సాక్షి హైదరాబాద్: లిప్ట్, ఎలివేటర్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. లిప్ట్ అంశాలపై చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే దానిని అమలు చేయడానికి మరెన్నేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది.. లిప్ట్ అంశాలపై చట్టం రూపొందించడానికే పదేళ్లు పడితే దానిని అమలు చేయడానికి మరెన్నేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది.
అయితే ఇతర రాష్ట్రాలలో లిప్ట్, ఎలివేటర్ అంశాలపై అవలంభిస్తున్న మార్గదర్శకాలను అనుసరించి నూతనంగా చట్టాలు రూపొందించాలని పిటిషనర్ కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కోర్టు ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.కాగా ఇటీవల అపార్ట్ మెంట్ లలో లిఫ్ట్ లు సరిగ్గా లేక ప్రాణాలు కోల్పోవడం లేదా ప్రమాదానికి గురవడం జరుగుతుంది.
దీనిపై ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకొని హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రమాదాల నివారణకు ఏ చర్యలు తీసుకొంటున్నారో తెలపాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరింది.


