ఏథర్ ఎనర్జీ తన కొత్త ఇన్ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్‌ను 450X ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మొదట 2025 ఆగస్టులో ఏథర్ 450 అపెక్స్‌లో మొదలైంది. ఇప్పుడు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల ద్వారా 450X మోడళ్లకు అమలు చేశారు.
ఇన్ఫినిట్ క్రూయిజ్‌ను క్రూయిజ్ కంట్రోల్ అప్డేటెడ్ వెర్షన్‌గా అందించనున్నారు. కంపెనీ చెబుతోంది. ఇది హైవే వినియోగం కంటే పట్టణ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది భారతీయ నగర వాతావరణాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇండియాలో స్కూటర్లు.. నగరాల్లో 30 కిమీ కంటే తక్కువ వేగంతో వెళ్తాయి. ఇలాంటి వాటికి ఈ లేటెస్ట్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
రైడర్ బ్రేక్ లేదా యాక్సలరేషన్ వాడినా.. ఈ ఫీచర్ కారణంగా జారి రానట్లుగా పనిచేస్తుంది. అంటే ఈ ఫీచర్ వేగానికి ఆటోమేటిగ్గా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ట్రాఫిక్‌లో వేగం మారినప్పుడల్లా స్కూటర్ వేగాన్ని సరిపోయేలా ఆపి/పొడిగిస్తుంది. కొండపై లేదా దారి పైకి/కిందికి వెళ్లేటప్పుడు వేగాన్ని స్థిరంగా ఉంచుతుంది. చాలా నెమ్మదిగా, అసమానమైన రోడ్లపై కూడా స్మూత్‌గా ముందుకు వెళ్తుంది. మొత్తం మీద ఇది ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉంటుంది.
2025 జనవరి 1 తర్వాత స్కూటర్లను కొనుగోలు చేసిన దాదాపు 44,000 మంది ఏథర్ 450X యజమానులకు ఇన్ఫినిట్ క్రూయిజ్ అప్‌డేట్ అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది అన్ని స్కూటర్లలో అందుబాటులో ఉంటుంది.


