అదానీ గ్రీన్‌ ఎనర్జీకి నార్జెస్‌ బ్యాంక్‌ గుడ్‌బై! | Norwegian Wealth Fund To Exit Adani Green Energy Amid Financial Allegations, More Details Inside | Sakshi
Sakshi News home page

అదానీ గ్రీన్‌ ఎనర్జీకి నార్జెస్‌ బ్యాంక్‌ గుడ్‌బై!

Mar 1 2026 2:51 PM | Updated on Mar 1 2026 4:16 PM

Norway Sovereign Wealth Fund Pulls Out of Adani

తమ పోర్ట్‌ఫోలియో నుంచి అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌)ను తప్పించనున్నట్లు నార్వేకు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ నార్జెస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో షేర్లను విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇలాంటి ఆరోపణలతోనే 2024 మే నెలలోనూ సంస్థ అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేర్లను వదిలించుకుంది.

నార్జెస్‌ బ్యాంక్‌ 2020 జూలైలో తొలిసారి ఏజీఈఎల్‌ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 341 ధరలో వీటిని సొంతం చేసుకోగా.. ప్రస్తుతం షేరు రూ. 944 వద్ద కదులుతోంది. కాగా.. గతంలోనూ నార్వేజియన్‌ వెల్త్‌ ఫండ్‌ వివిధ కారణాలతో దేశీ బ్లూచిప్స్‌ ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, వేదాంతాలను పోర్ట్‌ఫోలియో నుంచి తప్పించింది.

మార్కెట్ గణాంకాల ప్రకారం 2025 ప్రారంభంనుంచి నార్జెస్‌ బ్యాంక్‌ 4.39 కోట్ల డాలర్ల విలువైన ఏజీఈఎల్‌ షేర్లను విక్రయించగా.. దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement