అవకాశం లభిస్తే చిప్ తయారీ దిగ్గజం ఎన్‌విడియా సీఈవోగా మళ్లీ చేరాలనుకుంటున్న జెన్సన్ హువాంగ్ ఆశలపై కంపెనీ బోర్డు నీళ్లు చల్లింది. ఆయన్ను మళ్లీ తీసుకునే యోచనే లేదని స్పష్టం చేసింది. ‘జెన్సన్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. బోర్డు కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
జెన్సన్‌ను మళ్లీ సీఈవోగా పునరుద్ధరించే ఉద్దేశమేమీ బోర్డుకు లేదు‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ చెయిర్ హార్వీ జోన్స్ తెలిపారు. కంపెనీ నైతిక నియమావళి, సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించారని బహిర్గతం కావడంతో జెన్సన్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ ఉద్యోగినులతో వివాహేతర సంబంధాలు, చైనా గూఢచారిగా భావిస్తున్న మహిళతో వ్యవహారాలు సాగించారన్న ఆరోపణలపై జెన్సన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్‌విడియా సిబ్బందితో పాటు పలువురు టెక్ దిగ్గజాల కోరిక మేరకు, కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే మళ్లీ సీఈవోగా చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెన్సన్ ప్రకటించారు. దీనిపైనే బోర్డు స్పందించింది. మరోవైపు, పర్మనెంట్ సీఈవోను నియమించుకునే దిశగా అభ్యర్థులను అన్వేíÙంచేందుకు హెడ్రిక్ అండ్ స్ట్రగుల్స్ అనే స్టాఫింగ్ సంస్థ సేవలను తీసుకుంటున్నట్లు జోన్స్ వివరించారు.
ఇదీ చదవండి: బైక్ నుంచి కిందపడినా.. ప్రాణాలు సేఫ్!


