breaking news
lok bhavan
-
యోగి కార్యాలయం గేటుపడి బాలిక మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం సిద్దం చేస్తున్న కార్యాలయాల సముదాయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల పాపపై ఇనుప గేటు పడి మృత్యువాత పడింది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పటి నుంచి ‘లోక్ భవన్’ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దానికి అమర్చిన ఓ ఇనుప గేటు వద్ద కిరణ్ అనే బాలిక ఆడుకుంటుండగా అనూహ్యంగా ఆ పాపపై గేటు పడింది. దీంతో హుటాహుటిన ఆ పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. లోక్ భవన్లో సహజంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోనే కేబినెట్, ఇతర ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తుంటారు. -
సీఎం ఆఫీసు వద్ద విషాదం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(లోక్ భవన్) వద్ద విషాదం చోటుచేసుకుంది. విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ఇనుపగేటు మీద పడటంతో తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలి తల్లి నిర్మాణ పనుల్లో కూలిగా పనిచేస్తోంది. అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారంలో వీరు నివసిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి లక్నోలో భారీ వర్షం కురుస్తుండటంతో పనులు జరగలేదు. సాయంత్రానికి వర్షం తగ్గడంతో ఆట నిమిత్తం పాప బయటికొచ్చి అనూహ్యంగా ప్రమాదానికిగురైంది. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూసింది. అంతకు ముందురోజే నిలిపిన భారీ ఇనుపగేటు.. వర్షం కారణంగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించాల్సిఉంది. లోక్‌భవన్‌కు భారీ హంగులు యూపీ సీఎం కార్యాలయమైన లోక్‌భవన్‌ను భారీ ఎత్తున విస్తరించే పనులు 2016లో(అఖిలేశ్ హయాంలో) ప్రారంభమయ్యాయి. సుమారు ఆరున్నర ఎకరాల ప్రాంతంలో రూ.602కోట్ల వ్యయంతో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడున్న కార్యాలయం చిన్నదిగా ఉండటంతో మరింత సౌకర్యవంతమైన, విశాలమైన భవంతులను కడుతున్నారు.