లబడిపోతుంది. ఈ సమస్యకు డోమినోస్ సంస్థ పరిష్కారం ఆలోచించింది. ఏకంగా ఓవెన్‌ను ఏర్పాటు చేసిన సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో వినియోగదారుడి వద్దకు వచ్చాక ఆర్డర్ చేసిన పిజ్జాలు, బర్గర్లను వేడిచేసి డెలివరీ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. బ్యాటరీతో నడిచే ఈ-సైకిళ్ల వల్ల పర్యావరణానికి హానికలగదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో భారత్‌లో దీన్ని అమలు చేయనున్నట్లు తెలిసింది. -
చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్‌లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు సాధారణ సైకిల్‌కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్‌కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు. (Image credit: Skarper / Red Bull) ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్‌ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్‌కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్‌బాక్స్‌గా పనిచేస్తుంది. బైక్‌పై కస్టమ్ డిస్క్‌ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది. కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్‌ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు. -
విద్యుత్ వాహనాలు.. 2023లో ఎక్కువగా అమ్మిన సంస్థలు ఇవే..
దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. 2022లో 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా.. 2023లో అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు(3 కోట్లు) చేరుకుంటుందని అంచనా. 2023లో అమ్ముడైన మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. అందులో ఓలా కంపెనీ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 2022లో 1.1 లక్షల మేరకు అమ్ముడైన ఓలా వాహనాలు 2023లో మాత్రం 140శాతం పెరిగి ఏకంగా 2.62 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. తర్వాతి స్థానంలో టీవీఎస్, ఏథర్, బజాజ్ కంపెనీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగనున్న నేపథ్యంలో ఈ సంస్థలకు భారీగా లాభాలు రాబోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీలో వారీగా 2023లో రిజిస్టర్ అయిన విద్యుత్ వాహనాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఇదీ చదవండి: రెనో కార్లలో కొత్త వేరియంట్లు వచ్చాయి.. చూశారా? ఓలా ఎలక్ట్రిక్: 2,62,020 టీవీఎస్: 1,65,190 ఏథర్: 1,03,804 బజాజ్: 70,274 యాంపెర్: 42,909 ఒవినావా: 31,519 హిరో ఎలక్ట్రిక్: 29,925 హిరో: 10,967 ప్యూర్: 7,141 రెవోల్ట్: 6,922 లెక్ట్రిక్స్: 6,185 జితేంద్ర ఎలక్ట్రిక్: 2,597 -
FAME-3: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ పూర్తిగా ఎత్తేస్తారా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూ వీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. కానీ ఈ పరిస్థితి మారబోతోంది.. ఎందుకు.. ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ - FAME) పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది స్కీమ్ మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా రెండో విడత కూడా ప్రస్తుతం ముగింపు దశ వచ్చేసింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో మొత్తానికే ఎత్తేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3)ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు సమాచారం. ఇదీ చదవండి: ‘ఆ కార్లు భారత్‌లోకి ఎప్పటికీ రావు.. రానీయను’ ఆర్థిక శాఖ వ్యతిరేకత దేశంలోని ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఫేమ్-3 అమలును కేంద్ర ఆర్థిక శాఖ వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రభుత్వంలోని ఇతర శాఖలు సైతం దీనిపై అయిష్టతను కనబరుస్తున్నాయి. ఇప్పటికే సబ్సిడీలో కోత ఫేమ్-2 స్కీములో సబ్సిడీని ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో తగ్గించింది. దీంతో అప్పట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తగ్గింది, కానీ ఇప్పుడు స్థిరంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి వాహనదారులు సబ్సిడీ కోసం కాకుండా క్లీనర్ ఎనర్జీ వాహనాలపై ఆసక్తితో క్రమంగా అటువైపు మళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీంతోపాటు ఫేమ్-2 స్కీములో ఎలక్ట్రిక్ వాహన సంస్థలు అక్రమాలకు పాల్పడటం కూడా ఈ స్కీము ముగింపునకు కారణంగా భావిస్తున్నారు. -
మీకు తెలుసా..? 'మిస్టర్ ఈట్ ఆల్' తను ఒక అద్భుతం!
ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..? ► మిస్టర్ ఈట్ ఆల్.. ఫ్రాన్స్‌కు చెంది మైఖేల్ లోటిటోకు ‘మిస్టర్ ఈట్ ఆల్’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్ వరల్డ్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్ పసర్ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్‌ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్ టాలెంట్‌తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు. ► బ్రెజిల్ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్ సైజ్ బైక్‌లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్‌లు కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ► ‘ఫేస్ బుక్’ వచ్చాక ‘అన్‌ఫ్రెండ్’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్ ఆఫ్ ఇన్జ్యుర్డ్ ఇనోసెన్స్’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్ చేశారు. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు శుభవార్త!
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు దారులకు ఓలా శుభవార్త చెప్పింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై రూ.20,000 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ బైక్ ధర రూ.1,09,999 ఉండగా.. ధర తగ్గింపుతో రూ.89,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ కొత్తగా ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ కొనుగోలు దారులకు మాత్రమే అందుబాటులో ఉందని ఓలా పేర్కొంది. ఓలా ఎస్1ఎక్స్ సిరీస్‌లోని ఓలా ఎస్1 ఎక్స్ 3 కిలోవాట్ల బ్యాటరీ, ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలో వాట్ల బైక్‌లను కొనుగోలు చేసే వారికి ఈ ఆఫర్ పొందలేరని వెల్లడించింది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 3 వాట్ల బ్యాటరీతో జతచేసిన 6కిలో వాట్ల మోటార్‌ను అందిస్తుంది. ఇందులో మొత్తం మూడు రైడ్ మోడ్లు ఉన్నాయి. వాటిల్లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్. ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40కేపీఎంహెచ్ నుండి 3.3 సెకన్లలో, 5.5 సెకన్లలో 0-60 కేపీఎంహెచ్ వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం 90కేఎంపీహెచ్. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ రేంజ్ ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 151కిమీ అయితే, ఒరిజినల్ రేంజ్ ఎకో మోడ్‌లో 125కిమీ, సాధారణ మోడ్‌లో 100కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. 500డబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఇంట్లో కేవలం ఏడు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లోని ఫీచర్ల విషయానికొస్తే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టైలాంప్తో వస్తుంది. 5 అంగుళాల ఎస్సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, డిజిటల్ కీ, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్,క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
ఈ వారం భారత్‌లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్‌గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్‌తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
వేడర్ ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీ షురూ.. ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ వేడర్ మోటర్‌బైక్ డెలివరీలను డిసెంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. వాహన నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) సర్టిఫికేషన్ లభించినట్లు సంస్థ సీఈవో నెమిన్ వోరా తెలిపారు. 7 అంగుళాల ఆండ్రాయిడ్ డిస్ప్లే, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 125 కి.మీ. రేంజి, గంటకు 85 కి.మీ. టాప్ స్పీడ్, కాంబీ బ్రేకింగ్ సిస్టం, 4 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అయ్యే లిథియం అయాన్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. -
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
-
మంచుదారుల్లోనూ దూసుకెళ్లే ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే?
చాలావరకు ద్విచక్ర వాహనాలు సమతలమైన రోడ్ల మీదనే సజావుగా నడుస్తాయి. ప్రత్యేకంగా దృఢమైన టైర్లతో రూపొందించినవి ఎగుడు దిగుడు దారుల్లోనూ ప్రయాణించగలవు. మంచు పేరుకుపోయిన దారుల్లో నడిచే వాహనాలు చాలా అరుదు. నిత్యం భారీగా మంచు కురిసే దేశాల్లో వాహనాలు నడపడం అంత తేలిక కాదు. రోడ్ల మీద గాని, ఎగుడు దిగుడు కొండ దారుల్లో గాని ఎంతగా మంచు పేరుకుపోయినా తేలికగా నడపగల ద్విచక్ర వాహనాన్ని రూపొందించింది కెనడియన్ కంపెనీ ‘రాకీ మౌంటెయిన్’. ‘పవర్ ప్లే’ పేరుతో ఎగుడు దిగుడు మంచుదారుల్లోనూ అత్యంత సునాయాసంగా దూసుకుపోయే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తీర్చిదిద్దింది. దీనికి అమర్చిన ‘డైనేమ్–4.0’ మోటారు గరిష్ఠంగా 700 వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, అడుగుకు 79 పౌండ్ల శక్తితో చక్రాలు తిరిగేలా చేస్తుంది. దీనివల్ల వాహనం మంచును చీల్చుకుంటూ దూసుకుపోగలదు. మంచు దారుల్లో ప్రయాణించే ‘పవర్ ప్లే’ బైక్ ‘ఎ50’, ‘ఎ30’ మోడల్స్‌లో దొరుకుతుంది. వీటి ధరలు 6199 డాలర్లు (రూ.5.15 లక్షలు), 5889 డాలర్లు (రూ.4.89 లక్షలు). -
యమహా ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉందో చూశారా?
-
నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు నెలకు రూ.70,000 సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక చెల్లింపు పద్దతిని ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. బెంగళూరుకి చెందిన రైడర్లు ముందుగా ఓలా ఎస్1 బైక్‌ని అద్దెకు తీసుకోవాలని, తద్వారా నెలకు రూ.70,000 సంపాదించుకోవచ్చంటూ ఓలా అధినేత భవిష్ అగర్వాల్ తెలిపారు. రైడ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సందించుకోవచ్చో వివరించారు. డబ్బులు ఎలా సంపాదించాలి? రైడర్లు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5,000 చెల్లించి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ బైక్‌ను అద్దెకు తీసుకోవాలి. ఇందుకోసం డ్రైవర్లు పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు, వినియోగంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అనతరం తాము రూపొందించిన ప్రత్యేక చెల్లింపులు ప్రకారం.. రైడర్లు కస్టమర్లకు సేవలు అందిస్తే కమిషన్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చని భవిష్ విడుదల చేసిన ఓ పాంప్లెట్లో పేర్కొన్నారు. ఓలా విడుదల చేసిన పాంప్లెట్లో ఏముందంటే? బెంగళూరులోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేసిన చెల్లింపు పద్దతి ప్రకారం.. 10 నుంచి 14 బుకింగ్స్ వరకు ఫిక్స్డ్ పేమెంట్ రూ.800 వరకు చెల్లిస్తుంది. అందులో ప్రతి రోజు రెంటల్ కింద రూ.100 చెల్లించాలి. ఇక, 15 నుంచి 19 బుకింగ్స్ వరకు ఇన్సెంటీవ్ రూపంలో రూ.1,300 వరకు సంపాదించవచ్చు. అందులో రెంటల్ అమౌంట్ రూ.50గా నిర్ధేశించింది. అయితే, రోజుకు 20 కంటే ఎక్కువ రోజువారీ బుకింగ్‌ల కోసం డ్రైవర్లు రోజువారీ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా రోజుకి రూ.1,800 నుండి రూ. 2,800 పరిధిలో సంపాదించవచ్చు. వాళ్లు మాత్రం అనర్హులే అదే సమయంలో, డ్రైవర్లు వారి బుకింగ్‌లు రోజుకు 10 కంటే తక్కువ ఉంటే రోజువారీ స్థిర ఆదాయానికి అర్హులు కాదు. అయితే వారు అద్దె మొత్తంగా రూ. 300 చెల్లించాలని ఓలా తెలిపింది. ప్రయాణీకుల కోసం,ఓలా గత నెలలో షేర్ చేసిన రేట్ చార్ట్ ప్రకారం, బైక్ టాక్సీ సర్వీస్ కోసం 5 కిలోమీటర్లకు రూ. 25, 10 కిలోమీటర్లకు రూ. 50 చొప్పున నిర్ణయించింది. తక్కువలో తక్కువగా నివేదిక ప్రకారం, పూర్తిగా ఛార్జ్ చేయబడిన ఓలా ఎస్1 ఏ స్కూటర్ 70-75 కిమీల దూరం ప్రయాణం చేయొచ్చు. రూ. 800 ఇన్సెంటీవ్ పొందడానికి రైడర్ 10 రైడ్లను పూర్తి చేయాల్సి ఉండగా..ఏడు-ఎనిమిది ట్రిప్పుల తర్వాత వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. స్కూటర్ పూర్తిగా రీఛార్జ్ చేయడానికి ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చివరిగా.. రైడర్లు ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాల్ని తెలుసుకునేందుకు అధికారిక పేజీని సంప్రదించాలని ఓలా ప్లాంపెట్లో హైలెట్ చేసింది. చదవండి👉 ఓలాకు భారీ షాక్, తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సీఈవో భవీష్ అగర్వాల్! -
టీవీఎస్–బీఎండబ్ల్యూ తొలి ఎలక్ట్రిక్ బైక్ తయారీ ప్రారంభం
హోసూరు: బీఎండబ్ల్యూ మోటోరాడ్ సహకారంతో టీవీఎస్ మోటార్ కంపెనీ, తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘సీఈ 2’ తయారీని శుక్రవారం హోసూరు ప్లాంట్‌లో ప్రారంభించింది. బీఎండబ్ల్యూ, టీవీఎస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ జీ310 సీసీ మోటారు సైకిల్ లక్షన్నర వాహనాన్ని విడుదల చేశారు. టీవీఎస్ మోటార్, బీఎండబ్ల్యూ మోటార్ సంయక్తంగా బీఎండబ్ల్యూ జీ310ఆర్, బీఎండబ్ల్యూ 310 జీఎస్, బీఎండబ్ల్యూ జీ310ఆర్ఆర్, టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310, టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 310 వాహనాలను విక్రయిస్తున్నాయి. ఇరు కంపెనీలు అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్ సీఈ02ను తొలుత యూరప్ మార్కెట్లో విక్రయించనున్నారు. తర్వాత భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈ2 తయారీ, 310 సీసీ బైక్ 1,50,000 యూనిట్‌ను ఒకే రోజు ఉత్పత్తి చేయడం ప్రత్యేక సందర్భంగా కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ గ్రూప్ విక్రయాల్లో టీవీఎస్ మోటార్ వాటా 12 శాతంగా ఉంటుందని తెలిపారు. రెండు గ్రూపుల మధ్య బంధం మరిన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సాహోరే.. టాప్ స్పీడ్ స్టార్స్!
‘ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ నాలెడ్జ్’ అంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘ఊహాశక్తి’కి ఉండే అపారమైన శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ ఇద్దరు మిత్రులకు ఊహాశక్తితో పాటు సాంకేతిక నైపుణ్యశక్తి కూడా ఉంది. ఈ రెండు శక్తులను సమన్వయం చేసుకుంటూ కాలేజీ రోజుల నుంచి చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆ ప్యాషన్ వారిని ఎంటర్ప్రెన్యూర్లుగా మార్చి బైక్ మార్కెట్లోకి అడుగు పెట్టేలా చేసింది. ఈవీ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’తో స్పీడ్‌గా దూసుకుపోతున్నారు...2006లో... బెంగళూరులోని బీఎంఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నారాయణ్ సుబ్రమణ్యం, నీరజ్ రాజ్‌మోహన్‌లు ఐఐటీ, మద్రాస్ నిర్వహించిన పోటీలో ఎయిర్–ప్రొపెల్డ్ వాటర్ క్రాఫ్ట్ రూపొందించి ‘బెస్ట్ డిజైన్’ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఎన్నో ఐఐటీ టీమ్‌లు పాల్గొన్నాయి. కట్ చేస్తే... ఈ ఇద్దరు ఎలక్ట్రిక్ సూపర్ బైక్ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నారాయణ్, నీరజ్‌లకు స్కూలు రోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోట్స్ అంటే ఇష్టం. కాలేజీలో చేరే నాటికి ఆ ఇష్టం మరోస్థాయికి చేరింది. అన్నిరకాల ఎయిర్ క్రాఫ్ట్‌లు, రోబోట్స్,హైడ్రోప్లెయిన్స్, ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు తయారుచేసేవారు. దేశవ్యాప్తంగా ఎన్నో పోటీల్లో పాల్గొనేవారు. సూపర్‌బైక్ తయారు చేయాలనేది వారి కల. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి. పై చదువుల కోసం నీరజ్ కాలిఫోర్నియా, నారాయణ్ స్వీడన్ వెళ్లారు. ఆ తరువాత టాప్ ఆటోమోటివ్ కంపెనీలలో పనిచేశారు. అయితే ఇద్దరిలోనూ ఏదో అసంతృప్తి ఉండేది. వారు అనేకసార్లు మాట్లాడుకున్న తరువాత ‘ఏదైనా సాధించాలి’ అనే నిర్ణయానికి వచ్చారు. అలా బెంగళూరు కేంద్రంగా ఈవీ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’కు శ్రీకారం చుట్టారు. ఆటోమోటివ్, కన్జ్యూమర్ టెక్, ఏరో స్పేస్ నిపుణులతో గట్టి బృందాన్ని తయారుచేసుకున్నారు. ఈ మిత్రద్వయం మోటర్ఫీల్డ్కు కొత్త కాబట్టి వారి టీమ్‌లో చేరడానికి తటపటాయించేవారు. అయితే కాస్త ఆలస్యంగానైనా ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందరిలాగే తమ స్టార్టప్‌కు కరోన కష్టాలు మొదలయ్యాయి. తమ ఫస్ట్ ఆల్–ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ బైక్ ఎఫ్ 77 మోడల్ తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటున్న సమయంలో ‘ఎఫ్77’ను రీవ్యాంప్ చేశారు. ‘భిన్నమైన సంస్కృతులు, అభిరుచులు ఉన్న మనలాంటి దేశంలో ఈవీలతో మెప్పించడం అనేది పెద్ద సవాలు. ఈ టెక్నాలజీ గురించి చాలామంది అపోహలతో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి మైండ్‌సెట్‌ను మార్చాలనుకున్నాం. ఈవీలో మాకు సాధ్యమైన కొత్త ఫీచర్లు తీసుకువచ్చాం. మా అల్ట్రావయోలెట్‌కు ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు స్ఫూర్తి. మాకు కొత్త ఆవిష్కరణలు అంటే ఆసక్తి’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్’ కో–ఫౌండర్, సీయివో నారాయణ్. ఇక ఇద్దరి అభిరుచుల విషయానికి వస్తే...నీరజ్ పుస్తకాల పురుగు. పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా తనకు కొత్త ఐడియాలు వస్తాయి అంటాడు. ఇక నారాయణ్‌కు ‘క్రియేటివిటీ అండ్ ఫిట్నెస్’ ఇష్టమైన సబ్జెక్ట్. అయితే టెక్నికల్ స్కిల్స్ విషయంలో మాత్రం ఇద్దరికీ సమ ప్రతిభ ఉంది. నారాయణ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్‌లో, రాజ్‌మోహన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్‌లో ఎక్స్పర్ట్. ‘మేము అద్భుతాన్ని సృష్టించాలనుకున్నాం. అనుకోవడానికైతే ఎన్నైనా అనుకోవచ్చు. ఆచరణలో మాత్రం రకరకాల సవాళ్లు ఎదురొస్తుంటాయి. వాటిని తట్టుకొని నిలబడడమే అసలు సిసలు సవాలు. అలాంటి సవాలును అధిగమించి మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్’ ఫౌండర్లలో ఒకరైన నీరజ్. (చదవండి: చీట్ ఆఫ్ ది డే! దొంగ డీల్స్!) -
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
గందరగోళం ట్రాఫిక్‌లో వాహనాలను నడపటమే ఒక పరీక్ష అయితే, వాటిని భద్రంగా పార్క్ చేయడం మరో పెద్ద పరీక్ష. తేలికగా నడపటానికి, సులువుగా పార్క్ చేసుకోవడానికి వీలుగా మడిచేసుకోవడానికి అనువైన ఈ–బైక్ అందుబాటులోకి వచ్చేసింది. సాదాసీదా సైకిల్లా కనిపించే ఈ ద్విచక్ర వాహనం రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. బ్యాటరీ చార్జింగ్ తోవలో అయిపోయినా, దీని పెడల్స్ తొక్కుతూ ముందుకు సాగిపోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘యాడ్మోటార్స్’ ఇటీవల ‘ఫోల్డ్టాన్ ఎం–160’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రయాణం పూర్తయ్యాక దీనికి క్షణాల్లోనే మడతపెట్టేసుకోవచ్చు. దీనిపై ఆఫీసులకు వెళ్లేవారు ఆఫీసులకు చేరుకున్నాక, దీన్ని మడిచేసుకుని తాము పనిచేసే చోట టేబుల్స్ కింద భద్రపరచుకోవచ్చు. పార్కింగ్ ఇబ్బందులు తొలగించడానికి రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర 1899 డాలర్లు (రూ.1.55 లక్షలు) మాత్రమే! -
Ola Electric Bike Concept: మునుపెన్నడూ చూడని ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైకులు (ఫొటోలు)
-
బడ్జెట్ ధరలో, ఓలా నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలా శుభవార్త చెప్పింది. భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా కస్టమర్ డే ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా బడ్జెట్ ధరలో ఓలా ఎస్ 1 ఎక్స్‌తో పాటు ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్ ధర రూ.79,000 (ఎక్స్ షోరూం) ఉండగా, ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 2 ధర రూ.1.47 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్‌ను మూడు వేరింట్లలలో అందిస్తుంది. ఎస్1 ఎక్స్ ప్లస్, 2కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్, 3కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్లలో టాప్ ఆఫ్ ది లైన్ మోడల్‌తో ఎక్స్ ప్లస్ 5.0 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఎక్స్ మోడల్‌లు 3.5 అంగుళాల డిస్ప్లేతో వస్తాయి. కానీ రెండింటి పనితీరు ఒకేలా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్ కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఓలా సంస్థ వెహికల్ బాడీ తయారీ కోసం బ్లాక్ ప్లాస్టిక్‌ను ఉపయోగించింది. ఇక, ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1 ఎక్స్3 రెండూ 6 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 3కేడబ్ల్యూహెచ్ ఛార్జర్‌తో వస్తున్నాయి. ఈ రెండు వేరియంట్ల రేంజ్ 151 కిలోమీటర్లు కాగా, టాప్ స్పీడ్ 90 కేఎంపీఎంహెచ్తో డ్రైవ్ చేయొచ్చు. 3.3 సెకండ్లలో 0 నుంచి 40కేఎంపీహెచ్ వరకు వెళుతుంది. ఓలా ఎస్1 ఎక్స్2 6కే డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్తో 2కేడబ్ల్యూ బ్యాటరీ ఛార్జర్‌ను అందిస్తుంది. లోయర్ రేంజ్ స్పీడ్ 91కేఎం, లోయర్ టాప్ స్పీడ్‌తో 85కేఎంపీహెచ్‌తో వెళ్లొచ్చు. కేవలం రూ.999 చెల్లించి ఆగస్ట్ 15 పర్వదినాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 21 వరకు పరిచయ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందులో భాగంగా ఓలా ఎస్1 ఎక్స్ప్లస్ను రూ.99,999కే సొంతం చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నాయి. ఎస్1ఎక్స్3, ఎస్1 ఎక్స్2 ప్రీ రిజర్వేషన్ కోసం కేవలం రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎస్1 ఎక్స్3 వెహికల్ ధర రూ.89,999 ఉండగా, ఎస్1 ఎక్స్2 ధర రూ.79,999గా ఉంది. కేవలం ఈ ఆఫర్ నేటి నుంచి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్ ఓలా ఎస్1 ఎయిర్ జనరేషన్ 2ను లాంచ్ చేసింది. బ్యాటరీని రీడిజైన్ చేసి విడుదల చేయడంతో వెహికల్ పనితీరు అద్భుతంగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు పవర్ట్రయిన్లో మార్పులు చేసి 11 డబ్ల్యూ మోటార్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎస్1 ప్రో జనరేషన్ 2 ‘0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అధిగమించవచ్చు. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్. పరిధి 195 కిలో మీటర్లుగా ఉంది. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, వెనుకవైపు మెరుగైన మోనోషాక్ ఉన్నాయి. ఇది స్కూటర్ 6 కిలోల బరువు తగ్గడానికి సహాయపడింది. కొత్త ఓలా ఎస్ ప్రో జనరేషన్ 2 ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, పరిచయ) ధరలతో సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. అదరగొట్టేస్తున్న ఓలా బైక్‌లు ఈ సందర్భంగా ఓలా మరికొద్ది రోజుల్లో నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేస్తామని ప్రకటించింది. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ పేరిట వావ్ అనిపించేలా ఉన్న కాన్సెప్ట్ బైక్స్‌ను ప్రదర్శించింది. 2024 చివరికల్లా మార్కెట్‌కు పరిచయం చేయనుంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను అమ్మాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తోంది. చదవండి👉 ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! -
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ-కామర్స్ సైట్లో భారీ డిస్కౌంట్!
REVOLT RV400 electric bike sale on Amazon: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ రెవోల్ట్ మోటర్స్ అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రెవోల్ట్ ఆర్వీ 400 బైక్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ బైక్ వాస్తవ ధర రూ.1.54 లక్షలు. అయితే ఈ ఈ-కామర్స్ సైట్లో నేరుగా రూ. 15 వేల డిస్కౌంట్‌తో రూ.1.39 లక్షలకు లిస్ట్ చేసింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎస్బీఐ కార్డు ద్వారా వచ్చే తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కలుపుకొంటే మొత్తంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐలో ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ఏకంగా రూ. 10,500 వరకు వడ్డీ డిస్కౌంట్ పొందొచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, ఏడాది వరకు టెన్యూర్‌తో నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. రెవోల్ట్ 400 ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. -
ఇక ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. ప్రకటించిన రాయల్‌ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ రాబోయే రెండేళ్లలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేయాలని చూస్తోంది. ఇందుకోసం కోసం 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. ఉత్పత్తి మాడ్యులర్ పద్ధతిలో క్రమంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో 90 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన రాయల్ ఎన్ఫీల్డ్ తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ అవసరాలను అంచనా వేయడానికి ఒక వాణిజ్య బృందాన్ని నియమించినట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రోటోటైప్‌ను పరీక్షిస్తున్నామని, రెండేళ్లలో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తామని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. భారతదేశంలో మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్ల మార్కెట్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. కంపెనీ గత త్రైమాసికంలో 225,368 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయించిందని, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం పెరిగిందని ఆయన వివరించారు. ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా), బజాజ్ ఆటో రాబోయే నెలల్లో దాదాపు డజను మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్లను రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా తీసుకొస్తున్నాయి. గత నెలలో బజాజ్-ట్రయంఫ్ భారతదేశంలో రెండు 400సీసీ మోడళ్లను విడుదల చేసింది. అలాగే హార్లే డేవిడ్సన్తో కలిసి హీరో మోటర్ కార్ప్ అభివృద్ధి చేసిన X440 బైక్ డెలివరీలను త్వరలో ప్రారంభించాలని భావిస్తోంది. -
లాంగ్రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 200 కిలోమీటర్లు!
నోయిడా: ఎనిగ్మా ఆటోమొబైల్స్ కంపెనీ యాంబియర్ ఎన్8 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక్క చార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ ప్రకటించింది. అంతేకాదు బ్యాటరీని వేగంగా 2–4 గంటల్లోనే చార్జ్ చేసుకోవచ్చని, ఎలక్ట్రిక్ స్కూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని పేర్కొంది. మార్కెటింగ్‌లో పనిచేసే వారు, రెండు పట్టణాల మధ్య ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాంబియర్ ఎన్8ను తీసుకొచ్చినట్టు తెలిపింది. పర్యావరణ అనుకూలమైన వాహనా న్ని ఆకర్షణయమైన ధరకే అందిస్తున్నట్టు పేర్కొంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,05, 000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంది. 100 వాట్ మోటార్‌తో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సీటు కింద 26లీటర్ల స్టోరేజీ స్పేస్ కూడా ఉంది. -
వినియోగదారులకు ఓలా గుడ్ న్యూస్
-
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో శుభవార్త!
ప్రమఖ ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ ఓలా వాహన కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల పాటు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయంతో వినియోగదారులకు ఓలా ఈవీ బైక్‌ను కొనుగోలు చేయడం మరింత సులభతరం కానుంది. ఇటీవల కేంద్రం ఎలక్ట్రిక్ బైక్స్‌కు అందించే ఫేమ్-2 సబ్సిడీలో కోత పెట్టింది. దీంతో వాహనాల అమ్మకాలు తగ్గాయి. ఈ తరుణంలో వాహనాల సేల్స్‌ను పెంచేలా ఓలా తన ప్రత్యర్ధి సంస్థ ఎథేర్ అందిస్తున్నట్లుగానే ఎస్10 రేంజ్ వాహనాల్ని అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి👉‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! మార్కెట్లోని ఇతర సంస్థల కంటే తామే అతి తక్కువ వడ్డీతో డౌన్ పేమెంట్ చెల్లించే అవసరం లేకుండా 6.99 శాతంతో 60 నెలల పాటు ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఓలా ప్రతినిధులు తెలిపారు. గతంలో, ఫైనాన్స్ కంపెనీలు ఈవీ వెహికల్స్‌పై 36 నెలలు మాత్రమే లోన్ సౌకర్యాన్ని అందించేవి. పండగలతో పాటు కొన్ని సందర్భాలలో 48 నెలలకు పొడిగించేవి. అయితే, ఓలా ఎలక్ట్రిక్ మాత్రం దేశం మొత్తం 60 నెలల పాటు లోన్ సౌకర్యాన్ని అందిస్తుండడం విశేషం. చదవండి👉ట్రాన్సామెరికా డీల్ రద్దు.. టీసీఎస్‌కు 15 వేల కోట్ల నష్టం! -
ఫాక్స్‌కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి?
ప్రపంచంలోనే అతిపెద్ద యాపిల్ ఐఫోన్ తయారీ ఫాక్స్‌కాన్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందట. ఈమేరకు ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈ-బైక్ మార్కెట్లో రానున్నకాలంలో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను రిలీజ్ చేయాలని భావిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఐఫోన్ తయారీదారు తన వార్షిక నివేదికలో ఆగ్నేయాసియాలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్లాంట్‌ను స్థాపించడానికి కంపెనీకి సహాయం చేస్తుందని పేర్కొంది. దీనిపై ఫాక్స్‌కాన్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించడానికి భారతీయ ప్రతినిధి బృందం త్వరలో తైవాన్ను సందర్శించాలని యోచిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పలు బ్రాండ్ ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను తయారు చేస్తుందా లేదా జాయింట్ వెంచర్ ద్వారా ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతుందా అనేది స్పష్టత లేదు. (టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ: బిగ్ డీల్ నుంచి ట్రాన్సామెరికా ఔట్!) కాగా ఇప్పటికే తమిళనాడులో పెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ మహారాష్ట్రలో కూడా ఈవీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంది. అటు తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. (అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!) -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్‌షిప్‌లలో 35–40 శాతం డీలర్‌షిప్‌లను దశలవారీగా అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఏ బైక్ ఎంత ధర పెరిగిందంటే!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలకు రెక్కలొచ్చాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. సవరించిన ఫేమ్–2 సబ్సిడీ జూన్ 1 నుండి అమలులోకి రావడమే ఇందుకు కారణం. వేరియంట్‌ను బట్టి ఐక్యూబ్ ధరను రూ.17–22 వేల మధ్య పెంచినట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో గతంలో ఐక్యూబ్ బేస్ రూ.1,06,384, ఎస్ ట్రిమ్ ధర రూ.1,16,886 ఉంది. ఏథర్ 450ఎక్స్ ప్రో ధర సుమారు రూ.8,000 అధికం అయింది. దీంతో ఈ మోడల్ ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1,65,435లకు చేరింది. ‘ఫేమ్–2 సవరణ ఫలితంగా సుమారు రూ.32,000 సబ్సిడీ తగ్గింది. అయినప్పటికీ దేశంలో ఈవీ స్వీకరణను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ధరల ప్రభావంలో భారీ భాగాన్ని కంపెనీ గ్రహిస్తోంది’ అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోకెలా తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ టూ–వీలర్లు రూ.15,000 వరకు ప్రియం అయ్యాయి. దీంతో ఎస్1–ప్రో రూ.1,39,999, ఎస్1 రూ.1,29,999, ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999 పలుకుతోంది. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయ తగ్గింపు ఉన్నప్పటికీ జూన్ నుండి ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచామని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవీశ్ అగర్వాల్ చెప్పారు. ధర పెంచడం లేదు.. ఈ–స్కూటర్ మోడల్స్ ధరలను పెంచబోమని హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ టూ–వీలర్ల స్వీకరణను ప్రోత్సహించడానికి, వాటి యాజమాన్య ఖర్చుపై ఉన్న అపోహలను తొలగించడానికి అంకితభావంతో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ‘ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు రావాల్సిన సబ్సిడీలు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వద్ద 15 నెలలకు పైగా నిలిచిపోయాయి. మాపై తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ మేము చేయగలిగినంత వరకు మా ప్రస్తుత ధరలను కొనసాగుతాయి. తద్వారా వినియోగదారులకు సరసమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో మా వంతు కృషిని కొనసాగిస్తాము’ అని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ వివరించారు. లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్.. ‘రాబోయే కొన్ని త్రైమాసికాలలో ఫేమ్–2 సబ్సిడీ క్రమంగా తగ్గుతుంది. దేశంలోని ద్విచక్ర వాహనాల్లో కాలుష్య రహిత టూ–వీలర్ల వ్యాప్తిని ప్రోత్సహించడానికి కంపెనీ మెరుగైన ఉత్పత్తులు, గొప్ప విలువను అందించడం కొనసాగిస్తుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ అన్నారు. ఫేమ్–2 సబ్సిడీలో కోత తర్వాత ఖర్చు భారాన్ని తగ్గించడానికి పరిమిత కాలానికి 2023 మే 20 వరకు బుకింగ్స్ చేసిన ఐక్యూబ్ కస్టమర్ల కోసం కంపెనీ లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్‌ను అందిస్తుందని వివరించారు. ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం కిలోవాట్‌కు రూ.10,000 ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ ప్రోత్సాహకాలపై పరిమితిని ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెంచేందుకు మూడేళ్ల కాల పరిమితితో ఫేమ్ పథకాన్ని 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత ఈ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించారు. -
జూన్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై వర్తించే ఫేమ్ 2 (FAME-II) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద అందించే సబ్సిడీని ప్రభుత్వం తగ్గించింది. 2023 జూన్ 1 ఆ తర్వాత కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుంది. అంటే జూన్ 1 తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల ధరలు గణనీయంగా పెరుగుతాయి. గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ప్రోత్సాహకం ప్రతి కొలో వాట్-అవర్ (kWh)కి రూ. 10,000 మాత్రమే ఉంటుంది. అది కూడా వాహనాల ఎక్స్-షోరూం ధరలో గరిష్టంగా 15 శాతం మాత్రమే ఉంటుంది. ఇది గతంలో 40 శాతం ఉండేది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీలు జూన్ 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అయితే తమ ద్విచక్ర వాహనాల ధరలు రూ.32,500 వరకు పెరుగుతాయని ఏథర్ ఎనర్జీ అనే కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, పరిశ్రమలు సబ్సిడీ లేకుండా జీవించడం నేర్చుకోవాలని ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా అన్నారు. 2019లో రూ.30,000 ఉన్న సబ్సిడీ 2021లో రూ.60,000కి పెరిగిందని, ఇప్పుడు రూ.22,000 తగ్గిందని ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీని ప్రోత్సహించడానికి ఫేమ్ (FAME) (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని 2019 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో మూడేళ్ల కాలానికి దీన్ని ప్రకటించినా తర్వాత 2024 మార్చి 31 వరకు మరో రెండేళ్ల కాలానికి పొడిగించింది. ఇదీ చదవండి: Heavy Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు! -
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్ఎంఈవీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావం దీర్ఘకాలం పరిశ్రమపై ఉంటుందని వివరించింది. అయితే ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోని స్టార్టప్ కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. 2023 జూన్ 1 లేదా ఆ తర్వాత నమోదయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మార్పులు చేస్తూ నోటిఫై చేసింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు రూ.10,000 సబ్సిడీ ఉంటుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో ప్రస్తుతం ఉన్న 40 శాతం నుండి 15 శాతానికి చేర్చారు. ప్రభుత్వ చర్యతో ముడి చమురు దిగుమతుల అధిక బిల్లులకు, చాలా భారతీయ నగరాల్లో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యానికి దారితీయవచ్చని సొసైటీ వివరించింది. సున్నితమైన ధర.. ‘వాస్తవికత ఏమిటంటే భారతీయ మార్కెట్లో ధర సున్నితంగా ఉంటుంది. మొత్తం ఖర్చుకు వెనుకాడతారు. ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరు. పెట్రోలు ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రూ.1 లక్ష కంటే తక్కువ ధర కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ కోసం రూ.1.5 లక్షలకు పైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి’ అని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. మార్కెట్ వృద్ధి చెందే వరకు కస్టమర్‌కు సబ్సిడీలను కొనసాగించాలి. దేశంలో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఈవీల వాటా 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతం చేరుకోవడానికి నిరంతర రాయితీలు అనువైనవి. అయితే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితమే దీని గురించి సూచనను ఇచ్చింది. నాలుగేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోబోతున్నామని, ఆ తర్వాత సబ్సిడీని కొనసాగించలేమని స్పష్టం చేసిందని గిల్ చెప్పారు. అకస్మాత్తుగా సబ్సిడీని నిలిపివేయడం, బడ్జెట్‌ను బాగా తగ్గించడం లేదా ఈ–త్రీవీలర్ల బడ్జెట్ నుండి కొంత ఖర్చు చేయని డబ్బును మళ్లించడం ద్వారా మిగిలిన సంవత్సరాన్ని ఎలాగైనా నిర్వహించడం మినహా మంత్రిత్వ శాఖకు మరో మార్గం లేదని అన్నారు. సమయం ఆసన్నమైంది.. సబ్సిడీని 15 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, డిమాండ్ ఉందని స్పష్టమైందని వోల్టప్ కో–ఫౌండర్ సిద్ధార్థ్ కాబ్రా తెలిపారు. సబ్సిడీ తగ్గింపు తక్షణ ప్రభావంతో ధరల పెరుగుదలతోపాటు అమ్మకాలు తగ్గుతాయి. అయితే ప్రభుత్వం ఒక విధంగా పరిశ్రమను స్వతంత్రంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. పరిశ్రమ, ప్రభుత్వం ఈ రంగానికి ఊతమిచ్చేలా నాణ్యత, భద్రత విషయంలో రాజీ పడకుండా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను రూపొందించడంలో సహాయపడే సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధి విధానాన్ని రూపొందించడానికి కృషి చేయాలి’ అని కాబ్రా పిలుపునిచ్చారు. హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కో–ఫౌండర్ నిఖిల్ భాటియా మాట్లాడుతూ ప్రభుత్వ చర్యకు మద్దతు ఇస్తూనే.. ‘ఈవీ పరిశ్రమ తనంతట తానుగా నిలబడటానికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ వాహనాల విభాగం దీర్ఘకాలిక పురోగతి, జీవనోపాధికి మరింత ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉండాలి. రాయితీలను తొలగించడం అనేది ముందుకు సాగే చర్య. సబ్సిడీలపై ఆధారపడటం క్రమంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సబ్సిడీలు ఇకపై అవసరం లేదు. ఫేమ్–2 సబ్సిడీని తగ్గించడం, తొలగించడం సరైన దిశలో స్వాగతించే దశ’ అని భాటియా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
మా ఎలక్ట్రిక్ బైక్‌లు మామూలుగా ఉండవు: రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ప్రత్యేకమైన, విభిన్నమైన ఎలక్ట్రిక్ బైక్‌లను అభివృద్ధి చేస్తోందని ఆ కంపెనీ సీఈవో గోవిందరాజన్ తెలిపారు. వీటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పెట్టుబడి పెట్టడం ప్రారంభించామని, చెన్నై ప్లాంట్ పరిధిలో సప్లయర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ‘ఈవీ ప్రయాణంలో, మేము స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఈవీ ప్రయాణం ఇప్పుడు టాప్ గేర్‌లో ఉందని నేను చెప్పగలను. బలమైన రాయల్ ఎన్ఫీల్డ్ డీఎన్ఏతో ప్రత్యేకంగా విభిన్నమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రూపొందించడమే మా లక్ష్యం’ అని విశ్లేషకులతో సమావేశంలో గోవిందరాజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై బలమైన దీర్ఘకాలిక ఉత్పత్తి, సాంకేతికత రోడ్‌మ్యాప్‌ను రూపొందించామని, సప్లయర్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నామని వెల్లడించారు. దేశీయ మార్కెట్లో నెట్వర్క్ విస్తరణ గురించి మాట్లాడుతూ కంపెనీ ప్రస్తుతం దేశమంతటా దాదాపు 2,100 రిటైల్ అవుట్లెట్లను కలిగి ఉందని వివరించారు. రూ.1000 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఇతర అంశాలపై దృష్టి సారించిన రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,000 కోట్ల క్యాపెక్స్‌ను ప్రకటించింది. ఇందులో కొంత భాగం ప్రస్తుత పెట్రోల్ బైక్‌ల తయారీ, కొత్త వాటి అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!
ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే ఆ భారం కస్టమర్లపై పడే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక యాప్! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ప్రస్తుతం ఫేమ్ (FAME) 2 పథకం కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న దానిపై చాలా కాలంగా అనేక పుకార్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను పూర్తిగా నిలిపివేయనుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారికంగా ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని నిర్ణయించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త ఫార్ములాను ప్రతిపాదించినట్లు ఫినాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంటోంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 40 శాతం ప్రకారం కిలోవాట్‌కు ఇస్తున్న రూ.15,000 సబ్సిడీ రూ.10,000లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. సబ్సిడీపై గరిష్ట పరిమితిని కూడా ప్రస్తుత 40 శాతం నుంచి ఎంఆర్పీలో 15 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రూ.1.5 లక్షల ధర, 3.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌పై ప్రస్తుతం రూ.52,500 సబ్సిడీ వస్తుంది. కొత్త ఫార్ములా ప్రకారం సబ్సిడీ రూ.22,500 లకు తగ్గిపోతుంది. ఫేమ్ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్! స్పీడ్ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్ -
డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుతున్న అదరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి, విడుదల చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే 'యులు' (Yulu) కంపెనీ వైన్ (Wynn) అనే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త వైన్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 55,555 మాత్రమే (ఎక్స్-షోరూమ్). ఈ ధర కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తరువాత ఇది రూ. 64,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 999 రిఫండబుల్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత మరిన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే డెలివరీలు మే 2023 నుంచి ప్రారంభమవుతాయి. కలర్ ఆప్షన్స్: యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి స్కార్లెట్ రెడ్ కలర్, మూన్ లైట్ కలర్. ఇవి రెండూ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) బ్యాటరీ & రేంజ్: యులు వైన్ ఎలక్ట్రిక్ బైక్ బజాజ్ చేతక్ యాజమాన్యంలో ఉన్న చేతక్ టెక్నాలజీస్ లిమిటెడ్ తయారు ఛేస్విది. ఇందులో 984.3 వాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 68 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు, కావున ఈ బైక్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. (ఇదీ చదవండి: ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!) కొత్త యులు వైన్ బైక్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ మల్టిపుల్ మొబిలిటీ ఫ్యాక్స్ పొందుతుంది. కావున బ్యాటరీ యాజ్-ఏ-సర్వీస్ సబ్స్‌స్క్రిప్షన్ మీద నెలవారీ చార్జీలను ఉపయోగించుకోవచ్చు. దీనికింద నెల చార్జీలు రూ. 499 నుంచి రూ. 899 వరకు ఉంటాయి. దీని వల్ల రైడింగ్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్లాన్ ద్వారా కిలోమీటరుకు 70 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. చూడటానికి బైక్ చిన్నగా ఉన్నప్పటికీ 100 కేజీలు పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. -
ఎలక్ట్రిక్ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోండి!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి వచ్చిన తరువాత మనకు ఏం కావాలన్నా వెంటనే ఆర్డర్ పెట్టస్తాం.. అది మనకు డోర్ డెలివరీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ బైకులు కూడా ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న మ్యాటర్ (Matter) ఎలక్ట్రిక్ బైకుని ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మ్యాటర్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ద్వారా ఈ విధంగా విక్రయించడానికి నిర్ణయించింది. కాబట్టి మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలో మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.44 లక్షలు. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా ఈ బైకులు ఒకే విధంగా ఉన్నప్పటికీ రేంజ్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. టాప్ మోడల్ 150 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన అన్ని మోడల్స్ 125కిమీ రేంజ్ మాత్రమే అందిస్తాయి. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!) మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ మంచి డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ టర్న్ సిగ్నెల్స్ ఇతర మోడల్స్ మాదిరిగా కాకుండా ఫ్యూయెల్ ట్యాంక్ మీద ఏర్పాటు చేశారు. స్ప్లిట్ సీటు, క్లిన్ ఆన్ హ్యాండిల్ బార్లు, పిలియన్ సీటు కోసం స్ల్పిట్ గ్రబ్ రైల్ వంటి వాటితో పాటు బై ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్ లైట్ కొత్తగా ఉంటుంది. ఇవన్నీ చూసేవారికి ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త బైక్ 7.0 ఇంచెస్ LCD టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్‌కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఇందులో రిమోట్ లాక్/అన్‌లాక్, జియో ఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, వెహికల్ హెల్త్ మానిటరింగ్, ఛార్జింగ్ స్టేటస్, పుష్ నావిగేషన్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: కొత్త యాడ్‌లో రచ్చ చేసిన సమంతా.. వీడియో వైరల్) దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కొనుగోలుదారులకు మరింత చేరువలో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ విక్రయిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మోహన్ లాల్ భాయ్ అన్నారు. గతంలో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలు తప్పకుండా మాతో పంచుకోండి. -
సాయుధ బలగాల కోసం వీర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్: కన్జూమర్ టెక్నాలజీ సంస్థ ఉడ్చలో కొత్తగా వీర్‌బైక్ పేరిట ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఆవిష్కరించింది. సాయుధ బలగాల కోసం దీర్ఘకాలం మన్నే, చౌకైన రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సాహిల్ ఉత్తేకర్ తెలిపారు. (ఇదీ చదవండి: రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!) మన్నికైన తేలికపాటి ఫ్రేమ్, ఎలక్ట్రిక్ కటాఫ్‌లతో డిస్క్ బ్రేక్‌లు, సర్దుబాటు చేసుకోగలిగే సీటు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఏడాది వారంటీ తదితర ప్రత్యేకతలు ఈ విద్యుత్ బైక్‌లో ఉంటాయని సంస్థ సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. ఆలివ్ గ్రీన్, నేవల్ వైట్, ఎయిర్‌ఫోర్స్ బ్లూ తదితర అయిదు రంగుల్లో ఈ బైక్‌లు లభ్యమవుతాయని తెలిపారు. -
జిప్ ఎలక్ట్రిక్ లక్ష ఈ–స్కూటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ జిప్ ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది చివరినాటికి ఒక లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్లను జొమాటో సహకారంతో ప్రవేశపెట్టనుంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జొమాటోకు కావాల్సిన డెలివరీ భాగస్వాములను సైతం జిప్ అందించనుంది. ఇప్పటికే డెలివరీ సేవల్లో 13,000 పైచిలుకు ఎలక్ట్రిక్ స్కూటర్లు నిమగ్నమయ్యాయని జిప్ వెల్లడించింది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారాలన్న జొమాటో దీర్ఘకాలిక ప్రణాళికలో ఈ భాగస్వామ్యం ఒక భాగమని తెలిపింది. 50కి పైచిలుకు అగ్రిగేటర్స్, ఈ–కామర్స్ క్లయింట్లకు జిప్ ఎలక్ట్రిక్ సేవలు అందిస్తోంది. -
ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.50వేలు లోపే .. అస్సలు మిస్ అవ్వొద్దు!
రద్దీగా ఉండే రోడ్లు, భారీ ట్రాఫిక్ జామ్ సమయాల్లో కార్లలో ప్రయాణించడం చాలా కష్టం. అందుకే అలాంటి క్లిష్ట సమయాల్లో ప్రయాణం సాఫిగా జరిగేలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు మొగ్గు చూపుతుంటారు. మీరూ అలా తక్కువ బడ్జెట్లో అంటే రూ.50 వేలకే స్కూటర్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరల్లో స్కూటర్లను అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం ధర తక్కువ, మైలేజ్, నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తూ ప్రయాణానికి సౌకర్యంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ‘టీవీఎస్ ఎక్స్ఎల్ 100 (TVS XL100)’ పేరుతో 6 మోడళ్లు, 15 రకాల రంగులతో రూ.46,671 నుంచి రూ.57,790 ధరతో స్కూటర్లను అందిస్తుంది. 99పీపీ బీఎస్6 ఇంజిన్‌తో 4.4 హార్స్ పవర్, 6.5 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. వెహికల్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 89 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 4 లీటర్లు.సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ కిల్‌స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (డీఆర్ఎల్)తో వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన వెహికల్స్‌లో ఇదొకటి. కొమాకి ఎక్స్‌జీటీ కేఎం Komaki XGT KM ఎలక్ట్రిక్ స్కూటర్. ఢిల్లీ కేంద్రంగా 35ఏళ్ల నుంచి ఆటోమొబైల్ రంగంలో రాణిస్తున్న కేఐబీ కొమాకి సంస్థకు చెందిన ఈ స్కూటర్లో అండర్‌సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్, డిటాచబుల్ బ్యాటరీ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకునేందుకు వీలుగా స్థలం ఉంది. అదనంగా Komaki XGT KM డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ లాక్ ఇలా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనపు భద్రత కోసం ముందు చక్రం డిస్క్ బ్రేకులు అమర్చబడ్డాయి. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, XGT KM 130-150కిమీల పరిధిని కవర్ చేయగలదు. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 6-8 గంటలు పడుతుంది. అవాన్ ఇ లైట్ Avon E Lite దేశీయంగా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇదికొటి. కేవలం రూ. 28,000కి కొనుగోలు చేయొచ్చు. పూర్తి ఛార్జ్ తర్వాత, E లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 50 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఫుల్ ఛార్జింగ్ చేసేందుకు 4-8 గంటలు పడుతుంది. లోహియా ఓమా స్టార్ Lohia Oma Star దేశీయంగా తయారు చేసింది. క్లచ్ తక్కువ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సీటు కింద స్టోరేజ్ బాక్స్‌ను కలిగి ఉంది. స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 60 కిమీ/ఛార్జ్ వరకు ప్రయాణించగలదు. దీని ప్రారంభం ధర రూ.41,444 ఉండగా.. ఖరీదైన వేరియంట్ ధర రూ.51,750కే కొనుగోలు చేయొచ్చు. ఎవాన్ ఈ స్కూట్ Avon E Scoot 65 కిమీ/ఛార్జ్ పరిధితో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.45,000 నుంచి రూ. 50,000 లోపు అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. టెక్కో ఎలక్ట్రా నియో Techo Electra Neo భారత్‌లో తయారైంది. రూ. 41,919 ధరతో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్. నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది. టెక్కో ఎలెక్ట్రా నియో మోటారు 250 డబ్ల్యూ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ ముందు, వెనుక రెండు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్ సుమారు 5-7 గంటలు పడుతుంది.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, డిజిటల్ స్పీడోమీటర్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్,విశాలమైన స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఇతర సదుపాయాలు ఉన్నాయి. -
‘AI’తో పనిచేసే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే?
చూడటానికి మామూలు సైకిలు మాదిరిగా ఉన్న ఈ–బైక్ ఇది. ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ–బైక్స్ కంటే చాలా తేలికైనది. దీని బరువు దాదాపు 15 కిలోలు మాత్రమే! దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఇది నిరాటంకంగా 113 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. రోడ్డుపైన ఇది గంటకు 32 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో పయనిస్తుంది.ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ‘ఏసెర్’ ఈ తేలికపాటి ఈ–బైక్‌ను ‘ఈబీ’ పేరిట రూపొందించింది. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. ప్రయాణించే దారిలోని రోడ్ల పరిస్థితిని బట్టి తనంతట తానే గేర్లు మార్చుకుంటుంది. డ్రైవర్ సౌకర్యానికి, వాహనం నడిపే తీరుకు అనుగుణంగా సర్దుకుంటుంది. దీని ధర 999 డాలర్లు (సుమారు రూ.82 వేలు) మాత్రమే! -
ఒడిస్సే కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రూ. 999తో బుక్ చేసుకోండి!
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఒడిస్సే ఎలక్ట్రిక్ (Odysse Electric) తన రెండవ ఎలక్ట్రిక్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి రేంజ్ అందించేలా రూపుదిద్దుకుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ (Odysse Vader Electric) బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం మార్చి 31 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జులైలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. డిజైన్: ఈ బైక్ చూడగానే ఆకర్శించే మంచి డిజైన్ పొందుతుంది. ఇది డ్యూయెల్ టోన్ ఫినిష్, ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్, హాలోజెన్ ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్స్, స్పోర్టీ డెకల్స్, అలాయ్ వీల్స్, చిన్న ఫ్లై స్క్రీన్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ 14 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు: మార్చిలో ఏకంగా..) ఫీచర్స్: కొత్త ఒడిస్సే వాడర్ ఎలక్ట్రిక్ బైకులో 7 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ ఉంటుంది. కావున వినియోగదారుడు దీని ద్వారా బ్లూటుత్ కనెక్టివిటీ ఆప్షన్ పొందటమే కాకుండా.. బైక్ లొకేటింగ్, జియో ఫెన్సింగ్, లో బ్యాటరీ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు. బ్యాటరీ & రేంజ్: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త వాడర్ ఎలక్ట్రిక్ బైక్ IP67 రేటెడ్ 3.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ పొందుతుంది. ఇది 170 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 125 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది రైడర్ ఎంచుకునే రైడింగ్ మోడ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ కేవలం 4 గంటల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. -
భారీగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు: మార్చిలో ఏకంగా..
భారతీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ మంచి అమ్మకాలను పొందుతూ దాని ప్రత్యర్థుల కంటే శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023 మార్చి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో మొత్తం 27,000 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు మంచి పురోగతిని సాధించాయి. కంపెనీ అమ్మకాలు గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కంపెనీ ఉత్తమ అమ్మకాలు పొందటానికి, అదే సమయంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. (ఇదీ చదవండి: హోండా కొత్త బైక్.. ధర చాలా తక్కువ) ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించడానికి సిద్ధమైంది, ఇందులో భాగంగానే 400 కంటే ఎక్కువ సెంటర్లను ప్రారభించింది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇవన్నీ కంపెనీ అమ్మకాలు పెరగటానికి చాలా దోహదపడ్డాయి. ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్, హీరో విడా వి1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ మంచి సంఖ్యలో అమ్మకాలు పొందటం గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటికే కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ వంటి వాటిని విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. -
కొడుకు కష్టం చూడలేక.. తుక్కుతో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన తండ్రి
అతనో మధ్య తరగతి వ్యక్తి. రోజంతా కష్టపడితే గానీ బతుకు బండి ముందుకు సాగదు. తన కొడుకు రోజూ సుదూరం నడిస్తే గానీ కాలేజ్‌కి వెళ్లలేని పరిస్థితి. కొడుకుకి కొత్త బైక్ కొనిద్దామంటే తన స్థోమత సరిపోదు.. అలా అని చూస్తూ ఉండలేకపోయాడు ఆ తండ్రి. అందుకే ఆ వ్యక్తి స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కరంజా పట్టణానికి చెందిన రహీమ్‌ఖాన్ చిన్న కొడుకు షఫిన్ఖాన్ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి నడుస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను ఇంటి నుంచి కాలేజ్ వెళ్లి రావడం కష్టంగా ఉందంటూ తన తండ్రి వద్ద మొరపెట్టుకున్నారు. తన స్నేహితులకు ఉన్నట్లు తనకీ ఓ బైక్ ఉంటే బాగేండేదని తండ్రికి చెప్పుకున్నాడు. అయితే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ రహీమ్‌ఖాన్ తన ఇంట్లోనే చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో రహీమ్‌ఖాన్ తన కొడుకు బాధ చూడలేక ఈ సమస్యకు పరిష్కారంగా.. తానే స్వయంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని అనుకున్నాడు. స్వతహాగా అతను ఎలక్ట్రిషియన్ కావడంతో ఈ పని కాస్త సులువు అయ్యింది. రహీమ్ బైక్ తయారీకి ఉపయోగించిన దాదాపు అన్ని పదార్థాలు స్క్రాప్ డీలర్ల నుంచి తెచ్చుకున్నావే. పైగా చాలా వరకు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే వస్తువులతో ఈ బైక్‌ని తయారు చేశాడు. దీన్ని తయారీకి అతనికి 2 నెలలు సమయం పట్టగా.. దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంట్లో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. అత్యధికంగా 60 కిలోల వరకు బరువును ఈ బైక్ మోయగలదు. ఈ బైక్ వేగం, బరువు మోసే సామర్థ్యాన్ని పెంచడానికి మరింత శక్తివంతమైన బ్యాటరీ, మోటారును అమర్చాలని యోచిస్తున్నట్లు రహీమ్ చెప్పారు. ప్రస్తుతం షఫిన్ ఖాన్ రోజూ ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్‌పై కాలేజీకి వెళ్తున్నాడు. -
ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్నారా?.. ఓలా సంస్థ కీలక నిర్ణయం.. ఉచితంగా!
ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన స్కూటర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పాటు, అగ్నికి ఆహుతైన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్1 ఈవీ వెహికల్స్‌లో ఫ్రంట్ ఫోర్క్ ఉన్నట్టుండీ విరిగిపోవడంతో వాహనదారులు స్వల్పంగా గాయపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరుణంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రంట్ ఫోర్క్‌లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే ఫ్రీగా అప్‌గ్రేడ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి అప్ గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు తామే కస్టమర్లను సంప్రదిస్తామని ఓలా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. Important update about your Ola S1! pic.twitter.com/ca0jmw1BsA — Ola Electric (@OlaElectric) March 14, 2023 -
ఎలక్ట్రిక్ మౌంటైన్ బైక్ లాంచ్ చేసిన ఆడి: ధర, ప్రత్యేకతలు
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా జెన్యూన్ యాక్సెసరీస్ రేంజ్లో భాగంగా ఒక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లాంచ్ చేసింది. ఇది ఎల్, ఎస్, ఎమ్ అనే మూడు సైజుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర 8,900 యూరోలు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7.69 లక్షలు. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆవిష్కరణల్లో భాగంగానే ఈ ఎలక్ట్రిక మౌంటెయిన్ బైక్ విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ బైకులో ఇటలీకి చెందిన ఫాంటిక్ మోటార్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించడం జరిగింది. ఇది ఆడి ఆర్ఎస్ క్యూ ఈ-ట్రాన్ ఆధారంగా రూపొందించబడింది, అంతే కాకుండా ఈ మోడల్ 2022 డేకర్ ర్యాలీ నాలుగు స్టేజెస్‌లో విజయం సాధించింది. (ఇదీ చదవండి: Kia Niro: మగువలు మెచ్చిన కారు.. 2023 ఉమెన్స్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత) ఆడి ఎలక్ట్రిక్ మౌంటెయిన్ బైక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 720kWh బ్యాటరీ ప్యాక్ బూస్ట్, ఎకో, స్పోర్ట్, టూర్ అనే నాలుగు సైక్లింగ్ మోడ్స్ పొందుతుంది. ఇందులోని ఎకో మోడ్ మాగ్జిమమ్ రేంజ్లో ప్రయాణించడానికి, స్పోర్ట్ మోడ్ స్పోర్టీ సైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ హ్యాండిల్ బార్ మీద ఉన్న డిజిటల్ డిస్ప్లేలో స్పీడ్, బ్యాటరీ లెవెల్ వంటి వాటిని చూడవచ్చు. -
హీరో-జీరో జట్టు.. ఎలక్ట్రిక్ బైక్‌ల ఉత్పత్తిలో ఇక తిరుగులేదు!
దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్‌తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈ మేరకు హీరో మోటర్ కార్ప్.. జీరో మోటర్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ మోటర్ సైకిళ్లు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న జీరో మోటార్ సైకిల్స్ సంస్థ ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీలో హీరో సంస్థకు సహకారం అందిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో జీరో మోటార్‌సైకిల్స్ సంస్థలో హీరో ఆటోమొబైల్స్ 60 మిలియన్ డాలర్ల మేరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది. ఈ తాజా ఒప్పందం గురించి హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. జీరో మోటార్‌సైకిల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ తమను భాగస్వామిగా ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నామని జీరో మోటార్‌సైకిల్స్ సీఈవో శామ్ పాస్చెల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో హీరో సంస్థ లక్ష్య సాధనకు ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుంది. హీరో సంస్థ ఇప్పటికే విడా వీ1 పేరుతో ఓ ప్రీమియం ఎలక్ట్రానిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 1.59 లక్షలుగా ఉంది. ఇది బెంగళూరు, ఢిల్లీ, జైపూర్లలో పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు నగరాల్లో దాదాపు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! -
మ్యాటర్ ఎనర్జీ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ధర తక్కువ, సూపర్ డిజైన్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో 'మ్యాటర్ ఎనర్జీ' (Matter Energy) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ 'ఏరా' లాంచ్ చేసింది. ఇది 4000, 5000, 5000+, 6000+ అనే నాలుగు వేరియంట్స్‌లో విడుదలైంది. ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకుని నాలుగు వేరియంట్స్‌లో విడుదల చేసినప్పటికీ కేవలం మొదటి రెండు వేరియంట్స్‌ని మాత్రమే విక్రయిస్తుంది. మిగిలిన రెండు భవిష్యత్తులో విక్రయించబడతాయి. టాప్ వేరియంట్ 150 కిమీ రేంజ్ అందించగా, మిగిలిన మూడు వేరియంట్లు 125 కిమీ రేంజ్ అందిస్తాయి. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ 5kWh బ్యాటరీ, 10.5kW లిక్విడ్-కూల్డ్ మోటార్ పొందుతుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఏరా 5000 వేరియంట్ ఆప్సనల్ 7 ఇంచెస్ LCD టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంటేషన్ కలిగి ఆప్సనల్ బ్లూటూత్ కనెక్టివిటీ, పార్క్ అసిస్ట్, కీలెస్ ఆపరేషన్, OTA అప్డేట్లు, ప్రోగ్రెసివ్ బ్లింకర్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. 5000+ వేరియంట్లో లైఫ్‌స్టైల్, కేర్ ప్యాకేజీతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్‌గా లభిస్తుంది. కంపెనీ తమ ఎలక్ట్రిక్ బైక్, బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు. ఈ బైక్ 'ట్యాంక్'పై చిన్న 5 లీటర్ గ్లోవ్‌బాక్స్ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్ మరే ఇతర బైకులలో లేకపోవడం గమనార్హం. (ఇదీ చదవండి: కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ) ప్రస్తుతం, కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీల గురించి అధికారిక సమాచారం అందకపోయినప్పటికీ, త్వరలో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ
ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలై కుర్రకారుని ఉర్రూతలూగించిన అల్ట్రావయోలెట్ ఎఫ్77 డెలివరీలు ప్రారంభమయ్యాయి. కంపెనీ దేశ వ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం మొదటి డెలివరీలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి. దేశీయ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరలు రూ. 3.80 లక్షల నుంచి రూ. 4.55 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ తన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైకుని గ్లోబల్ మార్కెట్లో కూడా విక్రయించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ బైక్ భారతీయ రోడ్ల మీద మాత్రమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, జపాన్, ఇతర ఆగ్నేయాసియా దేశాల రోడ్ల మీద కూడా తిరగనున్నాయి. అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్, రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్, లిమిటెడ్ ఎడిషన్ కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 77 యూనిట్లకు మాత్రమే పరిమితం. అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ బరువు 197 కేజీలు కాగా, రీకాన్ వేరియంట్ బరువు 187 కేజీల వరకు ఉంటుంది. ఈ రెండు వేరియంట్స్ అవుట్‌పుట్ గణాంకాలు వేరుగా ఉంటాయి. ఎఫ్77 వేరియంట్ గరిష్టంగా 36.2 బిహెచ్పి పవర్, 85 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 38.88 బిహెచ్పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. -
Hyderabad: దేశ రాజధానిలో భళా.. ఇక్కడ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మరింత పెరుగుతుండటంతో వాహనదారులు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన విద్యుత్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. సాధారణ వాహనంతో పోలిస్తే విద్యుత్ వాహనం ఖర్చు కొంత ఎక్కువే అయినప్పటికీ.. రోజువారి ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉండటంతో మెజార్టీ వాహనదారులు ఇటు వైపు ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే నగరంలో 49 వేలకుపైగా వాహనాలు వచ్చి చేరాయి. మొదట్లో కేవలం స్కూటర్లు మాత్రమే రోడ్లపై కనిపించగా.. ప్రస్తుతం అన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు కూడా రోడ్లపై దూసుకుపోతున్నాయి. 300 కేంద్రాలు అన్నారు.. 24తో సరిపెట్టారు.. గ్రేటర్ పరిధిలో మొత్తం 75 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో 70 శాతం ద్విచక్ర వాహనాలు, 19 శాతం కార్లు, 11 శాతం ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెట్రోల్, డీజిల్‌పై పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నారు. మనకు ఆయిల్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో యుద్ధం, ఇతర విపత్తులతో పెద్దఎత్తున సంక్షోభం తలెత్తుతోంది. నగరంలోని వాహనదారులు ఇలాంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడేందుకు టీఎస్ రెడ్కో, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నగరంలో 300 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు 24 మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో కొన్ని పని చేయడం లేదు. కిలోవాట్ ఫర్ అవర్‌కు రూ.18 వసూలు చేయాలని నిర్ణయించారు. అపార్ట్మెంట్లలో ఉంటున్న వారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆశించినా.. ఇంట్లో ఛార్జింగ్ పాయింట్‌కు అవకాశం లేకపోవడంతో వారు ఇందుకు వెనుకాడుతున్నారు. అదే రోడ్డు సైడ్ పెట్రోల్ బంకులు, మెట్రో స్టేషన్ల వద్ద మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. సరిపడా చార్జింగ్, బ్యాటరీ కేంద్రాలు లేక ఇక్కట్లు ఢిల్లీలో విద్యుత్ వాహనాల చార్జింగ్ కోసం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 597 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈజెడ్ యాప్‌ను, బెంగళూరులో ఈవీమిత్ర యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ మార్పిడి సెంటర్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ నగరంలో ఇప్పటి వరకు ఈ దిశగా అడుగులు వేయలేదు. అంతేకాదు నగరంలో వాహనాల నిష్పత్తి మేరకు నగరంలో చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ మారి్పడి స్టేషన్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. రెండేళ్ల క్రితం టీఎస్ రెడ్కో ఎనర్జీ స్టోరేజీ పేరుతో ఒక విధానం రూపొందించింది. డీజిల్, పెట్రోల్ ఎంత సులభంగా లభిస్తుందో అంతే సులభంగా ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లు కొనుగోలు చేస్తున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పొరపాటున ఛార్జింగ్ అయిపోయి బండి రోడ్లు మధ్యలో ఆగిపోతే.. ఇతర వాహనాల సహాయంతో వాటిని ఇంటి వరకు తోసుకొని వెళ్లాల్సి వస్తోంది. -
అక్కడి కొనుగోలుదారులకు పండగే.. రివోల్ట్ కొత్త డీలర్షిప్స్ షురూ!
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని 'రివోల్ట్ మోటార్స్' భారతీయ మార్కెట్లో మరో మూడు డీలర్‌షిప్‌లను విస్తరించింది. కంపెనీ ఇప్పుడు ఈ రిటైల్ స్టోర్లను ఇండోర్, గౌహతి, హుబ్లీ ప్రాంతాల్లో ప్రారభించింది. రివోల్ట్ మోటార్స్ ప్రారంభించిన ఈ మూడు కొత్త డీలర్‌షిప్‌లతో కలిపి కంపెనీ డీలర్‌షిప్‌ల సంఖ్య 35కి చేరింది. రానున్న రోజుల్లో మరిన్ని డీలర్‌షిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇటీవలే రివోల్ట్ మోటార్స్‌లో 100 శాతం వాటాను పొందింది. భారతదేశంలో 70కి పైగా కొత్త స్టోర్లను ప్రారంభించాలానే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. రివోల్ట్ మోటార్స్ ఇటీవల తన ఫ్లాగ్షిప్ మోడల్ RV400 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు రూ. 2,499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీలను 2023 మార్చి 31 నాటికి పొందవచ్చు. ఇప్పటికే ఈ బైక్ విరివిగా దేశీయ మార్కెట్లో అమ్ముడవుతోంది. రివోల్ట్ ఆర్వి400 దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ 3.24 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. రివోల్ట్ ఆర్వి400 గంటకు ఎకో మోడ్‌లో 45 కిమీ, నార్మల్ మోడ్‌లో 65 కి.మీ, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ కేవలం మూడు గంటల్లో 75 శాతం, 4.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్ బ్యాటరీపై 6 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ అందిస్తుంది. -
Revolt RV400: దేశంలోనే తొలి ఏఐ ఎనేబుల్డ్ ఇ-బైక్ బుకింగ్స్ మళ్లీ!
సాక్షి,ముంబై: రరట్టన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గ్రూపు యాజమాన్యంలోని kరివోల్ట్ మోటార్స్ తన బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 బైక్ బుకింగ్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దేశీయ తొలి ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకొచ్చింది. ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజీన్ బైక్‌కు సమానమైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఏఐ ఎనేబుల్డ్ రివోల్ట్ ఆర్వీ 400 బైక్ బుకింగ్‌లు ఫిబ్రవరి 22న తిరిగి ప్రారంభిస్తున్నామనీ కేవలం రూ. 2,499 ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. డెలివరీలు మార్చి 31, 2023 నాటికి ప్రారంభ మయ్యే అవకాశం ఉంది. ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్ 72V 3.24kWh లిథియం-అయాన్ బ్యాటరీ 4.5 గంటలలోపు ఛార్జ్ అవుతుంది బ్యాటరీ 3kW మోటార్‌తో అనుసంధానం ఈ బ్యాటరీ 54Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ఫీచర్ల పరంగా, ఫుల్-LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 4G కనెక్టివిటీతో వస్తుంది. ట్రావెల్ హిస్టరీ, బ్యాటరీ ఆరోగ్యం, పరిధి సమీప స్వాప్ స్టేషన్ వంటి వివరాలకు వోల్ట్ యాప్‌ను బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌కు జత చేయవచ్చు. ఇ-బైక్ కీలెస్ ఇగ్నిషన్‌ను కూడా కలిగి ఉంది. 'ఇంజిన్ నోట్' మరో స్పెషల్ ఫీచర్. ఇది బైక్‌లోని అంతర్నిర్మిత స్పీకర్ల ద్వారా కృత్రిమ ఇంజిన్ సౌండ్‌ను కంట్రోల్ చేస్తుంది. స్క్రూ-టైప్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో రియర్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్,మోనో-షాక్‌ను కలిగి ఉంటాయి. ఇటీవల రట్టన్ ఇండియా కొనుగోలు చేసిన రివోల్ట్ మోటార్స్ తన సప్లయ్ చెయిన్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది. అలాగే హర్యానాలోని మనేసర్‌లోని వరల్డ్ క్లాస్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది. -
జనవరి నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవే!
దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో గణనీయమైన వృద్దిని సాధించినట్లు తెలుస్తోంది. కేంద్ర రవాణా శాఖకు చెందిన ‘వాహన్’ తాజాగా దేశీయంగా అమ్ముడుపోయిన ఈవీ వెహికల్స్ సేల్స్ జాబితాను విడుదల చేసింది. ఆ నివేదికలో కొన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు తగ్గగా.. మరికొన్ని కంపెనీల వాహనాల సేల్స్ పెరిగినట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే జనవరి నెలలో ఓలా మినహా ఇస్తే ఇతర ఆటోమొబైల్ సంస్థల ఈవీ స్కూటర్ సేల్స్ వృద్ది సాధించాయి. ఓలా ఎస్1ఎయిర్, ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో వెహికల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. వాటిల్లో నాసిరకంగా తయారీ కారణంగా ముందు టైర్లు ఊడిపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది. అయినప్పటకీ జనవరిలో ఓలా 18,245 వెహికల్స్ అమ్మింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ 10,404 యూనిట్లను విక్రయించింది. ఆ సంస్థ తొలగిసారి జనవరి 2020న, ఏప్రిల్ 2022 న కొత్త ఈవీ స్కూటర్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. జియో - బీపీ భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాన్ని వాహన దారులకు అందుబాటులోకి తెచ్చింది. ఎథేర్ ఎనర్జీ ఇతర ఆటోమొబైల్ సంస్థల కంటే ముందుగా ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2018 సెప్టెంబర్ నెలలో ఎథేర్ 450 ఎక్స్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆ వెహికల్స్ అమ్మకాలు కొనసాగుతుండగా డిసెంబర్ 2022లో 7,652 వెహికల్స్‌ను జనవరి 2023లో 9,139 వెహికల్స్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక హీరో ఎలక్ట్రిక్ డిసెంబర్ నెలలో 8 వేల వాహనాల్ని విక్రయించగా.. ఆ సంఖ్య భారీగా తగ్గి జనవరి నెలలో 6,393 వెహికల్స్ అమ్మినట్లు నివేదిక హైలెట్ చేసింది. హీరో ఎలక్ట్రిక్ తర్వాత ఒకినావా సేల్స్ సైతం తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్లో 875 వెహికల్స్‌ను విక్రయించగా జనవరిలో 4,404ను అమ్మింది. అయితే కంపెనీ ఊహించని విధంగా సేల్స్ జరగలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంపియర్ సంస్థ ప్రిమస్, మ్యాగ్నస్ ఈఎక్స్, రియో ప్లస్ పేరుతో మూడు వెహికల్స్ ఈ ఏడాది జనవరిలో పరిచయం చేసింది. అదే నెలలో 4,366 వెహికల్స్‌ను అమ్మింది. ఇతర కంపెనీలతో పోలిస్తే 2,615 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడు పోయాయి. -
హైదరాబాద్‌లో ఈ-మొబిలిటీ వీక్.. ఎలక్ట్రిక్ వాహనాలతో ర్యాలీ (ఫొటోలు)
-
అద్భుతమైన బైక్.. దీనికి ముందువైపు చక్రం బదులుగా..
మనదేశంలో వీథుల్లోను, రహదారుల్లోను మంచు పేరుకుపోయే సమస్య దాదాపు లేదు గాని, ప్రతిఏటా శీతకాలంలో పాశ్చాత్యదేశాల్లో ఇదొక పెద్ద సమస్య. మంచులో చక్రాలు చిక్కుకుపోయి వాహనాలు ముందుకు సాగవు. మంచుదారిలో కాలినడక మరీ ప్రమాదకరం. రహదారులపై మంచు పేరుకుపోయినా సరే, ఏమాత్రం ఇబ్బందిలేకుండా ప్రయాణించడానికి వీలుగా అమెరికన్ కంపెనీ ‘మూన్‌బైక్స్’ ఇటీవల ఒక అద్భుతమైన బైక్‌ను రూపొందించింది. దీనికి ముందువైపు చక్రం బదులు, మంచును చీల్చుకుపోయే పదునైన పరికరాన్ని అమర్చారు. వెనుకవైపు యుద్ధట్యాంకుల మాదిరిగా చైన్లతో కూడిన రెండు చక్రాలు ఉండటం వల్ల ఎగుడుదిగుడు మంచుదారిలో కూడా ఈ బైక్ మహాజోరుగా సాగిపోగలదు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్ కావడం వల్ల దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీని ధర 8500 డాలర్లు (రూ.6.94 లక్షలు) మాత్రమే! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. యూరప్ దేశాల్లో అమ్మకాలకు సర్వం సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏడాదిలో యూరప్‌లో అడుగుపెట్టబోతోంది. బజాజ్ ఆటో భాగస్వామి అయిన స్పోర్ట్స్ బైక్స్ త యారీ దిగ్గజం కేటీఎం ఈ స్కూటర్లను విక్రయించనుంది. 2019లో ఎలక్ట్రిక్ రూపంలో రీఎంట్రీ ఇచ్చిన చేతక్ ఇప్పటి వరకు దేశంలో 24,000 యూ నిట్లు రోడ్డెక్కాయి.ప్రస్తుతం 40 నగరాల్లో మాత్రమే ఈ వాహనాన్ని కంపెనీ విక్రయిస్తోంది. 1972లో చేతక్ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కింది. 2006 నుంచి చేతక్ స్కూటర్ల తయారీని బజాజ్ నిలిపివేసి బైక్స్‌పైనే పూర్తిగా దృష్టిసారింది. కాగా, కేటీఎం తాజాగా చకన్ ప్లాంటులో 10 లక్షల బైక్‌ల తయారీని పూర్తి చేసింది. 2011లో ఈ ప్లాంటు నుంచి కేటీఎం తొలి బైక్ బయటకు వచ్చింది. 5 లక్షల యూనిట్లు దేశీయంగా అమ్ముడయ్యాయి. మరో 5 లక్షల యూని ట్లు భారత్ నుంచి 70 దేశాలకు ఎగుమతి అయ్యా యి. ప్రీమియం మోటార్‌బైక్ బ్రాండ్‌గా ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచినట్టు కేటీఎం ప్రకటించింది. -
స్టైలిష్ డిజైన్‌తో టార్క్ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ - క్రాటోస్ ఎక్స్‌ని ఆవిష్కరించింది.అలాగే సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఈ-మోటార్‌సైకిల్ క్రా టోస్ ఆర్(kratos R) పేరిట తీసుకొచ్చింది. వేగవంతమైన, మెరుగైన, టోర్కియర్: ది స్పోర్టియర్ క్రాటోస్ ® X అని టార్క్ కంపెనీ ప్రకటించింది. 2023 రెండో త్రైమాసికంలోఈ మోటార్ సైకిల్ బుకింగ్‌లు ప్రారంభం. మోటార్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగాన్ని మరింత అందుబాటులోకి ,ఆచరణాత్మకంగా చేయడానికి కట్టుబడి ఉన్నామని TORK మోటార్స్ వ్యవస్థాపకుడు,సీఈఓ కపిల్ షెల్కే తెలిపారు. ఈ రోజు కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని సంతోషం ప్రకటించారు. బెస్ట్ ఇన్ క్లాస్ టెక్నాలజీతో స్పోర్టియర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అద్భుతమైన సౌకర్యం, మెరుగైన పనితీరు , మెరుగైన రైడింగ్ అనుభవం కోసం రూపొందించినట్టు తెలిపారు. తమ డైనమిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అత్యుత్తమ పవర్‌ట్రెయిన్, టార్క్‌ను అందిస్తుందనీ, డిస్ప్లే ఇన్స్ట్రుమెంటేషన్, ఇతర సేఫ్టీ ఫీచర్లు హోస్ట్ రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితం చేస్తుందని వెల్లడించారు. అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కాగా కంపెనీ ఇటీవల పూణేలో తన మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని (COCO మోడల్) ప్రారంభించింది. హైదరాబాద్, సూరత్, పాట్నా నగరాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం, పూణే, ముంబై, హైదరాబాద్‌లో డెలివరీ చేస్తోంది. త్వరలో ఇతర మార్కెట్లలో కూడా ప్రారంభించ నుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ బైక్స్‌ను బుక్ చేసుకోవచ్చని టార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రాటోస్ ఆర్‌లో రిఫైన్డ్ లైవ్ డాష్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, మెరుగైన ముందు, వెనుక బ్లింకర్లు లాంటి మార్పులు చేసింది. అలాగే ఈ మోటార్ సైకిల్ జెట్ బ్లాక్, వైట్.రెండు కొత్త వేరియంట్లలో లభిస్తుంది -
ఎలక్ట్రిక్ టూ–వీలర్ల లక్ష్యాలు మిస్..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. నిర్దేశించుకున్న 10 లక్షల యూనిట్ల కన్నా అమ్మకాలు 20 శాతం తక్కువగా నమోదు కావచ్చని పరిశ్రమ సమాఖ్య ఎస్ఎంఈవీ భావిస్తోంది. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల సబ్సిడీని విడుదల చేయకుండా ఆపి ఉంచడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2022 సంవత్సరం మొత్తం మీద ఎలక్ట్రిక్ టూ–వీలర్ల అమ్మకాలు 6 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. మూడు ప్రధాన ఎలక్ట్రిక్ టూవీలర్ల సంస్థలు (హీరో ఎలక్ట్రిక్, ఓలా, ఒకినావా) తొలిసారి 1 లక్ష వార్షిక విక్రయాల మైలురాయిని దాటాయి. ఈ మూడింటికి 50 శాతం పైగా మార్కెట్ వాటా ఉంది. 2022లో అమ్మకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ నీతి ఆయోగ్, ఇతరత్రా పరిశోధన ఏజెన్సీలు అంచనా వేసిన స్థాయిలో విక్రయాలు ఉండటం లేదని ఎస్ఎంఈవీ తెలిపింది. ’వాహన్’ పోర్టల్ గణాంకాల ప్రకారం గతేడాది నవంబర్‌లో 76,162 యూనిట్లు అమ్ముడు కాగా డిసెంబర్లో 28 శాతం తగ్గి 59,554 యూనిట్లకు పడిపోవడం ఒక హెచ్చరికగా కనిపిస్తోందని పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన తొలి తొమ్మిది నెలల్లో 5 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు, ఇదే తీరు కొనసాగితే పూర్తి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నీతి ఆయోగ్ అంచనా వేసిన 10 లక్షల యూనిట్లకు 20 శాతం దూరంలో ఆగిపోవచ్చని ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెప్పారు. గత రెండు నెలలుగా అమ్మకాలు తగ్గుతుండటానికి పలు అంశాలు కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 1,100 కోట్ల పైచిలుకు సబ్సిడీని చాలా నెలలుగా విడుదల చేయకుండా ఆపి ఉంచడంతో పలు కంపెనీలకు (ఓఈఎం) నిర్వహణ మూలధనంపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని గిల్ చెప్పారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 20 లక్షల యూనిట్ల అమ్మకాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. ఓఈఎంలపై ఆరోపణలు .. దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా ఫేజ్ 2 స్కీము కింద ఇస్తున్న సబ్సిడీలను కొన్ని తయారీ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలను కేంద్రం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రెండు కంపెనీలను, వాటి మోడల్స్‌ను ఫేమ్ స్కీము నుంచి సస్పెండ్ చేసింది. నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తగు ఆధారాలు ఇచ్చే వరకూ వాటి పెండింగ్ క్లెయిముల ప్రాసెసింగ్‌ను ఆపివేసింది. బెన్లింగ్ ఇండియా ఎనర్జీ అండ్ టెక్నాలజీ, ఒకాయా ఈవీ, జితేంద్ర న్యూ ఈవీ టెక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (గతంలో యాంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్), రివోల్ట్ ఇంటెలికార్ప్, కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్, ఏవన్ సైకిల్స్, లోహియా ఆటో ఇండస్ట్రీస్, ఠుక్రాల్ ఎలక్ట్రిక్ బైక్స్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో ఉన్నాయి. -
దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు..ఏ కంపెనీ వెహికల్స్ ఎక్కువగా కొంటున్నారో తెలుసా?
పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. డీజిల్ రేట్లు దడపుట్టిస్తున్నాయి. కాలుష్యం కాటేస్తుంది. వాహనదారుల జేబుకు చిల్లు. వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ అదిగదిగో ఎలక్ట్రిక్ వెహికల్. పొగుండదు. పొల్యూషన్ అస్సలు ఉండదు? పెట్రోల్, డీజిల్‌తో పనుండదు. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే. ఇదిగో..ఈ తరహా ధోరణి వాహనదారుల్లో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు ఏమాత్రం తగ్గడం లేదని, పండగ సీజన్లో కంటే ఆ తర్వాతే ఈవీ బైక్స్ అమ్మకాలు జోరందుకున్నాయని ఆ నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ‘వాహన్’ డేటా ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల కాలంలో దేశంలో 1,53,000 ఎలక్ట్రిక్ బైక్స్ అమ్ముడుపోయాయి. ఇదే కాలంలో గతేడాది కేవలం 43,000 వెహికల్స్ అమ్మకాలు జరిగినట్లు ఆ డేటా తెలిపింది. అమ్మకాల జోరు 2021 అక్టోబర్ నెలలో ఈవీ బైక్స్ 19,702 మాత్రమే కొనుగులో చేయగా..ఈ ఏడాది అక్టోబర్‌లో 77,000 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇక, 2021 నవంబర్‌లో 23,099 వెహికల్స్ అమ్ముడుపోగా.. 2022 నవంబర్‌లో 76,150 వెహికల్స్‌ను కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థలు దేశీయంగా ఏప్రిల్-నవంబర్లలో కలిపి 4.3 లక్షల యూనిట్ల సేల్స్ నిర్వహించగా..డిసెంబర్ నెలలో సైతం ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమకు చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో ఈవీ బైక్స్ మార్కెట్ షేర్ ఎంత? వాహన్ నివేదికలో దేశీయంగా ఈవీ వెహికల్స్ తయారీ సంస్థలు జరిపిన అమ్మకాలు ఎంత శాతంగా ఉన్నాయో తెలిపింది. ఇందులో ప్రధానంగా ఒక్క నవంబర్‌లో ఓలా 21శాతం ఈవీ వెహికల్స్‌ను అమ్మగా, ఆంపియర్ 16 శాతం, ఓకినావా 12 శాతం, హీరో ఎలక్ట్రిక్ 12 శాతం , టీవీఎస్ 10.6 శాతం, ఎథేర్ 10 శాతం, బజాజ్ 4 శాతం, ఒకయా 2 శాతం అమ్మగా.. ఇతర సంస్థలు 12.4శాతం మేర విద్యుత్ వాహనాల్ని అమ్మినట్లు తేలింది. చదవండి👉 ‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’! -
ఓలా ఎలక్ట్రిక్ బైక్.. ఊహించని అమ్మకాలు, మళ్లీ అదే సీన్ రిపీట్!
ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నవంబర్‌లో 20 వేల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. పండుగ సీజన్ తర్వాత కూడా తమ విక్రయాలు జోరు ఏ మాత్రం తగ్గలేదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు జనాదరణ పొందుతున్న తరుణంలో ఓలా కంపెనీ విడుదల చేసిన ఈవీ బైకలు అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. సేల్స్‌లో మరో సారి 20వేల మార్క్‌ను అందుకున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. కాగా గత అక్టోబర్‌లోనూ సేల్స్ 20 వేలు దాటాయంటూ ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో.. తమ ద్విచక్ర వాహన బ్రాండ్ మెరుగైన వృద్ధిని సాధించింది. స్కూటర్ మార్కెట్ వాటాలో 50 శాతం సొంతం చేసుకున్నాం. నవంబర్‌లో మా అమ్మకాలు మళ్లీ 20,000 యూనిట్లను దాటాయి. భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీగా మార్చిన మా కస్టమర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ 2021లో 1,400 EVల నుంచి ప్రస్తుతం 90 శాతం ఈవీ సెగ్మెంట్ షేర్ కలిగి ఉంది. 2025 చివరి నాటికి అన్ని 2W విభాగాలలో EVలకు 100 శాతం షేర్ ఉండబోతోందని ట్వీట్ చేశారు. నవంబర్‌లో ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి అనే డేటాను ఓలా కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. 20,000 యూనిట్లు అమ్మకాలను మరో సారి అందుకున్నట్లు మాత్రమే ప్రకటించింది. ఓలా ప్రస్తుతం భారత్‌లో S1 ఎయిర్, S1, S1 ప్రోల పేరుతో విక్రయాలు జరుపుతోంది. దీని ధరలు రూ. 84,999 నుంచి రూ. 1.39 లక్షలుగా ఉంది( ఎక్స్-షోరూమ్). వీటిలో ఎస్1 ప్రో ఒక సారి ఫుల్ చార్జింగ్‌తో 116kmph అత్యధిక వేగంతో 180km వరకు ప్రయాణించగలదు. Our sales crossed 20000 again in Nov. Largest EV company in India by a margin! Huge thanks to our customers. From 1400 EVs in June 2021, to 90% EV share today, #EndIceAge is complete in the premium scooter segment! Transition to EVs will be 100% in all 2W segments by end 2025! pic.twitter.com/8dRHcxaxnd — Bhavish Aggarwal (@bhash) December 1, 2022 చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే భవిష్యత్
చెన్నై: ఎలక్ట్రిక్ వెహికల్స్‌దే భవిష్యత్ అని సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎన్ రాజు అన్నారు. సోమవారం ఉదయం చెన్నై అంబత్తూరులో ఏర్పాటు చేసిన ఆల్టీగ్రీన్ రీటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పర్యావరణ హితానికి ఎలక్ట్రిక్ వాహనాల ప్రధాన్యత పెరిగిందని.. ప్రభుత్వాలు సైతం వీటిపై దృష్టిపెట్టాయని తెలిపారు. అంతకుముందు భారతదేశపు వాణిజ్య ఈవీ విభాగంలో మొట్టమొదటిగా లక్ష్మీ గ్రూప్ పరిశ్రమతో ప్రముఖ వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆల్టీగ్రీన్ భాగస్వామ్యం చేసుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు అల్టీగ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ అమితాబ్ శరణ్ తెలిపారు. లక్ష్మీ గ్రూప్ ఎండీ కె.జయ్‌రామ్ పాల్గొన్నారు. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
ఫాస్టెస్ట్ ఈ-బైక్.. వాటి వేరియంట్లపై ఓ లుక్కేద్దాం!
బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) ఇటీవల ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'F77' లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ లాంచ్ సమయంలోనే మూడు వేరియంట్స్ (ఎఫ్77, రీకాన్, ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్) గురించి వెల్లడించింది. అయితే బైక్ ప్రేమికులు చాలా మంది ఈ మూడు వేరియంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని చాలా కుతూహలంతో ఉన్నారు. ఈ మూడు వేరియంట్స్ డిజైన్, ఫీచర్స్, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి. అల్ట్రావయోలెట్ ఎఫ్77: ఎఫ్77 అనేది కంపెనీ మూడు వేరియంట్స్ లో మొదటి మోడల్ (బేస్ మోడల్). దీని ధర రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 207 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగం, 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లోని బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తుంది. అయితే దీనిని 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారంటీకీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కలర్ ఆప్సన్ విషయానికి వస్తే, ఎఫ్77 బ్లాక్, సిల్వర్, రెడ్ కలర్లో అందుబాటులో ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 రీకాన్: అల్ట్రావయోలెట్ మరో వేరియంట్ అయిన ఎఫ్77 రీకాన్ విషయానికి వస్తే, దీని ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించింది. ఈ బైక్ కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 8.0 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగాన్ని అందుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇది బేస్ మోడల్ కంటే కూడా ఎక్కువ వేగవంతంమైన బైక్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ విషయానికి వస్తే, స్టాండర్డ్ గా 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీని పొందవచ్చు. అయితే దీనిని 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీకీ అప్డేట్ చేసుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ ఏ కలర్ ఆప్సన్లో లభిస్తుంది. అదే కలర్స్ (బ్లాక్, సిల్వర్, రెడ్) ఇది కూడా లభిస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్: ఇక చివరగా ఇందులోని చివరి మోడల్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ పేరుకి తగిన విధంగానే ఇది లిమిటెడ్ యూనిట్లలో మాత్రమే లభిస్తుంది. కావున ఇది కేవలం 77 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ బైక్ కేవలం 77 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధరను బట్టి చూస్తే ఇది కంపెనీ అత్యంత ఖరీదైన బైక్. అయితే పనితీరు విషయంలో మిగిలిన రెండు బైకులంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్‌లో రీకాన్ వేరియంట్లో ఉన్న అదే బ్యాటరీ (10.3 కిలోవాట్) ఉంటుంది. కావున రేంజ్ కూడా రీకాన్ మోడల్ మాదిరిగానే 307 కిమీ ఉంటుంది. ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ, 7.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీ వారంటీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుకింగ్స్, డెలివరీ: కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకుని మార్కెట్లో లాంచ్ చేయకముందు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు రూ. 10,000 చెల్లించి కంపెనీ అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు మొదట బెంగళూరులో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దశల వారిగా డెలివరీలు ప్రారభించనుంది కంపెనీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బైక్ భారతీయ తీరాలను కూడా దాటి విదేశాలలో కూడా విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
గంటకు150 కిలోమీటర్లు, ఫాస్టెస్ట్ ఈ-బైక్ ఇదే! ధర ఎంతంటే?
న్యూఢిల్లీ:ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరను ఎట్టకేలకు కంపెనీ ప్రకటించింది. అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కంపెనీ అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్టాండర్డ్, రీకాన్ ఒరిజినల్ అనే రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇక ధరల విషయానికి వస్తే... స్టాండర్డ్ ధర రూ. 3.80 లక్షల(ఎక్స్-షోరూమ్) నుండి మొదలు. రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అలాగే పరిమిత ఎడిషన్‌గా 77 యూనిట్లు మాత్రమే తీసుకురానుంది. భారతీయ మార్కెట్లో, కవాసకి నింజా 400, TVS Apache RR 310, BMW G 310 R 300cc బైక్స్‌కు పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఆవిష్కరించబడిన మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. నవంబర్ 24 ఇండియన్ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77 బుకింగ్‌లను స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అల్ట్రావయోలెట్ ఎఫ్ 77కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే రూ. 10వేలకు బుకింగ్‌లను సాధించడం ఆసక్తికరంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో ఎయిర్‌స్ట్రైక్, లేజర, షాడో అనే మూడు ఆప్షన్స్‌లో లభ్యం. స్టాండర్డ్ వేరియంట్లో 7.1kWh బ్యాటరీ ప్యాక్, 85Nm శక్తిని అందించే 27kW మోటార్‌ను అందించింది. ఎలక్ట్రిక్ మోటార్ రీకాన్ వేరియంట్ల కోసం 29 kW పవర్, 90 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 307 కిలోమీటర్ల వరకు ఈ బైక్‌పై ప్రయాణించవచ్చు. ఫ్యూచరిస్టిక్ స్పోర్ట్స్ బైక్ లుక్‌లో వచ్చిన వీటిల్లో బైక్ మోనోషాక్ ,ఇన్వర్టెడ్ ఫోర్క్ సెటప్ రియర్ అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను కూడా అందిస్తోంది. ప్రీమియం బైక్‌లో డీఆర్ఎల్ స్ట్రిప్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్ , టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ విషయానికి వస్తే, బైక్‌లు స్మార్ట్ TFT డిస్ప్లేను అందిస్తోంది. -
దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ బైక్
సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ బైక్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. తాజాగా మ్యాటర్ ఎనర్జీ (Matter Energy) తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో మ్యాటర్ ఎనర్జీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. ఫీచర్లు ఈ బైక్‌లో అమర్చిన 10.5 kW ఎలక్ట్రిక్ మోటారు 520 Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్, 5 kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని జతచేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 125-150 కిమీల పరిధిని అందజేస్తుందని కంపెనీ చెప్పింది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు అని కంపెనీ పేర్కొంది. ఎల్ఈడీ లైట్లు, స్ప్లిట్ సీట్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు , స్ప్లిట్ రియర్ గ్రాబ్ రైల్‌తో స్పోర్టీ స్ట్రీట్ బైక్ డిజైన్‌న్‌తో ఆకట్టుకుంటోంది.. ట్యాంక్ ఏరియాలో 5లీటర్ గ్లోవ్‌బాక్స్ ఉంది, ఇందులోనే ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఇంకా 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్‌లు , మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లకు కూడా మద్దతు ఇస్తుంది. స్పోర్ట్, ఎకో, సిటీ మోడ్స్‌లో గ్రే అండ్ నియాన్, బ్లూ అండ్ గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్, రెడ్/బ్లాక్/వైట్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. 2023 మొదటి త్రైమాసికంలో బుకింగ్స్, డెలివరీలు 2023 ఏప్రిల్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధర: ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సుమారు రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా. -
యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..
-
ఓలా ఎలక్ట్రిక్ బైక్ కమింగ్ సూన్, సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఇ-మొబిలిటీ మార్కెట్లో ఓలా భారీ వ్యూహాలనే రచిస్తోంది. ఇప్పటికే ఎస్1, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఇపుడిక ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఇదీ చదవండి : ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ పైప్‌లైన్‌లో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను చేర్చింది. త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్పోర్ట్స్, క్రూయిజర్, అడ్వెంచర్ లేదా కేఫ్ రేసర్ ఏది కావాలి అంటూ ట్విటర్ తన ఫాలోnయర్లను అడిగారు భవిష్ అగర్వాల్. అయితే ఆసక్తికరంగా స్పోర్ట్స్ కేటగిరీ అత్యధిక ఓట్లను పొందుతోంది. వచ్చే ఏడాది బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Building some 🏍️🏍️!! — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా సరసమైన ధరలో, ఆధునిక ఫీచర్లతో తీసుకొస్తున్నందని అంచనా. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఆదరణ బాగా లభించడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు ట్రిమ్‌లలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. (అరిగిపోయిన చెప్పులకు అన్ని వేల డాలర్లా? ఎవరివో గుర్తు పట్టగలరా?) Which bike style do you like — Bhavish Aggarwal (@bhash) November 10, 2022 -
ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం
-
ఎలక్ట్రిక్ వాటర్‌బైక్.. అదిరిపోయే ఓ స్పెషాలిటీ ఉందండోయ్!
వాటర్‌బైక్‌లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! ఇప్పటి వరకు వాడుకలో ఉన్న వాటర్‌బైక్‌లన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా ఉపయోగించుకుని నడిచేవే! కెనడాకు చెందిన ‘ఎన్వో’ కంపెనీ తొలిసారిగా పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేసే 1500 వాట్ల మోటారుతో వాటర్‌బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మిగిలిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, గంటసేపు నిరాటంకంగా జలవిహారం చేయవచ్చు. నీటిలో ఇది గంటకు ఇరవై కిలోమీటర్ల గరిష్ఠవేగంతో ప్రయాణించగలదు. దీనికో ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన వాటర్బైక్లతో పోల్చుకుంటే దీని బరువు తక్కువే! కేవలం 50 కిలోల బరువు గల ఈ ఎలక్ట్రిక్ వాటర్ బైక్ 120 కిలోల బరువును తీసుకుపోగలదు. సరదా జలవిహారాలకు ఇది భేషైన వాహనం. చదవండి: పండుగ బోనస్: భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్! -
సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. పలువురి మృతి
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఉవ్వెత్తున ఎగిసిన మంటలు.. దట్టమైన పొగ.. వివిధ పనుల మీద నగరానికి వచ్చి లాడ్జీలో బస చేసినవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. మిగతావారు ఎలాగో తప్పించుకునా ఏడుగురు కాలినగాయాలు, పొగతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 13 మంది గాయపడినట్లు సమాచారం కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర దుర్ఘటన సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సేద తీరుతుండగా..: ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ మేరీస్ రోడ్డులోని మనోహర్ థియేటర్ ఎదురుగా రంజిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి రూబీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ పేరుతో బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తున్నా రు. ఈ షోరూమ్ సెల్లార్లో ఉండగా, ఆపై నాలుగు అంతస్తుల్లో రూబీ డీలక్స్ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో సెల్లార్‌లోని షోరూమ్ నుంచి మంటలు చెలరేగాయి. ఇందులో ఎలక్ట్రికల్ బైక్‌ల బ్యాటరీలు పేలి భారీ శబ్దాలతో పాటు మంటలు వ్యాపించాయి. నాలుగు అంతస్తుల్లోని లాడ్జీ గదుల్లోకి మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన కొంతమంది హోటల్ గదుల నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరు మాత్రం దట్టమైన పొగల కారణంగా బయటకు రాలేక గదుల్లో చిక్కుకుపోయారు. లాడ్జీలో 23 మంది..: హోటల్లో వ్యాపారాల నిమిత్తం ఉత్తర భారత దేశం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 23 మంది ఉన్నట్లు తేలింది. దట్టమైన పొగలు పైన ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో చాలామంది పై నుంచి కిందకు దిగేందుకు వీలులేకుండా పోయింది. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డ్రైనేజీ పైప్‌ల ద్వారా నాలుగు, మూడో అంతస్తుల నుంచి కిందకు దిగారు. వీళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలాగే దీన్ని ఆనుకుని ఉండే యాత్రి ఇన్ హోటల్ మీదుగా మరికొంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. వీరికి సైతం ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో గాలి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది స్నారికల్ వాహనం ద్వారా కొంత మందిని కిటికీల నుంచి బయటకు రప్పించి రక్షించారు. ఒక మహిళతో పాటు మరో ముగ్గురు గదుల్లో అపస్మారక స్థితిలో పడిఉండగా బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కాలిన గాయాలైన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా మిగతా వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మార్కెట్ పోలీసులు, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, పెద్దసంఖ్యలో స్థానికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులు కిటికీల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండగా అక్కడికి చేరుకున్న స్థానికులు వారికి నిచ్చెనలు అందించి, పైప్‌ల ద్వారా దిగేలా సహాయం చేశారు. మరికొంత మంది పొగలోనే లోపలికి వెళ్లి గదుల్లో ఉండే వారిని బయటకు తీసుకుని వచ్చారు. అగ్ని ప్రమాద ఘటన తెలియగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతా క్షణాల్లోనే: కేశవులు, చెన్నై చెన్నై నుంచి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. రాత్రి 9 గంటలకు హోటల్లో దిగాను. అంతలోపే ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. స్థానికుల సహాయంతో 4వ అంతస్తు నుంచి పైౖౖపులు పట్టుకుని కిందకు దిగాను. ఇది మరో జన్మ: ఉమేష్ ఆచార్య, ఒడిశా ఒడిశా నుంచి ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. 4వ అంతస్తులో ఉన్నాను. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది. మెట్ల నుంచి వెళ్లే అవకాశం కనిపించలేదు. వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలంటే పైపులు పట్టుకుని దిగాలని «ధైర్యం చేశా. పైపులు పట్టుకుని కిందికి దిగాను. ఇది నాకు మరో జన్మ. పొగ పీల్చుకోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఇదీ చదవండి: మళ్లీ.. గోదావరి ఉగ్రరూపం -
హాప్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్: అదిరే..అదిరే..!
న్యూఢిల్లీ: ప్రముఖ ఈవీ బైక్స్ తయారీ సంస్థ హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ సెగ్మెంట్లోకి దూసుకొస్తోంది. తాజాగా దేశీయ మార్కెట్లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్ రెండు మోడళ్ళను లాంచ్ చేసింది. ఆక్సో మోడల్లో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.1.25 లక్షలు, రూ.1.40 మధ్య ఉండనున్నాయి. వినియోగదారులు తమ సమీప హాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్, లేదా ఆన్లైన్లో ఎలక్ట్రిక్ బైక్స్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 5వేల ప్రీ-లాంచ్ రిజిస్ట్రేషన్లు సొంతం చేసుకున్నామనీ, మరింత హైపర్గ్రోత్ను అంచనా వేస్తున్నామని హాప్ ఫౌండర్, సీఈవో కేతన్ మెహతా అన్నారు. రానున్న రోజుల్లో తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తామన్నారు. అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం తోపాటు, చార్జింగ్ సదుపాయల కోసం రూ.200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఫీచర్లు మూడు రైడ్ మోడ్‌లను (ఎకో, పవర్ , స్పోర్ట్) లో ఈ బైక్స్ లభ్యం. బైక్ ప్రముఖ ఫీచర్ల విషయానికి వస్తే IP67 రేటింగ్ 5 అంగుళాల అడ్వాన్స్డ్ ఇన్ఫో డిస్ప్లే, 72 V ఆర్కిటెక్చర్‌తో 6200 వాట్ పీక్ పవర్ మోటార్‌తో 200 Nm వీల్ టార్క్‌ను అందజేస్తుంది. స్మార్ట్ బీఎంఎస్,811 NMC సెల్స్‌తో కూడిన అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీతో ఆధారితమైన Oxo's 3.75 KWh బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అందించింది. 3.75 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్‌తో తయారైన ఈ బైకు ఒక్కసారి చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.అ లాగే కేవలం నాలుగు గంటల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు రీచార్జి అవుతుందని కేతన్ మెహతా వెల్లడించారు. అంతేకాదు కేవలం పోర్టబుల్ స్మార్ట్ ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. -
భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు
కుషాయిగూడ(హైదరాబాద్): చార్జింగ్ పెట్టిన రెండు ఎలక్ట్రికల్ బైకులు పేలిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జగదేవపూర్‌కు చెందిన పనగట్ల హరిబాబు కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉంటున్నాడు. తన ఎలక్ట్రికల్స్ బైకులకు సోమవారం సాయంత్రం పార్కింగ్ ఏరియాలో చార్జింగ్ పెట్టాడు. పెట్టిన ఒక గంటకే ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చింది. కిందికి వచ్చి చూడగా తన రెండు బైకులకు మంటలంటకుని దగ్ధమయ్యాయి. ఇటీవల ఎలక్ట్రికల్ బైక్‌ల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. మరో వైపు ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలు మాత్రం సేఫ్టీ విషయంలో మాత్రం రాజీ పడకుండా బైకులను తయారీ చేస్తున్నామని చెప్తున్నాయి. ఇలాంటి ఘటనలకు గల అసలు కారణాలను తెలుసుకుని వాటిని పునరావృతం కాకుండా చూస్తామని సంస్థలు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా -
విజయవాడ కేంద్రంగా..అవేరా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు సరికొత్త ఎలక్ట్రికల్ స్కూటర్లను అవేరా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడ సమీపంలోని తయారీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విన్సిరో పేరుతో ప్రీమియం, రెట్రోసా లైట్ పేరుతో ఎకానమీ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉండే ఎల్ఎఫ్పీ బ్యాటరీతో రూపొందించిన ‘విన్సిరో’ గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించడమే కాకుండా ఒకసారి చార్జింగ్ చేస్తే 236 కి.మీ. ప్రయాణం చేస్తుందని అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణ పేర్కొన్నారు. సబ్సిడీలు పోను ఈ స్కూటర్ ధరను రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. అలాగే విన్సిరో లైట్ గంటకు 60 కి.మీ. వేగంతో ఒకసారి చార్జింగ్‌చేస్తే 100 కి.మీ. ప్రయాణం చేయనుంది. విన్సిరో లైట్ ధరను రూ.99,000 గా నిర్ణయించారు. -
మిషన్ ఎలక్ట్రిక్ 2022: మెగా ఈవెంట్లో ఓలా ఏం చేయబోతోంది?
సాక్షి, ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఏడాది కూడా సంచలనానికి తెరతీయనుందా? ఆగస్టు 15న మిషన్ ఎలక్ట్రిక్ 2022 పేరుతో తన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో ఓలా కొత్త ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్ , ఈవీ బ్యాటరీని లాంచ్ చేయనుందనే అంచనాలు ఊపందుకున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఓలాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15, 2022న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన వీల్స్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్లో ఎలక్ట్రిక్ కారు చిన్న వీడియోను షేర్ చేశారు. ఎలక్ట్రిక్ కారును ప్రకటిస్తూ అగర్వాల్ ట్విటర్లో ఒక వీడియోను పంచుకున్నారు. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్. 15 ఆగస్ట్ 2గంటలకు కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో రెండు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. ఫ్లాగ్షిప్ S1 ప్రోతో పోలిస్తే మరింత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని భావిస్తున్నారు.గత ఏడాది ఇదే రోజున ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. S1, S1 ప్రో వేరియంట్లను పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం S1 అమ్మకాలను నిలిపివేసి , S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తున్న సంగతి గమనార్హం Wheels of the revolution! pic.twitter.com/8zQV3ezj6o — Bhavish Aggarwal (@bhash) August 13, 2022 -
ఎలక్ట్రిక్ వాహనాలు రయ్..రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది (2021) మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 20,294 ఎలక్ట్రిక్ వాహనాలుండగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 35,677కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 15,383 ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగాయి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు మధ్యనే 12 వేల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 9,762 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 21,765కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 12,003 ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి. కార్లూ పెరుగుతున్నాయ్ మరోవైపు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 7,957 ఎలక్ట్రిక్ కార్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 8,427కు చేరింది. అలాగే ఏడాది కాలంలో రాష్ట్రంలో ఈ–రిక్షాల సంఖ్య రెట్టింపైంది. గత ఏడాది మార్చి నాటికి ఈ–రిక్షాల సంఖ్య 672 కాగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 1,322కు పెరిగింది. ఎలక్ట్రిక్ మూడు చక్రాల గూడ్స్ వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్ మూడు చక్రాల గూడ్స్ వాహనాలు కేవలం 16 మాత్రమే ఉంటే.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 170కు పెరిగాయి. చార్జింగ్ స్టేషన్లు వస్తే మరింత పెరుగుదల పెట్రోల్, డీజిల్ బంకుల తరహాలో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవల వాటి వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నాటికి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. భవిష్యత్‌లో ఈ వాహనాల వినియోగం మరింత పెరుగుతుంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. కొత్త లుక్ ఇలా ఉంటుందా?
ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్డుపై వెళ్తుంటే..అందరి చూపు దానిపైనే ఉండేది. అందుకే ఆ బండి సైలెన్సర్‌కు సపరైట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా యూత్ అందరికి లైఫ్‌లో ఒక్కసారైన ఈ బైక్‌ను కొనుక్కోవాలనే డ్రీం ఉంటుంది. అలాంటి ఇండియన్ మోస్ట్ బైక్ బ్రాండ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేయనుంది. భారత్‌లో రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350ని విడుదల చేసింది. ఈ తరుణంలో ఆటోమొబైల్ మార్కెట్లో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకొని, కాంపిటీషన్లో పై చేయి సాధించాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయడం తప్పని సరని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. అందుకే 2026 నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. యూకేకి చెందిన 'ఎలక్ట్రిక్ క్లాసిక్ కార్స్' సంస్థ 2020లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేసింది. 125 సీసీ రేంజ్ బైక్స్ సైతం వినియోగదారుల్ని ఆకట్టుకున్నాయి. భారత్‌లో సైతం ఇదే తరహాలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్‌ను ఎలక్ట్రిక్ బైక్స్‌గా మార్చేసి మార్కెట్‌కు పరిచయం చేస్తుందా? అనే సందేశాలు వ్యక్త మవుతున్నాయి. అవును, నాణ్యత, పనితీరు, బ్రాండ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ బైక్స్‌ను అందించడం తొందరపాటులో లేదని రాయల్ ఎన్ఫీల్డ్ స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బైక్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ ..భవిష్యత్‌లో తయారు చేయనున్న ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లు ఫీల్, సపరైట్ ఐకానిక్ లుక్ ఉండేలా ఆ సంస్థ శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి👉 డుగ్గుడుగ్గు మంటూ..రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ వచ్చేస్తోంది! -
పేలిన ఎలక్ట్రిక్ బైక్
సాక్షి, నెల్లూరు: చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన శుక్రవారం కందుకూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణానికి చెందిన ఆరీఫ్ అనే వ్యక్తి ‘ఎకోతేజా’ అనే కంపెనీకి చెందిన విద్యుత్ బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని కొంతకాలం క్రితం రూ.80 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. శుక్రవారం కనిగిరి రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఓ చోట వద్ద వాహనానికి చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటికే వాహనం బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. బ్యాటరీ పేలిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం!
ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. వెహికల్స్‌పై ఉన్న మక్కువతో ఓ యూట్యూబర్ పెట్రో వెహికల్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ట్రయల్స్ కూడా చేశాడు. గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ వెహికల్స్ ఉపయోగించి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందుకే వాహన దారులు పెట్రో వెహికల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈవీ వెహికల్స్ ధర ఎక్కువగా ఉందని భావించిన ఓ యూట్యూబర్ తన పెట్రో వెహికల్.. ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాల రూ.18,500. దాన్ని ఒక్కసారి చేస్తే 200కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అలా అని బైక్‌ను నాసిరకంగా ఈవీ బైక్‌గా మార్చాడనుకుంటే పొరబడినట్లే. యూనిక్‌గా ఈవీ వెహికల్స్‌ను ఎలా తయారు చేస్తారో ఈవీ బైక్‌ను అలాగే డెవలప్ చేశాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. సుజికీ ఏఎక్స్ 100 పెట్రోల్ బైక్ సుజికీ ఏఎక్స్ 100ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు. ఈ బైక్‌ను లిథియం అయాన్ బ్యాటరీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. కంట్రోలర్, కేబుల్స్, ఎల్ఈడీ టైల్ టైల్స్,టర్న్ ఇండికేటర్స్, వెహికల్స్ ప్రారంభ స్పీడ్ 50 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా లైటర్ వీల్స్, సింగిల్ సీట్ డిజైన్..అవసరం అనుకుంటే రెండు సీట్లను అమర్చుకోవచ్చు. ఇక ఆర్ఎక్స్ 100 కేఫ్ రేసర్ లుక్‌తో అదరగొట్టేస్తుంది. ప్యాషన్‌తో చేసిందే ఈ బైక్ ఈవీ బైక్‌ను ఎవరు తయారు చేశారనే విషయాలు తెలియాల్సి ఉండగా..ఈ బైక్‌ను నడిపేందుకు ఆర్టీవో, ఆటోమోటీవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పర్మీషన్ కోసం అప్లయ్ చేసినట్లు తెలిపాడు. ప్యాషన్‌తో చేసిందే తప్పా డబ్బులు కోసం కాదని, ఈ బైక్ తయారు చేసినందుకు ఖర్చు చేసిన మొత్తం జీఎస్టీతో కలుపుకొని రూ.18,500 అని సదరు యూట్యూబర్ వీడియోలో తెలిపాడు. చదవండి: Ola Electric: పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా! -
ఓలా ఉద్యోగులకు షాక్.. వందల మంది తొలగింపు..?
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఓలాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఓలా ఫ్లాంట్‌ను షట్ డౌన్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి రాగా.. 3 వారాల్లో సుమారు 300 నుంచి 350 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఓలా తొలగించిన ఉద్యోగుల్లో ప్రొడక్ట్, మార్కెటింగ్, సేల్స్, సప్లై, టెక్, బిజినెస్, ఆపరేషన్స్ సహా అన్ని ఇతర డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులున్నారు. వారికి నెల రోజుల ప్యాకేజీ, నోటీస్ పిరియడ్ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా "దీని గురించి ( ప్యాకేజీ,నోటీస్ పిరియడ్) ఎటువంటి అధికారిక ప్రకటనలేదు. గత మూడు వారాలుగా ప్రతిదీ చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. మాకిచ్చిన ల్యాప్‌ట్యాప్‌లతో పాటు ఇతర ఉపకరణాల్ని తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక నెల వేతనంతో తక్షణమే వెళ్లిపోవాలని లేదా నోటీసు వ్యవధిని అందించాలని అడుగుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. -
పాపం..అంచనా తలకిందులైందే? ఈవీ వెహికల్స్ తయారీ నిలిపేసిన ఓలా!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ జిల్లా కృష్ణగిరిలో ఉన్న తయారీ ప్లాంట్‌లో ఓలా తయారీ కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ నిలిపివేతపై ఓలా ప్రతినిధుల్ని వివరణ కోరగా వెహికల్స్ తయారీ కోసం కొత్త మెషిన్లను ఇన్స్టాల్ కోసం గత వారం రోజుల నుంచి ప్రొడక్షన్ నిలిపివేసినట్లు తెలిపారు. కానీ ప్రొడక్షన్‌ను షట్ డౌన్ చేయడానికి ఇతర కారణాలున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అంచనా తలకిందులైందే? అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు తన ఇన్నోవేటీవ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో అమ్మకాలు జరిపే సత్తా ఉన్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్. కానీ ఓలా అమ్మకాల్లో తన అంచనాలు తలకిందులైనట్లు తెలుస్తోంది. సమ్మర్ సీజన్లో ఆ సంస్థ తయారు చేసిన వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ తయారు చేయడం, చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్ టైర్లు ఊడిపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకున్న కొనుగోలు దారులు సైతం వెనక్కి తగ్గారు. దీంతో తయారీ ఉత్పత్తి పెరిగిపోయి.. కొనుగోలు డిమాండ్ తగ్గింది. వెహికల్స్ పేరుకుపోతున్నాయ్? తమిళనాడులో ఫ్యూచర్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న ఓలా ఫ్లాంట్‌లో సుమారు 4వేలకు పైగా ఈవీ వెహికల్స్ అమ్ముడుపోక స్టాక్ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి రోజుకు 600వెహికల్స్ తయారీ సామర్ధ్యం ఉన్న ఫ్లాంట్‌లో కేవలం రోజుకు 100 వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇటీవల కాలంలో ఓలా ఎస్1 ప్రోను కొనుగోలు చేసిన వాహనదారులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అశోక్ బైద్ ఏం చెప్పారంటే ఓలా వెహికల్స్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపపథ్యంలో ఓలాఎస్1ప్రో'ను కొన్న అశోక్ బైద్ అనే వాహనదారుడు స్పందించారు. నేను గతనెలలో ఓలా ఎస్1 ప్రోను కొనుగోలు చేశా. ఇప్పటి వరకు నేను ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొలేదు. సంస్థ వెహికల్స్‌ను విడుదల చేసిన ప్రారంభంలో సమస్యలు ఎదురైన మాట వాస్తవమేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు లేవు ఆటోమొబైల్ సంస్థలు వార్షిక నిర్వహణకు అనుగుణంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాయి.మేం కూడా అదే చేస్తున్నాం. ఓలా ప్రొడక్షన్ ఎందుకు షట్ డౌన్ చేశారనే విషయంలో ఇతర కారణాలు ఏవీ లేవని ఓలా స్పోక్ పర్సన్ తెలిపారు. చదవండి: ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
7 ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతి, ఓవర్ చార్జింగే కారణమా?
సాక్షి,ముంబై: మహారాష్ట్ర, పూణెలోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షాపులో ఏడు ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమైన ఉదంతం కలకలం రేపింది. రాత్రి పూట వాహనాలు చార్జ్ అవుతుండగా, షార్ట్ సర్క్యూట్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక దళం మంటలను ఆర్పాల్సి వచ్చింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణాన్ని తోసిపుచ్చిన ఫైర్ అధికారి బ్యాటరీ ఓవర్ చార్జ్ కావడంతో మంటలంటుకుని ఉండవచ్చన్నారు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడ లేదు. షోరూంలో మొత్తం 16 స్కూటర్లు ఉన్నందున ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సమగ్ర విచారణ తర్వాతే కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. షోరూమ్‌లో ఒక బైక్‌లో పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయనీ, తరువాత ఆరు స్కూటర్లను చుట్టుముట్టాయని యాజమాన్యం వెల్లడించింది. ఇతర ఆస్తులకు కూడా నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది. మొత్తం స్కూటర్ల అంచనా ఖరీదు దాదాపు రూ.7 లక్షలుగా భావిస్తున్నారు. విచారణ తరువాత వివరాలు అందిస్తామని కొమాకి దేవల్ రైడర్స్ షోరూమ్ యజమాని ధనేష్ ఓస్వాల్ తెలిపారు. కాగా ఈ వేసవిలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది మార్చిలో పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తర్వాత తనిఖీ కోసం 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ లోపాలే ఈ ప్రమాదానికి కారణమన్న ఆందోళనల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక తరువాత కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. నాసిరకం బ్యాటరీ ప్యాక్‌లకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఆయా కంపెనీలకు పంపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం నిబంధనలను పాటించడంలో విఫలమైతే డిఫాల్టర్ కంపెనీలకు భారీ జరిమానాలు తప్పవని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
టార్గెట్ 10 కోట్ల అమ్మకాలు..ఈవీ రంగంలోకి మరో దిగ్గజ సంస్థ!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల రంగంలో అంతర్జాతీయంగా నాయకత్వ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుంది. పరిమాణం పరంగా సంప్రదాయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో ఇప్పటికే అంతర్జాతీయంగా అగ్ర స్థానంలో ఉంది. పండుగల సీజన్ నాటికి భారత ఈవీ విపణిలో కంపెనీ రంగ ప్రవేశం చేయనుంది. విదా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సంస్థ ప్రవేశపెట్టనుంది. ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్ పెట్టుబడులు చేసింది. కాగా, 2021–22లో సంస్థ రూ.29,802 కోట్ల టర్నోవర్ సాధించింది. 1984 నుంచి 2011 మధ్య 10 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి భారీ మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. 2030 నాటికి మరో 10 కోట్లు.. ‘ఈ ఏడాది హీరో మోటోకార్ప్ పర్యావరణ అనుకూల వాహన విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా తన నాయకత్వాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ రంగానిదిగా మారుస్తుంది. తదుపరి దశాబ్దానికై సిద్ధంగా ఉన్నాం’.2030 నాటికి మరో 10 కోట్లు వాహనాల్ని అమ్మేదిగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు వాటాదార్లకు ఇచ్చిన సందేశంలో సంస్థ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ స్పష్టం చేశారు. -
ఓలాకి గడ్డు కాలం..వందల మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ లోపాలు, ఆర్థిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బ్యాటరీ లోపాల కారణంగా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వాహనదారులు సైతం ఆ సంస్థ ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు వెనక్కి తగ్గారు. ఫండింగ్ సమస్యలు తలెత్తాయి. వెరసి సంస్థను ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ఓలా 500 మంది ఉద్యోగుల్నితొలగించనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా పనితీరును బట్టి ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాదు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టిసారించిన ఓలా.. ఆ సంస్థ అనుసంధానంగా ఉన్న ఓలా కేఫ్, ఫుడ్ పాండా, ఓలా ఫుడ్స్,ఓలా డ్యాష్లను మూసి వేసింది. -
Electric Vehicles Burst Incidents: మంటల్లో ఈవీ.. సమాధానాలేవీ...?
ఓ వైపు పెట్రోల్ రేట్ల మంట మరోవైపు కరోనాతో దెబ్బతిన్న వినియోగదారుల కొనుగోలు శక్తి...ఈ నేపధ్యంలోనే భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను విప్లవం చోటు చేసుకుంటుంది. విద్యుత్, వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ మార్కెట్ 2021లో మూడు రెట్లు పెరగడం ఈ– వెహికల్ పరిశ్రమకు ఓ టర్నింగ్ పాయింట్‌గా కూడా నిలిచింది. ఈ– పరిశ్రమ 2022 సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఎన్నో రెట్ల వృద్ధిని సాధించింది. వినియోగదారులలో అవగాహన పెరగడంతో పాటుగా అమ్మకాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు భారత దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10స్కూటర్లలో ఒకటి ఈవీ స్కూటర్ అని రవ్నీత్ చెబుతూ, గత 12 నెలల కాలంలో ఈ రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. నాణేనికి మరోవైపు...? ఇలా ఈవీల పట్ల దేశవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ఈ– పరిశ్రమకు నూతనోత్తేజం అందిస్తుంటే... మరోవైపు ఇటీవలి కాలంలో విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురై తగులబడిన సంఘటనలు జరిగాయి. ఇవి వినియోగదారులలో అనేక ఆందోళనలకూ సందేహాలకూ దారి తీశాయి. ఇది పరిశ్రమ వృద్ధికి ప్రతికూలంగానూ మారుతోందనే భయాందోళన వాహన పరిశ్రమలోనూ చోటు చేసుకుంది. ఈవీలలో ఎదురవుతున్న సమస్యలకు తక్షణమే తగిన పరిష్కారాలను కనుగొనకపోతే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముందనే ఆందోళనతో ఉత్పత్తిదారులు ఏకీభవిస్తున్నారు. బ్యాటరీ కీలకం... ఈవీ వాహన వృద్ధిలో బ్యాటరీ అభివృద్ధి అత్యంత కీలకం, వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని బ్యాటరీల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈవీలకు గుండె లాంటి బ్యాటరీ ఒక్కటి బాగుంటే ఈవీ చాలా వరకూ బాగున్నట్లే. అయితే ఈవీలలో బ్యాటరీలు విఫలం కావడానికి ప్రధాన కారణం మన దేశ పరిస్ధితులకనుగుణంగా వాటిని ఓఈఎంలు డిజైన్ చేయకపోవడమేనని తాజాగా నిపుణులు విశ్లేషించారు. ఈవీ పరిశ్రమలో వేగవంతమైన వృద్ధిని చూసి తగిన అవగాహన లేని వారు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. ఇలాంటి వారు భారతీయ పరిస్థితులకనుగుణంగా డిజైనింగ్, టెస్టింగ్, వాలిడేషన్ చేయకపోవడం పెద్ద సమస్యగా మారింది. భారతీయ వాతావరణ పరిస్ధితులు దృష్టిలో పెట్టుకుని మెరుగైన ప్రమాణాలను ప్రతి ఓఈఎం నిర్ధేశించుకుంటే ఈ సమస్య ముగిసే అవకాశాలున్నాయని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు ఈవీలు తగలబడటానికి కారణం కాదంటూ ఉష్ణోగ్రతలు పెరిగితే వాహన సామర్ధ్యం దెబ్బతింటుందన్నారు. అమ్మకాలపై మంటల ప్రభావం లేదు... ఇటీవలి కాలంలో ఈవీల పరంగా కొన్ని దురుదృష్టకర సంఘటనలు జరిగినా అమ్మకాల పరంగా క్షీణత ఏమీ లేదన్నారు. వాహనాల ఉత్పత్తిసంస్థ ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోఖేలా. అయితే ఈ సమస్యలకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఎథర్ ఎనర్జీ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్, టెస్టింగ్ పై తీవ్ర పరిశోధనలు చేసిందంటూ విభిన్న భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను డిజైన్ చేశామన్నారు రవ్నీత్. సేఫ్టీ అనేది తమ దగ్గర కేవలం చెక్‌బాక్స్ ఐటెమ్ కాదని అది తమకు అది అతి ప్రధానమైన ఎంపికన్నారు. తమ మొదటి వాహనం 2018లో విడుదల చేయడానికి ఐదేళ్ల ముందుగానే బ్యాటరీ ప్యాక్‌లను తాము నిర్మించామన్నారు. తమ స్కూటర్లను ఒక లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించడం జరిగిందంటూ అత్యంత కఠినమైన ప్రమాణాలను తాము అంతర్గతంగా నిర్ధేశించుకున్నామన్నారు. తాము బ్యాటరీ ప్యాక్‌లను ఇతరుల వద్ద కొనుగోలు చేయమంటూ, తామే వాటిని ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నామన్నారు. ఓ స్టార్టప్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ త్వరలోనే 4వ తరపు బ్యాటరీ ప్యాక్ విడుదల చేయబోతున్నామని ప్యాక్ లెవల్లో 120 పరీక్షలు, వాహన స్ధాయిలో దాదాపు 800 పరీక్షలు చేస్తామని, ఇవి కాకుండా మరిన్ని పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు. అని రవ్నీత్ అన్నారు. నాణ్యత పట్ల సరిగా శ్రద్ధ పెట్టకపోవడం, డిజైనింగ్ లోపాలు కూడా సమస్యకు కారణమవుతుందన్నారు. జాగ్రత్తగా ఎంచుకోవాలి... ఈవీలు తగలబడుతున్న కాలం, పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ఈవీలను ఎలా ఎంచుకోవాలనేది ప్రశ్నే అయినా కాస్త శ్రద్ధ పెడితే వీటిని ఎంచుకోవడం తేలికేనన్నారు రవ్నీత్. సవారీ చేసిన వెంటనే ఈవీలకు చార్జింగ్ పెట్టకూడదు, చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ తీసేయాలి లాంటి సూచనలన్నీ వాహన డిజైనింగ్ సరిగా లేని పరిస్థితుల్లోనే వస్తాయన్నారు. బ్యాటరీ ప్యాక్ ట్యాంపర్ చేయకుండా ఉండటం, నాణ్యమైన, అధీకృత చార్జర్లు వాడటం, వాహనాలు రెగ్యలర్‌గా సర్వీస్‌చేయించడం చేస్తే సమస్యలు రాకుండా పనిచేస్తాయని ఆయన సూచిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ బైక్స్ వరుస అగ్నిప్రమాద ఘటనలపై కేంద్రం స్పందించింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాల ఘటనలను సుమోటోగా స్వీకరించిన కేంద్రం, అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరించి, నాణ్యతా ప్రమాణాల వివరణ ఇవ్వాలని వినియోగదారుల పర్యవేక్షణ సంస్థ ద్వారా ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవలి ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాద సంఘటనలపై ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసు జారీ చేసిందని సీఎన్‌బీసీ రిపోర్ట్ చేసింది. అలాగే ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్ వారి ఇ-స్కూటర్లు పేలడంతో సీసీపీఏ గత నెలలో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌కు 15 రోజుల గడువు ఇచ్చింది. మరోవైపు తమ బ్యాటరీ సిస్టం ఇప్పటికే యూరోపియన్ స్టాండర్డ్ ఈసీఈ 136కి అనుగుణంగా ఉండటంతో పాటు దేశీయ తాజా ప్రతిపాదిత ప్రమాణం ఏఐఎస్ 156 కు అనుగుణంగా ఉందని కంపెనీ తెలిపింది. కాగా ఇటీవల, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు ఆందోళన రేపాయి. దీంతో తయారీ దారులు తమ వాహనాలను రీకాల్ చేసాయి. ఏప్రిల్‌లో, ఓలా ఎలక్ట్రిక్ 1 441యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్ని రీకాల్ చేసింది. అలాగే బూమ్ మోటార్స్ ఏప్రిల్ చివరి వారంలో కార్బెట్ బైక్స్ బ్రాండ్‌తో విక్రయించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పేలుడు సంభవించి 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. తెలంగాణలోని నిజామాబాద్‌లో ప్యూర్ ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలుడు కారణంగా 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సుమారు 2,000 స్కూటర్లను రీకాల్ చేసింది. ఇది ఇలా ఉంటే టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను ట్విటర్ షేర్ చేసిన ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీ ప్రమాదాలు జరుగుతాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ అగ్నిప్రమాదాలు జరుగుతాయి. కానీ ఐసీఈ ప్రమాదాలతో పోలిస్తే ఈవీల్లో తక్కువని ఆయన ట్వీట్ చేశారు. In case you missed it @hormazdsorabjee 🤔 EV fires will happen. Happens in all global products too. EV fires are much less frequent than ICE fires. https://t.co/gGowsWTKZV — Bhavish Aggarwal (@bhash) June 23, 2022 -
మొత్తం మీరే చేశారు! భవీష్ అగర్వాల్.. మా ప్రాణాల్ని కాపాడండి!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. ఓ వైపు 24 గంటల్లో వెహికల్ డెలివరీతో కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండుగా..ఆ వెహికల్స్‌ను వినియోగిస్తున్న వాహనదారులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో యజమానులు ఆ సంస్థ అధినేత భవీష్ అగర్వాల్‌పై మండిపడుతున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా ఓలా వెహికల్స్ వరుస ప్రమాదాల బారిన పడుతున్నాయి. బ్యాటరీ సమస్య కారణంగా మంటల్లో కాలిపోవడం, నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్ టైర్లు ఊడిపోవడం, విరిగిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. @OlaElectric @bhash The front fork is breaking even in small speed driving and it is a serious and dangerous thing we are facing now, we would like to request that we need a replacement or design change on that part and save our life from a road accident due to poor material usd pic.twitter.com/cgVQwRoN5t — sreenadh menon (@SreenadhMenon) May 24, 2022 తాజాగా కేరళకు చెందిన శ్రీనాథ్ మీనన్ అనే ట్విట్టర్ యూజర్ తనకు జరిగిన ప్రమాదంపై ట్వీట్ చేశాడు. నామమాత్రం స్పీడ్‌లో ప్రయాణిస్తున్నా వెహికల్స్ కు ప్రమాదాలు జరుగుతున్నాయని, తాను డ్రైవింగ్ చేసే సమయంలో వెహికల్ ఫ్రంట్ ఫోర్క్ ఇరిగిపోయింది. ఓలా సీఈవో ఈ ప్రమాదాలపై స్పందించాలి. రిప్లెస్మెంట్ లేదంటే డిజైన్లు మార్చి నాసిరకం మెటియరల్ కారణంగా రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని ట్వీట్లో పేర్కొన్నాడు. My OLA's front fork got collapsed while hitting against a wall at 25kmph in Eco mode along an uphill Some other users also faced similar issues with the front fork My brother just escaped from very serious head injuries but then also got a deep cut on his face @bhash @OlaElectric pic.twitter.com/W689gOVxYQ — ANAND L S (@anandlavan) May 25, 2022 ఈకో మోడ్‌లో 25 కేఎంపీహెచ్ స్పీడ్‌తో ఓలా బైక్ ప్రమాదానికి గురైందని మరో ట్విట్టర్ యూజర్ ఆనంద్ ఎల్ తెలిపాడు. ఈ సందర్భంగా నాతో పాటు ఇతర ఓలా వాహనదారులు సైతం ఈ తరహా ప్రమాదానికి గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక నా వెహికల్‌కు జరిగిన ఈ ప్రమాదంలో నా తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖం మీద లోతుగా తెగిన గాయాలతో ఆస్పత్రిపాలయ్యాడంటూ భవీష్ అగర్వాల్ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే.. -
ఎలక్ట్రిక్ సైకిళ్లపై రాష్ట్ర సర్కార్ బంపరాఫర్!
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిళ్లపై బంపరాఫర్ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు దారులకు సబ్సీడీ అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారమే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..గత ఏప్రిల్ నెలలో అరవింద్ కేజ్రివాల్ ఎలక్ట్రిక్ సైకిళ్లపై సబ్సీడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలో నివాసం ఉండే కొనుగోలు దారులకు ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.15వేల వరకు సబ్సీడీ ఇవ్వనుంది. తొలి 10వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు రూ.5,500 వరకు ప్రోత్సాహాకాల్ని (ఇన్సెన్టీవ్స్) అందిస్తుంది. తొలి వెయ్యిలోపు వెహికల్స్‌కు రూ.2వేలు, తొలి 5వేల లోపు ఈ కార్గో సైకిల్ కొనుగోలు దారులకు రూ.15వేల లోపు ప్రోత్సాహాకాల్ని అందించనుంది. ఈకార్గో సైకిల్‌తో ఫుడ్ డెలివరీతో పాటు ఇతర కమర్షియల్ వర్క్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సైకిల్స్ ఎలా ఉంటాయంటే! ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను తొక్కేందుకు పెడల్ సౌకర్య ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే పెట్టుకునేందుకు బ్యాటరీలు ఉంటాయి. అంతేకాదు ఈ సైకిల్స్‌తో ఎంటర్ టైన్మెంట్తో పాటు కమ్యూనికేటింగ్ సదుపాయం కూడా ఉంది. -
ఇటలీ సంస్థతో ఒకినావా ఆటోటెక్ జట్టు!
ముంబై: ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టేసిటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒకినావా ఆటోటెక్ వెల్లడించింది. దీని ప్రకారం స్కూటర్లు, మోటర్‌సైకిళ్లతో పాటు దేశ, విదేశీ మార్కెట్లకు పవర్ట్రెయిన్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయనున్నారు. భారత్ కేంద్రంగా జేవీ ఏర్పాటవుతుందని, రాజస్థాన్‌లోని తమ రెండో ప్లాంటులో 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది తయారు చేసే వాటిలో ఒక స్కూటర్, హై–ఎండ్ మోటర్‌సైకిల్ మోడల్ ఉంటాయని ఆయన వివరించారు. ప్రథమార్ధంలో డిజైనింగ్, అభివృద్ధి మొదలైన పనులు చేపట్టనున్నట్లు శర్మ చెప్పారు. టేసిటా సొంతంగా పవర్‌ట్రెయిన్, కంట్రోలర్, మోటర్, బ్యాటరీ ప్యాక్‌లు మొదలైన వాటిని డిజైన్ చేసుకుని, ఉత్పత్తి చేస్తుంది. జేవీలో భాగంగా టేసిట్ పవర్‌ట్రెయిన్ మొదలైనవి అందించనుండగా స్థానికంగా ఉత్పత్తి అభివృద్ది, తయారీని ఒకినావా చేపడుతుంది. మార్కెట్‌పై గట్టి పట్టు ఉన్న ఒకినావాతో జట్టు కట్టడంపై టేసిటా ఎండీ పీర్పాలో రిగో సంతోషం వ్యక్తం చేశారు. -
ఎలక్ట్రిక్ వాహనాల భవితవ్యంపై గడ్కరీ కీలక ప్రకటన
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండడం, బ్యాటరీలు పేలిపోతుండడం.. పలువురు మృతి చెందుతుండడం, గాయపడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో మార్కెట్లో ఈ-బైకులు కొనేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. భవిష్యత్తు అంతా ఈవీదే అనే నమ్మకంతో అడుగుపెట్టిన కంపెనీలకు ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు. ఈ తరుణంలో.. రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు లోపాలున్న వాహనాలను తక్షణమే వెనక్కి తెప్పించుకోవాలని ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను మంగళవారం ఆయన కోరారు. అంతేకాదు.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేడిమి వల్ల ఈవీ బ్యాటరీలకు సమస్య తలెత్తుతుందన్న మాటా మంత్రి నితిన్ గడ్కరీ నోట నుంచి వచ్చింది. ‘‘దేశంలో ఈవీ పరిశ్రమ ఇప్పుడే మొదలైంది. కాబట్టి ప్రస్తుత పరిణామాల ఆధారంగా ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయాలనుకోవట్లేదు. ఈవీలను వాడుకంలోకి తేవాలన్నదే మా సంపూర్ణ లక్ష్యం. కానీ, వాహన దారుల రక్షణ-భద్రతలను ముఖ్యప్రాధాన్యతలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, ప్రాణాలతో ముడిపడిన విషయం కాబట్టి రాజీ పడే ప్రసక్తే లేద’’ని స్పష్టం చేశారాయన. వాహనాలను మార్కెట్లోకి తెచ్చే ముందు కంపెనీలే ముందస్తుగా స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలంటూ మంత్రి గడ్కరీ పిలుపు ఇచ్చాడు. వేసవి సీజన్ కావడంతోనే ఈవీ బ్యాటరీల ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడిన ఆయన.. ఈ వరుస ప్రమాదాల ఆధారంగా ఈవీ రంగానికి ఎలాంటి అవాంతరాలు కలిగించబోమని హామీ ఇచ్చారు. కంపెనీలు, నిపుణులు ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ ఆయన కోరారు. ఇదిలా ఉండగా.. లోపాలున్న వాహనాల ప్రమాదాలపై ఇంతకు ముందే మంత్రి గడ్కరీ స్పందించారు. తక్షణమే అలాంటి ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి రప్పించుకోవాలని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే.. జరిమానాలు భారీగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు కూడా. మరోవైపు ది సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్) పుణేలో జరిగిన ఒలా బైక్ మంటల్లో కాలిపోయిన ప్రమాదంపై విచారణ చేస్తోంది. ఘటనపై దర్యాప్తుతో పాటు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ విభాగం సూచించనుంది. చదవండి: అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. కేంద్రం కన్నెర్ర? -
విజయవాడలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, ఒకరి మృతి
సాక్షి, విజయవాడ: ఎలక్ట్రిక్ బైకులు కదిలే బాంబుల్లా మారాయి. మంటల్లో చిక్కుకోవడం, చార్జింగ్‌లో ఉండగానే పేలిపోవడం కామన్‌గా మారింది. నిన్నా మొన్నటి వరకు తమిళనాడు, మహారాష్ట్రకే పరిమితమైన ఈ ప్రమాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ ఘటన మరిచిపోకముందే విజయవాడలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. విజయవాడలోని సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ ఇటీవల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. రాత్రి వేళ బెడ్రూమ్లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా తెల్లవారుజామున బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి మంటలు అలుముకున్నాయి. శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఈ మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే శివకుమార్ మరణించగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. చదవండి: (తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా?) -
హోండా ఎలక్ట్రిక్ టూ వీలర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎలక్ట్రిక్ మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. అలాగే తక్కువ ధరలో లభించే 100 సీసీ బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ‘ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ద్విచక్ర వాహనాల అభివృద్ధిలో నిమగ్నం కావాలని కృతనిశ్చయంతో ఉన్నాం. వీటికి ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అనుసంధానిస్తాం. ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడంపై ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నాం. 40 దేశాలకు భారత్ నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. మరిన్ని దేశాల్లో అడుగుపెడతాం. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించాలన్నది లక్ష్యం. అంటే మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 30 శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో 40 లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం ఉందని హోండా తెలిపింది. చదవండి: పెట్రోల్ ధరలకు విరుగుడు.. ఫ్లెక్స్ ఇంజన్‌తో వస్తోన్న హోండా బైక్ -
ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ తాజాగా చార్జింగ్ మౌలిక వసతుల రంగంలో ఉన్న బోల్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశవ్యాప్తంగా 50,000 చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే 4.5 లక్షల పైచిలుకు వినియోగదార్లకు ప్రయోజనం కలిగించేందుకు 750కిపైగా హీరో ఎలక్ట్రిక్ విక్రయ కేంద్రాల్లో బోల్ట్ చార్జర్స్‌ను అందుబాటులో ఉంచుతారు. 2,000 మంది హీరో ఎలక్ట్రిక్ కస్టమర్ల ఇళ్ల వద్ద చార్జింగ్ యూనిట్లను ఉచితంగా నెలకొల్పుతారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 10 లక్షలకుపైగా చార్జింగ్ పాయి ంట్లను ఏర్పాటు చేయాలన్నది బోల్ట్ లక్ష్యం. చదవండి: రష్యాలో వ్యాపారానికి టాటా స్టీల్ గుడ్‌బై -
ఈ-బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి దుర్మరణం
-
Nizamabad: పేలిన ఈ-బైక్ బ్యాటరీ.. ఒకరి మృతి
సాక్షి, నిజామాబాద్: పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. నిజామాబాద్ టౌన్ సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్..కేంద్రం సంచలన నిర్ణయం!
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్స్‌లో ఉండే బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకోనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. “మేం సెల్ ప్రమాణాలు, బ్యాటరీల పరీక్షా ప్రమాణాలు, నిర్వహణ పద్దతుల్ని సవరిస్తాం. నిర్దిష్ట టెంపరేచర్ దాటిన తర్వాత బ్యాటరీలలోని ద్రావణంలో రాపిడి జరిగి (ఉదాహరణకు లిథియం అయాన్ బ్యాటరీలోని ఎలక్ట్రోలేడ్ ద్రావణం) ప్రమాదాలు జరుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారంటూ వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక పేర్కొంది. మరోవైపు కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ దారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే..ప్రస్తుతం ఆయా ఆటోమొబైల్ సంస్థలు మార్కెట్లో ఈవీ వెహికల్స్ ఉన్న డిమాండ్‌ను బట్టి విపరీతంగా తయారీని పెంచుతున్నాయి. ఒకవేళ కేంద్రం బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తే..కంపెనీలు తయారీ కాకుండా.. భద్రతపై దృష్టిసారించి..ఉత్పత్తి అనుకున్నంతగా చేయలేవని నిపుణులు అంటున్నారు. 30 రోజుల్లో ఆరు వెహికల్స్ దగ్ధం దేశ వ్యాప్తంగా గత ముప్పై రోజుల్లో దాదాపు అర డజను ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతైనట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్‌లో కంటైనర్‌లో లోడ్ చేసిన జితేంద్ర న్యూ ఈవీ టెక్కు చెందిన 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. నో రీకాల్..కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్ధమవ్వడంపై..ప్రభుత్వం ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేయాలని ఆదేశించడంపై కేంద్రం ఆలోచించడం లేదని, బదులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలపై నిజ నిర్ధారణ పరిశోధనల రిపోర్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గిరిధర్ అరమనే ఏం చెప్పారు అంతకుముందు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలపై..కేంద్రం వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే చెప్పారు. చదవండి: టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా! -
టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా!
దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలని ఎగబడుతున్నారు. కానీ వరుస ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలు వాహనదారుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహరాష్ట్ర, పూణేలలో ఈవీబైక్‌లు దగ్ధమవ్వగా..ఇవ్వాళ వరంగల్‌లో మరో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. వరంగల్‌లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. ఉదయం 6గంటలకు వరంగల్ చౌరస్తాలోని అప్నా పాన్ షాప్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసింది. పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే..లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఎలక్ట్రోలేడ్ ద్రావణం రోజుల వ్యవధిలో వరుసగా ఎలక్ట్రిక్ బైక్‌లు తగలబడిపోవడం..ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై భయాల్ని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులు ఈ లిథియం అయాన్ బ్యాటరీలను వాడాలంటే జంకుతున్నారు. ఎందుకంటే సరైన పద్దతిలో వినియోగించుకోకపోతే లిథియం అయాన్ బ్యాటరీలో పేలే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్ల వద్ద ఎలక్ట్రోలేడ్ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఉన్న ఆయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరో ఎలక్ట్రోడ్‌కు ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ ద్రావణం అగ్ని ప్రమాదం జరిగేలా ప్రేరేపిస్తుంది. కాబట్టే ఎలక్ట్రోడ్లు ఉండే బ్యాటరీలను విమానాల్లోకి అనుమతించరు. ఏథర్ ఏం చెబుతుందంటే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఏథర్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం లిథియం అయాన్ బ్యాటరీకి వర్తిస్తుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్ డిస్చార్జింగ్ రేటు. సామర్థ్యం, లైఫ్ సైకిల్, ఛార్జింగ్ అయ్యే సమయంలో ఏ స్థాయిలో వేడెక్కుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను వినియోగించుకోవచ్చని, అప్పుడే పేలుడు ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని ఎథర్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. చదవండి: ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ? -
ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ?
ఆటోమొబైల్ మార్కెట్లో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుస ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలు కొనుగోలు దారుల్ని ఆందోళన గురిచేస్తుండగా.. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వెహికల్ ముందు టైర్ పూర్తిగా ఊడిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల పూణేలోని లోహెగావ్ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నికి ఆహుతైంది. ఆ తర్వాత మరో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ ఒకినావా ఈ- బైక్‌కు మంటలు అంటుకున్నాయి. Another one...Its spreading like a wild #Fire . After #Ola & #okinawa #electric scooter from #PureEV catches fire in Chennai. Thats the 4th incident in 4 days.. The heat is on.#ElectricVehicles #OLAFIRE #lithiumhttps://t.co/pFJFb7uKD7 pic.twitter.com/jJqWA48CNf — Sumant Banerji (@sumantbanerji) March 29, 2022 ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇప్పుడు మరోసారి ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేకులు ఫెయిలై షేపులు మారిపోయాయి. దీంతో డ్యామేజైన బైక్ ముందు టైరు ఫోటోలో చూపించినట్లుగా ముందుకు వచ్చేసింది. ఆ బైక్ నడుపుతున్న బాధితుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కేంద్రం ఏం చేస్తుంది ఇప్పటికే వరుస ప్రమాదాలతో ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలంటేనే కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే వాహనదారుల్లో ఉన్న భయాల్ని పోగొట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్స్ అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ ప్రమాదం జరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది. చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే?! -
మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్, రంగంలోకి దిగిన ఎస్బీఐ!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ విభాగంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వ్యాపార అవకాశాలు దక్కించుకోవడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దృష్టి సారించింది. వీటిపై అధ్యయనం చేసి, తగు సూచనలు చేసేందుకు కన్సల్టెంటును నియమించుకోనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం దరఖాస్తు చేసుకునే సంస్థకు .. పేమెంట్ సిస్టమ్స్ విషయంలో కన్సల్టింగ్ సర్వీసులు అందించడంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండేళ్ల పాటు లాభాల్లో ఉండాలి. గరిష్టంగా నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. బిడ్ల దాఖలుకు మే 10 ఆఖరు తేది. ఈ ఏడాది మార్చి మధ్య నాటికి దేశవ్యాప్తంగా 10.60 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. 1,742 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు పని చేస్తున్నాయి. -
ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్!
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. నిన్నమొన్నటి దాకా అవేం బండ్లు అని కొట్టేసిన వాహనదారులు..ఇప్పుడు అవే కావాలని ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూం వైపు కన్నెత్తి చూడని వాళ్లు సైతం ఎలక్ట్రిక్ బైక్స్, కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్, డీజిల్‌ను కొనేకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. గతేడాది ముంబైకి చెందిన ఆటోమొబైల్ సంస్థ స్ట్రోమ్ మోటార్స్ 'స్టోమ్ ఆర్3' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆ కారును కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు. ఆటో తరహాలో ఈ కారుకు ముందు రెండు టైర్లు.. వెనుక ఒక టైరు ఉండగా.. సీట్లు రెండే ఉన్నాయి. ఇక ఈ కారు 2,915ఎంఎం పొడవు 1,519 ఎంఎం, వెడల్ప్ 1,545 ఎత్తు ఉంటుంది. అచ్చం స్టోమ్ ఆర్3 కారు ముందు భాగం 'మహీంద్రా ఈ2ఓ'ను పోలి ఉంది. అయితే ఈ కారుకు టెక్నాలజీని జోడిస్తూ గ్రిల్ ఎలిమెంట్‌ను కారు ఎడమవైపు, కుడివైపు ఇలా బ్యానెట్ వరకు డిజైన్ చేశారు. ఇరువైపులా షట్కోణంలో డోర్స్ ఉన్నాయి. లగ్జరీ కార్లు ఫీచర్లు 1990లలో మెర్సిడెజ్ బెంజ్ కార్లలో ఉండే ఈ లగ్జరీ స్క్రీన్ ఫీచర్లు..ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ కార్లలో వస్తున్నాయి. ఇక ఈ కార్లో సైతం 3స్క్రీన్లు ఉండగా ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్లుగా ఉపయోగించుకోవచ్చు. అందులో ఒక స్క్రీన్ 7అంగుళాలు, మిగిలిన రెండు స్క్రీన్లలో ఒకటి 4.3 అంగుళాలు, మరో స్క్రీన్ 2.4 అంగుళాలుగా ఉంది. సెంట్రల్ కన్సోల్‌లో రెండు ఎయిర్కాన్ వెంట్(కారులో ఏసీ.లోపలి గాలి బయటకు..బయట గాలి లోపలికి వచ్చే) ఉంది. టూ టోన్ ఇంటీరియర్(కార్ టాప్, అండ్ బాడీ కలర్) తో బ్లాక్, లైట్ గ్రే కలర్స్ అందించబడుతుంది. 4జీ కనెక్టివిటీతో నావిగేషన్, వాయిస్ కంట్రోల్, సిగ్నల్ కంట్రోలింగ్ సపోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ కారు బరువెంతో తెలుసా? స్టీల్ స్పేస్ ఫ్రేమ్ ఆధారంగా కారు 550కిలోల బరువును తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. 15కేడబ్ల్యూ, 90ఎన్ఎం టార్క్ తో ఎలక్ట్రిక్ మోటారు, సింగిల్ రిడక్షన్ గేర్‌బాక్స్, స్ట్రోమ్ టాప్ స్పీడ్ 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయోచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే మూడు వేర్వేరు లి-అయాన్ బ్యాటరీ కాన్ఫిగరేషన్లు 120,160,200 కిలోమీటర్ల రేంజ్‌తో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు ధర ఎక్స్ షోరూమ్ కారు ధర రూ.4.5లక్షలుగా ఉండగా..కారును మార్కెట్లో విడుదలైన 4రోజుల్లో సుమారు 160కార్లు బుక్కైనట్లు స్ట్రోమ్ మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు. చదవండి: భారత్‌లో తొలి కియా ఎలక్ట్రిక్ కార్, స్టైలిష్ లుక్‌తో రెడీ ఫర్ రైడ్! -
బంపరాఫర్,జాక్ పాట్ కొట్టేసిన 'హీరో'ఎలక్ట్రిక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. డెలివరీ సేవల్లో ఉన్న షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్‌కు 25,000 యూనిట్ల ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సరఫరా చేయనుంది. సంస్థ ఖాతాలో 2024 నాటికి ఈ–వెహికల్స్ వాటాను 75 శాతానికి చేర్చనున్నట్టు షాడోఫ్యాక్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ 7,000 పిన్‌కోడ్స్‌లో డెలివరీ సేవలు అందిస్తోంది. నెలకు 2 కోట్ల డెలివరీలను నమోదు చేస్తోంది. నమోదిత యూజర్లు 10 లక్షలకుపైమాటే. స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, బిగ్‌బాస్కెట్, లీషియస్ వంటి 100కుపైగా బ్రాండ్స్‌తో భాగస్వామ్యం ఉంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్‌కు శుభవార్త!
డుగ్..డుగ్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు శుభవార్త. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీఎస్, హీరో, అథేర్, బీఎండబ్ల్యూ వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మే నెలలో ఎలక్ట్రిక్ బైక్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ కంపెనీల వెహికల్స్‌తో పోటీపడుతూ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైందని రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడుదలపై కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్‌ల ప్రకారం..చెన్నై కేంద్రంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్విచక్రవాహన ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ప్రోటోటైప్లను సిద్ధం చేస్తుందని, త్వరలో ఈవీ బైక్స్ తయారీని ప్రారంభించనుందని రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే! ఇండియా కార్ న్యూస్ నివేదికల ప్రకారం బైక్ 8కేడ్ల్యూహెచ్ నుండి 10కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ల ప్రకారం బైక్‌ల శక్తి, గరిష్ట టార్క్ 40బీహెచ్పీ, 100ఎన్ఎం ఉందని అంచనా. ఇక ఈబైక్ ప్రస్తుతం ఈ బైక్ ప్రోటోటైప్‌లు యూకేలో డిజైన్ చేస్తుండగా వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానుంది. -
కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే?!
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల బ్యాటరీలతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాల నేపథ్యంలో ఇలాంటి వాటిని నివారించేందుకు కెనడాకు చెందిన స్టార్టప్ సంస్థ మేకర్మ్యాక్స్ కసరత్తు చేస్తోంది. బ్యాటరీల ప్రమాదాలను.. ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించే దిశగా టెస్టింగ్ పరికరాలు, అల్గోరిథమ్‌లు రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎం201 పరికరంతో బ్యాటరీ వాస్తవ ప్రమాణాలను .. దాని ప్రస్తుత పనితీరును విశ్లేషించి చూడవచ్చని, వ్యత్యాసాలేమైనా ఉంటే సత్వరం గుర్తించవచ్చని పేర్కొంది. తద్వారా అగ్నిప్రమాదాల ఉదంతాలను నివారించవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు అక్షయ్ తెలిపారు. 100 శాతం సురక్షితమైన బ్యాటరీలను తయారు చేయాలన్నది అందరి ఆకాంక్ష అయినప్పటికీ కోటిలో ఏదో ఒక బ్యాటరీలో తప్పకుండా సమస్యలు తలెత్తవచ్చని ఆయన వివరించారు. "భారత్‌లో ద్విచక్ర వాహనాల్లో బ్యాటరీలను ఉంచే లోహపు బాక్సుల్లో తగినంత భద్రతా ఫీచర్లు ఉండటం లేదన్నారు. బ్యాటరీ నుండి వెలువడే వాయువులు తప్పించుకుపోయే మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అక్షయ్ చెప్పారు." ఈ నేపథ్యంలో ఒత్తిడిని విడుదల చేయగలిగే వాల్వ్‌లు గల మూడు లేదా అంతకు మించి కంపార్ట్మెంట్లలో బ్యాటరీలను ఉంచవచ్చని పేర్కొన్నారు. చదవండి: మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈవీ రంగంపై నీలి నీడలు! -
ఈవీ.. బేఫికర్..
-
ఈవీ ఛార్జింగ్.. ఎంతో ఈజీగా..
-
ఈవీ బైక్ ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
Electric Bike Explodes: తమిళనాడులో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బండి పేలుడు ఘటనలో తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. వెల్లూరు అల్లపురం ఏరియాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో బైక్ ఓనర్ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు. కొత్తగా బైక్ కొన్న దురై.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలో బైక్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకుంది. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి బాత్రూం నుంచి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు ఈ తండ్రీకూతుళ్లు. మంటల్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు.. రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే లోపే.. ఆ పొగలో దురై, ప్రీతీలు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. -
మెరుపు వేగంతో దూసుకెళ్లనున్న ఎలక్ట్రిక్ బైక్.. టాప్ స్పీడ్ ఎంతో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో, చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుక సిద్ద పడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఐఐటీ-ఢిల్లీ ఇంక్యుబేటెడ్ ఈవీ స్టార్టప్ ట్రూవ్ మోటార్ తన ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసే ముందు తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ బైకును టీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్ గంటకు 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లనుంది. అలాగే, సూపర్ బైక్ 3 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లేజర్ లైటింగ్ ప్యాకేజీ, ఎల్ఈడీ అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 360 డిగ్రీల కెమెరా, కనెక్టెడ్ ఫీచర్లతో టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, జీపీఎస్ నావిగేషన్, రియల్ టైమ్ వెహికల్ డయాగ్నోస్టిక్ వంటి ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్ రానుందని ఈవీ స్టార్టప్ పేర్కొంది. ఈ బైక్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో లాంచ్ కానుంది. ఈ సూపర్ బైక్ 40 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే లిక్విడ్-కూల్డ్ ఏసీ ఇండక్షన్ మోటార్ కలిగి ఉంది. ఈ సూపర్ బైక్ ఏఐ ఆధారిత వ్యవస్థతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రేకింగ్ కోసం ఇది బ్రేక్ డ్యూయల్ ఛానల్ ఎబిఎస్'తో బ్రెంబోను ఉపయోగిస్తుంది. ఈ బైక్ సస్పెన్షన్'ను సర్దుబాటు చేసుకోవచ్చు. కొన్ని పేటెంట్ టెక్నాలజీలతో బైక్ వస్తుంది అని ట్రూవ్ పేర్కొంది. రాబోయే సూపర్ బైక్ లాంచ్ తర్వాత సురక్షితమైన ద్విచక్ర వాహనంగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. క్లాసిక్, కేఫ్ రేసర్, నేకెడ్ స్ట్రీట్ బైక్, ఎండురో, స్క్రాంబ్లర్'తో సహా మరో ఐదు మోడళ్లు భవిష్యత్ కాలంలో తీసుకొని రనున్నట్లు ఈవీ స్టార్టప్ తెలిపింది. ట్రూవ్ మోటార్ తన స్వంత మెటావర్స్ ఎకోసిస్టమ్'తో మొట్టమొదటి బ్లాక్ చైన్ ఇంటిగ్రేటెడ్ ఈవీ కంపెనీ అవుతుందని తెలిపింది. వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన రీడింగ్ సిస్టమ్ కూడా వస్తుందని పేర్కొంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ న్యూస్..!) -
ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు, దేశంలో సుజుకీ వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: భారత్‌లో స్థానికంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (బీఈవీ), బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ తెలిపారు. ఇందుకోసం 2025 నాటికి రూ.10,445 కోట్ల మేర (150 బిలియన్ జపాన్ యెన్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో ఎస్ఎంసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా–జపాన్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో దీనిపై సంతకాలు చేసినట్లు ఎస్ఎంసీ వివరించింది. ఈ ఎంవోయూ కింద ప్రస్తుతం ఎస్ఎంసీకి ఉన్న ప్లాంటుకు పక్కన బీఈవీ బ్యాటరీల తయారీ కోసం కొత్తగా ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. దీనికోసం రూ. 7,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. అలాగే బీఈవీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 2025 నాటికి మరో రూ. 3,100 కోట్లు ఎస్ఎంసీ ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం ప్రధాన అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ద్వారా సుజుకీ గ్రూప్‌నకు హర్యానాలో రెండు ప్లాంట్లు, సొంతంగా గుజరాత్లో ఒక ప్లాంటు ఉంది. హర్యానాలో ప్లాంట్లలో ఏటా 15 లక్షల సాంప్రదాయ ఇంధనాల (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) వాహనాలను తయారు చేస్తోంది. ఇక మారుతికి మాత్రమే వాహనాలను సరఫరా చేసే ఎంఎంసీ సొంత ప్లాంటు సామర్థ్యం ఏటా 7.5 లక్షల యూనిట్లుగా ఉంది. మరోవైపు, గ్రూప్‌లోని మరో సంస్థ మారుతి సుజుకీ టొయుత్సు ఇండియా (ఎంఎస్‌టీఐ) సారథ్యంలోని వాహనాల రీసైక్లింగ్ ప్లాంటుపై 2025 నాటికి రూ. 45 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎస్ఎంసీ తెలిపింది. -
అదిరిపోయిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. ధరెంతో తెలుసా?
హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నహక్ మోటార్స్ తన నహక్ పీ-14 హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్'ను ఇక నుంచి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అని ప్రకటించింది. అయితే, ప్రీ బుకింగ్స్ విండో మార్చి 15 నుండి మార్చి 30 వరకు ఓపెన్ చేసి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి MRP 10% డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మే నెల నుంచి బైక్ డెలివరీ చేయలని యోచిస్తోంది. నహక్ పీ-14 ఎలక్ట్రిక్ బైక్ ధర 2.49 లక్షలు(ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ అధికారిక పోర్టల్ రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నహక్ మోటార్స్ తమ పీ-14 ఎఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను తొలిసారిగా ఆటో ఎక్స్పో 2020లో ఆవిష్కరించారు. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది ప్రస్తుత సాంప్రదాయ పెట్రోల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోదన్నమాట. నిజానికి ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఇదొక గొప్ప టాప్ స్పీడ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైకులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీని ఇంట్లోనే హోమ్ ప్లగ్ సాయంతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ఛార్జర్ ద్వారా ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడితే.. ఫాస్ట్ చార్జర్ సహాయంతో 30 నిమిషాల్లో దీనిని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్, భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 72v 60Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బైకులో లభించే ప్రధాన ఫీచర్లను గమిస్తే, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ బాడీ లైన్స్, పూర్తి బాడీ ప్యానెల్స్, డిజిటల్ స్పీడోమీటర్, మిడ్-మౌంటెడ్ బిఎల్డిసి ఎలక్ట్రిక్ మోటార్, ముందు వైపు డ్యూయెల్ డిస్క్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్స్, ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, 150 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే, ఈ బైక్ రేంజ్ ఎంత పేర్కొనకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. (చదవండి: దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు.. !)