బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.
చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.
ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది.


