మహీంద్రా 'సినీలక్స్' ఎడిషన్: 500 కి.మీ రేంజ్! | Mahindra XEV 9e Cinelux Special Edition Launched At Rs 29.35 Lakh In India, Check Out Specifications Inside | Sakshi
Sakshi News home page

మహీంద్రా 'సినీలక్స్' ఎడిషన్: 500 కి.మీ రేంజ్!

Mar 1 2026 4:10 PM | Updated on Mar 1 2026 5:54 PM

Mahindra XEV 9e Cineluxe Edition Launched at Rs 29 35 Lakh in India

మహీంద్రా అండ్ మహీంద్రా.. తన XEV 9e కారును స్పెషల్ ఎడిషన్ రూపంలో 'సినీలక్స్' పేరుతో లాంచ్ చేసింది. ప్యాక్ త్రీ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైన ఈ మోడల్ ధర రూ. 29.35 లక్షలు (ఎక్స్ షోరూమ్).

మహీంద్రా XEV 9e సినీలక్స్ స్పెషల్ ఎడిషన్ కోసం కంపెనీ మార్చి 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు మార్చి 10న మొదలవుతాయి. శాటిన్ బ్లాక్ & శాటిన్ వైట్ రంగుల్లో లభించే ఈ కారు.. రెండు ఇంటీరియర్ థీమ్స్ పొందుతుంది. ఇది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ట్రిపుల్-స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా & ఆటో పార్క్ అసిస్ట్‌తో ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.

సినీలక్స్ ఎడిషన్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. ఇది 282 బీహెచ్పీ & 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. కాబట్టి పనితీరు కూడా బాగుంటుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement