40ఏళ్లు ఒక్కరే సర్పంచ్‌! | 40 years as sarpanch in Mahabubabad district | Sakshi
Sakshi News home page

40ఏళ్లు ఒక్కరే సర్పంచ్‌!

Dec 3 2025 11:37 AM | Updated on Dec 3 2025 12:18 PM

పోటీచేసిన ప్రతీసారి గెలుపే

విరమణ తర్వాతనే మరో సర్పంచ్‌

రికార్డు సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లా 

నర్సింహులపేట సర్పంచ్‌ నాయిని మనోహర్‌రెడ్డి

సాక్షి, మహబూబాబాద్‌ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్‌గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్‌ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్‌ నాయి ని∙మనోహర్‌ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్‌గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్‌ రెడ్డి సర్పంచ్‌గా నియమితులయ్యారు. 

అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్‌గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్‌ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్‌గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్‌ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement