సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్‌ నియంత్రణకే ప్రాధాన్యం | Vreels positioning itself creativity privacy entertainment features | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్‌ నియంత్రణకే ప్రాధాన్యం

Dec 20 2025 12:25 PM | Updated on Dec 20 2025 1:07 PM

Vreels positioning itself creativity privacy entertainment features

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్‌(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్‌ఫామ్‌గా రూపొందుతోంది. భారత్‌లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్‌(Vreels) ప్రత్యేకత.

క్రియేటర్లతో నేరుగా చర్చలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్‌లోని క్రియేటర్‌లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు చెప్పింది.

కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడం

కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్‌ఫామ్స్‌లో సాధ్యం కాని విషయమని వీరీల్స్‌ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్‌లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్‌డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్‌ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు.

సులభమైన ఆదాయ అవకాశాలు

Vreels ప్లాట్‌ఫామ్‌లో 10,000 ఫాలోవర్స్‌ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్‌ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.

Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభం

Vreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.

  • వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్‌ వేయవచ్చు.

  • వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్‌ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్‌ చెప్పింది.

  • నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.

దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

మెమొరీ క్యాప్సుల్‌.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవం

Vreels లోని మెమొరీ క్యాప్సుల్‌ ఫీచర్ ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్‌ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్‌ప్రైజ్‌ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.

ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.

Reels, చాట్, కాల్స్, PixPouch..

వీరీల్స్‌ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యత

Vreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్‌పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.

డేటా లీక్‌ భయం అనవసరం

ఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్‌లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.

స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకు

Vreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్‌ యాప్‌ను రిలీజ్ చేసింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.

Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయం

క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.

ఇప్పుడే ప్రయత్నించండి

Vreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.

వెబ్‌సైట్: www.vreels.com

కింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌ల్లో ఈరోజే Vreels డౌన్‌లోడ్ చేసుకోండి.

Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreels

Apple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098

లేదా

డౌన్‌లోడ్‌ కోసం కింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement