సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ పేరు లోక్‌భవన్‌గా మారింది. ఇకపై రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా పిలవాలని కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను లోక్‌భవన్‌గా మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రవేశద్వారం వద్ద గోడపై ఉన్న రాజ్‌భవన్ అనే అక్షరాలను కూడా అప్పటికప్పుడు లోక్‌భవన్‌గా మార్చారు.


