స్టాక్ మార్కెట్‌లో జియో సునామీ.. లిస్టింగ్‌పై భారీ అంచనాలు! | Jio Platforms Know The Key Highlights for Listing | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్‌లో జియో సునామీ.. లిస్టింగ్‌పై భారీ అంచనాలు!

Oct 27 2026 4:55 PM | Updated on Oct 27 2026 5:14 PM

Jio Platforms Know The Key Highlights for Listing

భారత స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రూ.10.3 లక్షల కోట్ల భారీ విలువతో మార్కెట్‌లోకి వస్తున్న ఈ కంపెనీ లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్కో షేరును రూ.1,119 ధరతో జారీ చేస్తూ.. మొత్తం 27 కోట్ల కొత్త షేర్లను ఆఫర్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ సుమారు రూ.16.2 లక్షల కోట్లు కాగా, భారతీ ఎయిర్‌టెల్ విలువ రూ.12.2 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.10.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాత జాబితాలో జియో ప్లాట్‌ఫామ్స్ నిలుస్తోంది.

అక్టోబర్ 28న జియో షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓకు వచ్చిన స్పందన, మార్కెట్‌లో కనిపిస్తున్న ప్రీమియం కారణంగా లిస్టింగ్ రోజున షేర్లు ఇష్యూ ధర కంటే ఎక్కువ ధరకు ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. అసలు లిస్టింగ్ ధర ఎలా ఉంటుందనేది మాత్రం మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ జియో షేర్లు ఇష్యూ ధర కంటే 20 శాతం ప్రీమియంతో లిస్ట్ అయితే.. ఒక్కో షేరు ధర సుమారు రూ.1,343కు చేరే అవకాశం ఉంది. అప్పుడు కంపెనీ మార్కెట్ విలువ రూ.12.3 లక్షల కోట్లను దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలువనుంది.

జియో లిస్టింగ్‌తో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఐపీఓ విలువ ఆధారంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువలను కలిపితే రూ.27 లక్షల కోట్లకు పైగా చేరవచ్చని అంచనా.

అక్టోబర్ 27 నాటి వివరాల ప్రకారం.. టాటా గ్రూప్‌లోని 32 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.25.7 లక్షల కోట్లు కాగా, అదానీ గ్రూప్‌లోని 11 లిస్టెడ్ కంపెనీల విలువ దాదాపు రూ.16.6 లక్షల కోట్లుగా ఉంది. జియో షేర్లు అంచనాలకు అనుగుణంగా లిస్ట్ అయితే.. రిలయన్స్ గ్రూప్ విలువ రూ.30 లక్షల కోట్లకు చేరువయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: పెట్రోల్‌కు చెక్ పెట్టే E100.. వాహనదారులకు కీలక అప్‌డేట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement