ఎయిర్‌బీఎన్‌బీ యాప్‌లో సరికొత్త ఫీచర్లు | Airbnb overhauls app to introduce new features | Sakshi
Sakshi News home page

ఎయిర్‌బీఎన్‌బీ యాప్‌లో సరికొత్త ఫీచర్లు

May 14 2025 9:30 PM | Updated on May 14 2025 9:32 PM

Airbnb overhauls app to introduce new features

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు బస సౌకర్యాలు కల్పించే ఎయిర్‌బీఎన్‌బీ తమ యాప్‌లో సరికొత్తగా మార్పులు చేసింది. కేవలం వసతి సౌకర్యాలు మాత్రమే కాకుండా మరిన్ని కొత్త సర్వీస్‌లను జోడించింది.

సర్వీసెస్‌ కింద ఎయిర్‌బీఎన్‌బీ యూజర్లు ఇప్పుడు మసాజులు, హెయిర్‌కట్స్, వ్యక్తిగత శిక్షణ సెషన్లు, చెఫ్ తయారుచేసిన భోజనం వంటి సేవలను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లోని 100 నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నారు.

ఇక ఇక్స్‌పీరియన్సెస్‌ పేరుతో సాంస్కృతిక, మ్యూజియం టూర్స్‌, అవుట్ డోర్, వాటర్ స్పోర్ట్, వైల్డ్‌ లైఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి అనుభవాలను పర్యాటకులు ఆనందివచ్చు. అలాగే ఫుడ్‌ టూర్స్‌, వంట తరగతులు, ఆర్ట్ వర్క్ షాప్ లు, షాపింగ్, వ్యాయామం, ఆరోగ్యం, బ్యాటీ ఇక్స్‌పీరియన్సెస్‌ పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 1,000 నగరాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఈ అనుభవాలను ప్రారంభిస్తున్నారు.

ఎయిర్ బీఎన్‌బీలో తమ బసలో భాగంగా వినియోగదారులు సేవలు, అనుభవాలను బుక్ చేసుకోవచ్చని, వాటిని స్వతంత్రంగా కూడా బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్‌బీ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లతో పాటు వెబ్ వెర్షన్ కు ఈ అప్ డేట్స్ ను అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement