దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్ షేర్లు ఊపందుకోవడంతో బెంచ్ మార్క్ సూచీలు ఎగిశాయి. సెన్సెక్స్ 989.94 పాయింట్లు లేదా 1.21 శాతం పెరిగి 83,021.75 వద్ద, నిఫ్టీ50 286.35 పాయింట్లు లేదా 1.14 శాతం పెరిగి 25,514.30 వద్ద స్థిరపడ్డాయి.
మారూతి సుజుకి ఇండియా, ఐచర్ మోటార్స్, మహీంద్రా & మహీంద్రా నిఫ్టీ50లో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. సెక్టార్‌వారీగా నిఫ్టీ ఆటో 4 శాతం కంటే ఎక్కువ లాభంతో అద్భుతంగా రాణించగా, నిఫ్టీ బ్యాంక్ సెషన్ సమయంలో 63,053.25 వద్ద తాజా గరిష్ఠాన్ని చేరుకుంది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చాయి. నిఫ్టీ ఐటీ మాత్రం బలహీన ప్రదర్శనను కనబరిచింది.


