వచ్చేస్తోంది.. మహీంద్రా ఉమెన్స్ ఎడిషన్ | Mahindra XUV 7XO Womens Edition | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది.. మహీంద్రా ఉమెన్స్ ఎడిషన్

Mar 7 2026 3:57 PM | Updated on Mar 7 2026 4:12 PM

Mahindra XUV 7XO Womens Edition

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇప్పుడు ఉమెన్స్ ఎడిషన్ పేరుతో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఉమెన్స్ ఎడిషన్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ప్రస్తుత ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 25.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది AX, AX3, AX5, AX7, AX7T, AX7L అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇంజిన్‌ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్ పొందుతుంది.

ఇదీ చదవండి: టాటా సియెర్రా వాచ్.. కేవలం 500 మాత్రమే!

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో కూడిన 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కనెక్ట్ చేయబడిన కార్ సూట్, 540-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement