
లక్డీకాపూల్ : ఎలక్రి్టక్ బైక్ దగ్ధమైన సంఘటన శనివారం నిమ్స్ మార్చురీ సమీపంలోని స్టాఫ్ పార్కింగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే ఆస్పత్రిలో పని చేస్తున్న అన్‌స్కిల్డ్ వర్కర్ బాలచందర్ తన ఈవీ బైక్‌ను స్టాఫ్ పార్కింగ్‌లో పార్క్ చేసి విధులకు హాజరయ్యాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పార్క్ చేసిన వాహనం నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన నిమ్స్ సెక్యూరిటీ అధికారి రామారావు వాహనాన్ని సిబ్బంది సహయంతో స్టాఫ్ పార్కింగ్ నుంచి బయటకి తీయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది.