సాక్షి, హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాములు పడిగాపులు పడ్డారు. విమానం ఆలస్యం కావడం.. ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై నిరసనకు దిగారు.

షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం 9.40గం. విమానం రావాల్సి ఉంది. అయితే విమానం ఎంతకీ రాకపోవడంతో పడిగాపులు పడ్డారు. ఈలోపు ఆలస్యానికి కారణాలను కూడా వివరించలేదు. దీంతో స్వాములు ఆందోళనకు దిగడంతో.. సిబ్బంది సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


