ఐపీవోకి హైదరాబాద్‌ ‘రత్నదీప్‌’.. సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | Ratnadeep Retail IPO SEBI Approval 400 Crore Fresh Issue | Sakshi
Sakshi News home page

ఐపీవోకి హైదరాబాద్‌ ‘రత్నదీప్‌’.. సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Oct 31 2026 5:56 PM | Updated on Oct 31 2026 6:02 PM

Ratnadeep Retail IPO SEBI Approval 400 Crore Fresh Issue

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రత్నదీప్‌ రిటైల్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 1.49 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.

ఐపీవో నిధుల్లో రూ. 40 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ. 260 కోట్లను కొత్త స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. ఆహారోత్పత్తులు, నిత్యావసరాలు, వేల్యూ ఫ్యాషన్‌ విభాగాల్లో రత్నదీప్, నేషనల్‌ మార్ట్‌ బ్రాండ్ల పేరిట ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంపెనీకి 190 స్టోర్స్‌ ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement