జియో ఫైనాన్షియల్‌ యాప్‌లో వినూత్న ఫీచర్లు | Jio Financial App Introduces New Marketplace Features, Integrates AI And Machine Learning For Financial Solutions | Sakshi
Sakshi News home page

జియో ఫైనాన్షియల్‌ యాప్‌లో వినూత్న ఫీచర్లు

Mar 1 2026 12:42 PM | Updated on Mar 1 2026 1:59 PM

Jio Financial App Introduces new Marketplace Features

ముంబై: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (జేఎఫ్‌ఎస్‌) ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా విక్రయించే విధంగా తమ యాప్‌ను మార్కెట్‌ప్లేస్‌ తరహాలో విస్తరిస్తోంది. కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి టెక్నాలజీలను పొందుపర్చడంతో వివిధ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో తగు సలహాలు, ఫైనాన్షియల్‌ స్కోర్‌ మొదలైనవి కూడా ఇవ్వనుంది.

ఆర్థిక సేవల పంపిణీని సరికొత్తగా నిర్వచించేలా ఇలాంటి వినూత్న ఫీచర్లను యాప్‌లో జోడిస్తున్నట్లు జేఎఫ్‌ఎస్‌ ఎండీ హితేష్‌ సేథియా తెలిపారు. యూజర్లు తమ సందేహాలు, అవసరాలను టైప్‌ చేస్తే వారికి అనువైన ఆర్థిక సాధనాలు, క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటికి గురించి యాప్‌ సిఫార్సు చేస్తుంది.

దాదాపు ఏడాదిగా నిర్వహిస్తున్న యాప్‌కి ప్రస్తుతం 2 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు వివరిచారు. 50 క్రెడిట్‌ కార్డులు, 90 బీమా పథకాలను అందించేందుకు ఆయా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement