కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. | Fire Accident In Konda Gatu Jagitial | Sakshi
Sakshi News home page

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం..

Nov 30 2025 7:10 AM | Updated on Nov 30 2025 10:45 AM

Fire Accident In Konda Gatu Jagitial

జగిత్యాల: జిగిత్యాల జిల్లాలోని కొండగట్టులో భాభీ అగ్ని ‍ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో నిన్న అర్థరాత్రి  దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి.  దాంతో 30 చిన్న దుకాణాలను మంటలు చుట్టుముట్టాయి. ఒకదానికొకటి అంటుకుని 30 షాప్స్ అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం..వాటిల్లింది. దుకాణాలు అంటుకోవడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.  ఈ ఘటనలోబొమ్మల దుకాణాలు  కాలి బూడిదైపోయాయి. దుకాణాలనే నమ్ముకుని బ్రతుకుతున్న వ్యాపారులు లబోదిబో మంటున్నారు. ఫైర్‌ ఇంజిన్స్‌ సాయంతో మంటలను ఆర్పేసిన ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.


ఇటీవల తెలంగాణలో పలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ, మధురానగర్ ప్రాంతాల్లో జరిగిన ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ (బోయిగూడ, ఛత్రినాక పరిధి)లో  ఈ ఏడాది మే 20,  జీ ప్లస్ 2 భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో ఉన్న చెప్పుల గోదాంలో మంటలు వ్యాపించాయి 

అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.పాతబస్తీలోని శాలిబండలో -నవంబర్ 24, 2025న గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement