రూ.30 లక్షల కోట్ల బిజినెస్‌.. కెనరా బ్యాంక్ ప్రస్థానం | Canara Bank 30 Lakh Crore Business Milestone Digital Banking growth | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల కోట్ల బిజినెస్‌.. కెనరా బ్యాంక్ ప్రస్థానం

Nov 19 2026 6:32 PM | Updated on Nov 19 2026 6:34 PM

Canara Bank 30 Lakh Crore Business Milestone Digital Banking growth

విజయవాడ: డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలను అందించడంలో కెనరా బ్యాంక్ ముందంజలో ఉందని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ ఆర్. దేవరాజ్ పేర్కొన్నారు. కెనరా బ్యాంక్ వ్యవస్థాపకులు అంబెమ్మల్ సుబ్బారావు 174వ జయంతి, బ్యాంక్ 121వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంక్ సాధించిన ప్రగతిని ఆయన గుర్తుచేశారు. 1906లో ప్రారంభమైన కెనరా బ్యాంక్ నేడు రూ.30 లక్షల కోట్లకు పైగా వ్యాపారంతో దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటిగా ఎదగడం విశేషమన్నారు.

వ్యవస్థాపకుల దూరదృష్టి, వినియోగదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావంతో బ్యాంక్ నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఆధునిక సేవలను మరింత విస్తరిస్తూ, వినియోగదారులు సులభంగా, సురక్షితంగా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునేలా సాంకేతిక సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ బ్యాంకింగ్ విలువలను కొనసాగిస్తూనే, డిజిటల్ సాంకేతికతతో నూతన ప్రస్థానాన్ని నిర్మించడమే బ్యాంక్ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement