ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్‌లో ఇల్లు కొనలేమా? | Affordable Homes Slip Out of Reach in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్‌లో ఇల్లు కొనలేమా?

Mar 7 2026 5:08 PM | Updated on Mar 7 2026 5:50 PM

Affordable Homes Slip Out of Reach in Hyderabad

నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరో

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్‌లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్‌ హౌసింగ్‌ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.

కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు.  

రీ–డెవలప్‌మెంట్‌ అవసరం.. 
ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement