breaking news
Jensen Huang
-
ఎన్విడియా సీఈఓ జాకెట్ రూ.9 కోట్లు.. వేలంలో భారీ ధర
ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సెన్ హువాంగ్ ధరించిన సిగ్నేచర్ నల్లటి టామ్ ఫోర్డ్ (Tom Ford) లెదర్ జాకెట్ వేలంలో సంచలన ధర పలికింది. న్యూయార్క్‌లో ప్రముఖ వేలంపాట సంస్థ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఈ జాకెట్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ.9.2 కోట్లు)కు అమ్ముడైంది. ఇది ముందుగా అంచనా వేసిన 40,000–60,000 డాలర్ల విలువ కంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ.సోథెబీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాకెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 మంది పోటీపడ్డారు. సంస్థ ఆధునిక కలెక్టిబుల్స్ విభాగం అధిపతి బ్రహ్మ్ వాచ్టర్ దీన్ని "ఏఐ యుగాన్ని నిర్వచించిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరితో అత్యంత సన్నిహితంగా ముడిపడిన అరుదైన స్మారక వస్తువు"గా అభివర్ణించారు.జెన్సెన్ హువాంగ్ నల్లటి లెదర్ జాకెట్ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా మారింది. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కి నల్లటి టర్టిల్నెక్ స్వెటర్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కి బూడిదరంగు టీ-షర్టు ఎలాగో హువాంగ్‌కు ఈ బ్లాక్ జాకెట్ అలాగే. ఆయన దాదాపు ప్రతి కీలక ఉత్పత్తి ఆవిష్కరణ, డెవలపర్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ వేదికలపై ఇదే తరహా జాకెట్లో కనిపిస్తుంటారు. 2021లో టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపైనా ఇదే నలుపు జాకెట్‌తో మెరిశారు. వేలానికి వచ్చిన జాకెట్‌ను ఆయన 2023 అక్టోబర్‌లో తైవాన్‌లో జరిగిన హాన్ హై (ఫాక్స్‌కాన్) టెక్ డే కార్యక్రమంలో ధరించినదేనని ఫోటో మ్యాచింగ్ ద్వారా ధ్రువీకరించారు. జాకెట్‌పై హువాంగ్ సంతకాన్ని కూడా నిపుణులు ప్రామాణికంగా నిర్ధారించారు.ఎన్విడియా నాయకత్వంలో జెన్సెన్ హువాంగ్ కంపెనీని కృత్రిమ మేధ (AI) విప్లవానికి కేంద్రబిందువుగా నిలబెట్టారు. ఏఐ చిప్‌లకు పెరిగిన భారీ డిమాండ్‌తో ఎన్విడియా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన పబ్లిక్ కంపెనీగా ఎదిగింది.ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఎడ్జ్ ఇన్స్టిట్యూట్ అనే లాభాపేక్షలేని సంస్థకు అందజేస్తున్నారు. సాంకేతికత, విజ్ఞానం, విద్య రంగాల్లో యువ ఆవిష్కర్తలకు ఫెలోషిప్‌లు, గ్రాంట్లు, పరిశోధన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. -
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
ఈరోజు పట్టాలు అందుకుంటున్న 2026 బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, త్యాగానికి ఇది ప్రతిఫలం. కానీ ఈ విజయం మీదే కాదు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిది! మీకు ఇది జీవితంలో మరో ముందడుగు మాత్రమే కావచ్చు. కానీ ఒక తల్లికి మాత్రం తన బిడ్డ పట్టా అందుకోవడం జీవితకాల కల నెరవేరిన క్షణం. నా తల్లిదండ్రులు కూడా ఈరోజు నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నారు. నా విజయం వారి కలల ఫలితం. నిజానికి నేను వారి అమెరికా కలకు రూపం. ఈ సభలో ఉన్న చాలామంది విద్యార్థుల్లాగే నేను కూడా మొదటి తరం వలసదారుడిని. నా తల్లిదండ్రులు (తైవాన్ నుంచి) అమెరికాకు రావడానికి కారణం ఒక్కటే. ‘మా పిల్లలకు మంచి అవకాశం దొరకాలి’ అనే ఆశ. నాకు ముప్పై సంవత్సరాల వయసులో, నా స్నేహితులతో కలిసి ఎన్విడియాను ప్రారంభించాను. మా లక్ష్యం ఒక కొత్త తరహా కంప్యూటర్ను రూపొందించడం. సాధారణ కంప్యూటర్లు సాధించలేని సమస్యలను పరిష్కరించే శక్తిమంతమైన వ్యవస్థను నిర్మించాలని అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే అసలు నిజం తెలిసింది. మేము రూపొందించిన తొలి సాంకేతికత పూర్తిగా విఫలమైంది. డబ్బు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. గత 33 ఏళ్లుగా ఎన్ విడియా ఎన్నోసార్లు తనను తాను మార్చుకుంది. ప్రతిసారి ఒకే ప్రశ్న వేసుకుంది: ‘ఇందులో ఎంత కష్టముంటుంది?’ ప్రతిసారి సమాధానం ఒక్కటే: ‘మనం అనుకున్నదానికంటే చాలా కష్టం.’ కానీ ప్రతి వైఫల్యం మాకు కొత్త పాఠం నేర్పింది. ప్రతి అపజయం మమ్మల్ని మరింత వినయంగా మార్చింది. ప్రతి కష్టం మా వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. వైఫల్యం విజయానికి తీసుకెళ్లే మరో మెట్టు మాత్రమే. ప్రతిసారి పడిపోయి మళ్లీ లేవడంవల్లే జీవితంలో నిజమైన ధైర్యం వస్తుంది. అదే మన విజయానికి అసలైన బలం. ప్రపంచాన్ని మార్చే కొత్త యుగంమీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మీ కెరీర్ ప్రారంభమవుతున్న సమయం... ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచం పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విప్లవం ప్రారంభ దశలో ఉంది. మీరు మాత్రం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రారంభమవు తున్న సమయంలో కెరీర్ మొదలుపెడుతున్నారు. దీనికంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కంప్యూటింగ్ రంగంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పును నేను చూశాను. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్... ప్రతి దశ ప్రపంచాన్ని మార్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ మానవ జీవితాన్ని మరింత సులభం చేసింది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మార్పు వీటన్నింటికంటే పెద్దది. ఇది కేవలం మరో సాంకేతిక పరిణామం కాదు. ఇది కంప్యూటింగ్ ప్రపంచానికే కొత్త ఆరంభం. గత ఆరు దశాబ్దాలుగా కంప్యూటర్లు ఒకే విధంగా పని చేశాయి. మనుషులు కోడ్ రాస్తారు. కంప్యూటర్లు ఆ ఆదేశాలను అమలు చేస్తాయి. ఇంతకాలం ఇదే సూత్రం. కానీ ఇప్పుడు... ఆ యుగం ముగిసింది. ఏఐ కంప్యూటింగ్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. ఇకపై కంప్యూటర్లు కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కావు. అవి అర్థం చేసుకుంటాయి. తర్కిస్తాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. అవసరమైన సాధనాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్‌వేర్‌ను రాసి సీపీయూలపై నడిపించే వాళ్లం. ఇప్పుడు ఏఐ వ్యవస్థలు భారీ న్యూరల్ నెట్‌వర్క్‌ల ద్వారా జీపీయూలపై పనిచేస్తున్నాయి. ఇది కేవలం వేగం పెర గడం కాదు, కంప్యూటర్లు ఆలోచించే విధానమే మారుతోంది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారం నుంచి శాస్త్ర పరిశోధనల వరకు... ప్రతి రంగా నికి ఏఐ అవసరం. ఏఐ ప్రతి పరిశ్రమనూ మార్చబోతోంది. ఏఐపై భయం సహజమే!ఏఐ చిత్రాలు గీస్తోంది. వ్యాసాలు రాస్తోంది. సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. కార్లను నడుపుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి: ఉద్యోగాలు పోతాయా? మనిషి అవసరం తగ్గిపోతుందా? అసలు ఈ టెక్నాలజీ మన నియంత్రణలో ఉంటుందా? ఇలాంటి సందేహాలు కొత్తవి కావు. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే పుట్టాయి. విద్యుత్ వచ్చినప్పుడు కూడా భయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి నప్పుడు కూడా సందేహించారు. కానీ మానవ సమాజం కొత్త సాంకేతి కతను బాధ్యతతో స్వీకరించిన ప్రతిసారీ... అది మన సామ ర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఏఐని తెలివిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనదే. ఇకపై ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్లే. ఇప్పటి వరకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలిగినవారు ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కోడ్ ఎలా రాయాలో తెలియకపోయినా, మనకు కావాల్సిన పనిని సహజమైన భాషలో ఏఐకి చెప్పగలిగితే చాలు. మిగతా పనిని ఏఐ పూర్తి చేస్తుంది. ఒక చిన్న దుకాణం నడిపే వ్యాపారి... ఏఐ సహాయంతో తన వ్యాపారం కోసం అందమైన వెబ్‌సైట్‌ను రూపొందించుకోవచ్చు. ఒక వడ్రంగి... కస్టమర్‌కు వంటగది నమూనాలను రూపొందించి చూపించవచ్చు. ఒక ఉపాధ్యా యుడు కొత్త పాఠ్యాంశాలను సిద్ధం చేయవచ్చు. ఒక వైద్యుడు... వైద్య సమాచారాన్ని వేగంగా విశ్లేషించవచ్చు. ఒక రైతు... పంట లపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏఐ వల్ల కంప్యూటింగ్ శక్తి కొద్దిమందికే పరిమితం కాకుండా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తోంది. ఇదే ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద ప్రజాస్వామిక మార్పు. ఏఐ ఉద్యోగాలను మారుస్తుంది!విద్యుత్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో... ఇంటర్నెట్ ఎలా మన జీవన విధానాన్ని మార్చిందో... అలాగే ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చబోతోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమంగా నిలవబోతోంది. ఏఐ కోసం కొత్త చిప్ తయారీ కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్ కర్మాగా రాలు ఏర్పాటవుతాయి. భారీ డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఆధు నిక తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయి. ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు, ఇనుప కార్మికులు, టెక్నీషియన్లు, నిర్మాణ రంగ కార్మికులు... ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏఐ కేవలం ఒక కొత్త కంప్యూటింగ్ యుగాన్ని మాత్రమే కాదు... ఒక కొత్త పారిశ్రామిక యుగాన్ని కూడా ప్రారంభిస్తోంది. శక్తిమంతమైన ఏఐకి శక్తిమంతమైన విద్యుత్ అవసరం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. విద్యుత్ గ్రిడ్లను ఆధునికీకరిస్తారు. పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టు బడులు పెరుగుతాయి. ఏఐ అభివృద్ధి కేవలం కంప్యూటర్లనే కాదు, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధినే వేగవంతం చేస్తుంది. ఏఐ ఉద్యోగాలను మార్చుతుంది... కానీ మనిషి లక్ష్యాన్ని కాదు.చాలామంది అడుగుతున్న ప్రశ్న: ‘ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?’ నా సమాధానం: ప్రతి ఉద్యోగాన్నీ ఏఐ ప్రభా వితం చేస్తుంది. ఉద్యోగంలోని కొన్ని పనులు యంత్రాలు చేయవచ్చు. కొన్ని పాత ఉద్యోగాలు తగ్గవచ్చు. అదే సమయంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కొత్త పరిశ్ర మలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఈరోజు ఏఐ చాలావరకు సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతోంది. అంటే... సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అవసరం లేదని కాదు. వారు ఇప్పుడు ఏఐ సహా యంతో మరింత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన గలుగుతున్నారు. ఏఐ వైద్య చిత్రాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ రోగిని అర్థం చేసుకుని సరైన చికిత్స అందించే వైద్యుడి స్థానాన్ని అది భర్తీ చేయదు. ఏఐ మనిషిని తొలగించడానికి రాలేదు. మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చింది. మిమ్మల్ని ఏఐ భర్తీ చేయకపోవచ్చు, కానీ ఏఐ బాగా ఉపయోగించే వ్యక్తి ఆ పని చేయవచ్చు. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయక పోవచ్చు. కానీ ఏఐని సమర్థంగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి మీకంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐ మానవ జ్ఞానాన్ని మరింత వేగంగా విస్తరించబోతోంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో సమస్య లకు పరిష్కారాలు కనుగొనబోతోంది. ప్రపంచంలోని కోట్లాది మందికి కంప్యూటింగ్ శక్తిని అందించబోతోంది. మనం నిర్మించే భవిష్యత్తు... ఈరోజు మనకు లభించిన ప్రపంచం కంటే మరింత సంపన్నంగా, మరింత సామర్థ్యవంతంగా, మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంత శక్తిమంతమైన సాధనాలు, ఇంత గొప్ప అవకా శాలతో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరం ఇంతకుముందు లేదు. మనమంతా ఒకే ప్రారంభ రేఖ వద్ద నిలబడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. కాబట్టి నెమ్మదిగా నడవకండి... ధైర్యంగా ముందుకు పరుగెత్తండి! -
కోడింగ్ ఒక్కటే సరిపోదు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు, యువ నిపుణులు ఏయే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవేళ తాను ఇప్పుడు విద్యార్థిని అయితే కోడింగ్‌తో పాటు భౌతిక శాస్త్రానికి (ఫిజిక్స్) అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.కోడింగ్ మాత్రమే సరిపోదుసాంకేతిక రంగంలో దశాబ్దాలుగా కోడింగ్‌ను అత్యంత కీలకమైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏఐ వ్యవస్థలు కేవలం డిజిటల్ డేటాను ప్రాసెస్ చేసే స్థాయి నుంచి భౌతిక ప్రపంచంతో నేరుగా కార్యకలాపాలు సాగించే స్థాయికి చేరుకుంటున్నాయని హువాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను బహుశా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడిని’ అని పేర్కొన్న హువాంగ్, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం కోడింగ్ చేయడం కంటే ముఖ్యమని ఉద్ఘాటించారు. తదుపరి తరం ఆవిష్కరణలు కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యాల మీద కాకుండా భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న లోతైన అవగాహన మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ‘ఫిజికల్ ఏఐ’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ వ్యవస్థలు ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రియల్ వరల్డ్ అప్లికేషన్లలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హువాంగ్ చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో డెవలపర్లు, ఇంజినీర్లకు ఫిజిక్స్ విషయాలపై అవగాహన తప్పనిసరి. కోడింగ్ అనేది ఒక పనిని చేయించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, కానీ యంత్రాలు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే అవి పనిచేసే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఉద్యోగాలను మింగేస్తుందా? సృష్టిస్తుందా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ(ఏఐ)పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన... ‘ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా?’. ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘ఏఐ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగాల భయంపై హువాంగ్ స్పందనమిల్కెన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హువాంగ్ ఏఐ వల్ల భారీగా ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఈ తరహా భయాందోళనలు కేవలం అపోహలని, ఇవి ప్రజలను సాంకేతికతకు దూరంగా ఉంచుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘ఏఐ కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవానికి నాంది. డేటా సెంటర్లు, అధునాతన హార్డ్‌వేర్, సహాయక ఎకోసిస్టమ్‌ల నిర్మాణం కోసం వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. ఆటోమేషన్ అనేది మొత్తం ఉద్యోగాలను తుడిచిపెట్టదు. కేవలం పనితీరులోని నిర్దిష్టమైన, పునరావృతమయ్యే పనులను మాత్రమే మారుస్తుంది. అంటే, మనిషి చేసే మొత్తం పనిలో కొంత భాగాన్ని ఏఐ సాయంతో సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, మనిషి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు’ అని చెప్పారు.ఆందోళనలు ఎందుకు? వాస్తవాలేంటి?హువాంగ్ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వేత్తలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. వివిధ కన్సల్టింగ్ సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 శాతం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు లేదా కొన్ని పాత తరహా పాత్రలు కనుమరుగయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన ఏఐ స్వీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని, సరైన శిక్షణ లేని వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనేది నిపుణుల ప్రధాన ఆందోళన.భయం వద్దు.. నైపుణ్యం ముద్దు!ప్రతి సాంకేతిక మార్పు వెనుక కొంత అనిశ్చితి ఉండటం సహజం. అయితే, టెక్ పరిశ్రమ సృష్టిస్తున్న హైప్‌కు భయపడి పురోగతిని ఆపడం సరికాదని హువాంగ్ సూచిస్తున్నారు. ఏఐని ఒక ముప్పుగా చూడటం కంటే.. మన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలి అనేది ఆయన మాటల సారాంశం. మొత్తానికి ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ స్వరూపం మారుతుందనేది వాస్తవం. అయితే, కాలంతో పాటు కొత్త నైపుణ్యాలను సంతరించుకునే వారికి ఏఐ ఒక వరం కానుంది. సాంకేతికత పట్ల భయాన్ని వీడి దానిని వాడుకోవడంలోనే భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
AI పోటీలో చైనా.. హువాంగ్ హెచ్చరిక!
చైనాకు ఏఐ చిప్‌లను అమ్మడం అంటే.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను అమ్మడం లాంటిదని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడె వ్యాఖ్యానించారు. దీనిని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. ఈ పోటీలో అమెరికా, చైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూఎస్ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, చైనాకు AI చిప్‌లను విక్రయించడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.The Jensen Huang episode.0:00:00 – Is Nvidia’s biggest moat its grip on scarce supply chains?0:16:25 – Will TPUs break Nvidia’s hold on AI compute?0:41:06 – Why doesn’t Nvidia become a hyperscaler?0:57:36 – Should we be selling AI chips to China?1:35:06 – Why doesn’t Nvidia… pic.twitter.com/ezDkUmoFWM— Dwarkesh Patel (@dwarkesh_sp) April 15, 2026హువాంగ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చైనాకు ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటింగ్ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. అంటే, చైనా ఇప్పటికే AI రంగంలో ముందంజలో ఉంది. కాబట్టి, చిప్‌లను అమ్మకుండా నిరోధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చైనా చిప్‌లను ఉపయోగించి అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు, ఇప్పటికే చైనాలో అలాంటి సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశాడు. అంటే, ఈ టెక్నాలజీని పూర్తిగా ఆపడం అసాధ్యమని ఆయన అభిప్రాయం. -
మౌలిక సదుపాయాలకు ఏఐ దన్ను
చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ (ఏఐ) తోడ్పడుతోందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్ హువాంగ్ చెప్పారు. ఇందుకోసం లక్షల కోట్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఈ పరిణామాలతో నిపుణులైన కార్మికులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఏఐని గతంలోలాగా ఏదో సాధారణ అప్లికేషన్‌లాగా పరిగణించడానికి లేదని, విద్యుత్తు.. ఇంటర్నెట్‌లాగా కీలకమైన మౌలిక సదుపాయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని హువాంగ్ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పారు. ‘మనం ఇప్పుడిప్పుడే నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఏదో, కొన్ని వందల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాం. కానీ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలంటే ఇది సరిపోదు. లక్షల కోట్ల డాలర్లు కావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో చిప్ ఫ్టాక్టరీలు, కంప్యూటర్ అసెంబ్లీ ప్లాంట్లు, ఏఐ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయి. ఇదంతా కూడా మానవ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనగా మారబోతోంది‘ అని పేర్కొన్నారు. అయిదంచెల కేక్.. విద్యుత్, చిప్‌లు, మౌలిక సదుపాయాలు, మోడల్స్, అప్లికేషన్ల మేళవింపుతో కృత్రిమ మేథ అయిదంచెల ’కేక్’గా ఉంటుందని హువాంగ్ అభివరి్ణంచారు. పరిశ్రమల్లో భారీ స్థాయి మార్పుల వల్ల సంప్రదాయ టెక్ రంగం పరిధికి వెలుపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఈ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు భారీ స్థాయిలో కారి్మకులు కావాలి. ఏఐ ఫ్యాక్టరీలకు ఎల్రక్టీíÙయన్లు, ప్లంబర్లు, పైప్ఫిట్టర్లు, స్టీల్వర్కర్లు, నెట్వర్క్ టెక్నీíÙయన్లు, ఇన్స్టాలర్లు, ఆపరేటర్లు కావాలి. మంచి జీతభత్యాలు ఉండి, నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలివి. అలాంటి నిపుణులకు కొరత నెలకొంది. ఈ పరివర్తనలో పాలుపంచుకునేందుకు కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీల్లాంటివేమీ అవసరం లేదు’ అని హువాంగ్ చెప్పారు.సంప్రదాయ కంప్యూటింగ్ మోడల్‌ను కృత్రిమ మేథ ఏ విధంగా మార్చివేస్తోందనేది ఆయన వివరించారు. ఏఐ మోడల్స్ గతేడాది కీలకమైన దశలను దాటాయని పేర్కొన్నారు. ఔషధాల డిస్కవరీ , లాజిస్టిక్స్, కస్టమర్ సరీ్వసు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తయారీ తదితర రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపయోగపడుతోందని, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తోందని హువాంగ్ చెప్పారు. డీప్‌సీక్–ఆర్1లాంటి ఓపెన్ సోర్స్ మోడల్స్, ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని కితాబిచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్‌లోని లోపాలను మాన్యువల్‌గా టెస్టింగ్‌లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్‌లతో సంభాషిస్తూ అవుట్‌పుట్‌ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన -
'ప్రాధాన్యాలను' గుర్తించడమే గెలుపు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి. ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను. ఏఐ వెంట పరుగెత్తాలి!‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసు కుని ముందుకు సాగండి. ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్‌ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్టెక్లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్‌ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్‌లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది. కంప్యూటింగ్‌లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్‌వేర్‌ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్‌లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.అలెక్స్ నెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్‌కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్‌కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్‌జీపీటీ’ తెచ్చారు.తోటమాలి నేర్పిన పాఠంఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్‌లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్‌కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.సూపర్ పవర్స్మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్‌కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను. మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి. చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది. -
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్‌పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు. -
సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు
కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేందుకు చాలా సంస్థలు అల్గారిథమ్స్, సంబంధిత విభాగాలను వాడుకుంటాయి. అందుకు భిన్నంగా ప్రపంచ టాప్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వైఖరి వేరుగా ఉంది. అతను ఎన్విడియాలోని దాదాపు 42,000 మంది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి వేతనాలను వ్యక్తిగతంగా సమీక్షిస్తారు. ‘మీ సిబ్బందిని జాగ్రత్తగా చూసుకుంటే.. మిగిలినవన్నీ వాటంతటవే వస్తాయి’ అనే ఫిలాసఫీని నమ్ముతానని హువాంగ్ తెలిపారు.వేతన పెంపు నిర్ణయంలో వ్యక్తిగత ప్రమేయం వ్యూహాత్మకమైనదని హువాంగ్ నమ్ముతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే పరిహారాన్ని కేవలం హెచ్ఆర్కు వదిలేయడం సరికాదని, ప్రతి నెలా తానూ వేతన డేటాను సమీక్షిస్తానని చెప్పారు. అయితే మొత్తం సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి, దాన్ని విశ్లేషించడానికి సహాయపడే మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను వాడుతానని తెలిపారు. కానీ తుది నిర్ణయం మాత్రం తనదేనని స్పష్టం చేశారు.ఎన్విడియా టాప్ టాలెంట్‌ను నిలుపుకోవడమే కాకుండా, నాయకత్వ బృందాన్ని విజయవంతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కంపెనీ తన సిబ్బందినిసైతం బిలియనీర్లుగా తీర్చిదిద్దిందని తెలిపారు. వేతన నిర్ణయాల్లో వ్యక్తిగత ప్రమేయం పారదర్శకత, కంపెనీ విధేయతతో కూడిన సంస్కృతిని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: కోడింగ్ ఉద్యోగాల కథ కంచికేనా?ఎన్విడియా నిర్వహణ ఖర్చులు రెట్టింపు అయినప్పటికీ హువాంగ్ దీన్ని అవసరమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీని ఫలితంగానే కంపెనీ విలువ 2023లో 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇది ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ సంస్థగా మార్చిందని చెప్పారు. ఎన్విడియా ఉద్యోగుల్లో 76% మంది మిలియనీర్లని గర్వంగా తెలిపారు. -
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్విడియా కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. 4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ .342 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న మొదటి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా నిలిచింది. అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లకు డిమాండ్ పెరగడంతో షేరు ధర 164 డాలర్లను దాటడంతో బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మైలురాయిని సాధించింది.ఈ వాల్యుయేషన్ తో మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు)లను అధిగమించి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2023 జూన్‌లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన ఈ చిప్ తయారీ కంపెనీ తర్వాత ఒక్క ఏడాదిలోనే తన మార్కెట్ వ్యాల్యూను ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. అలా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీల సరసన నిలిచిన ఎన్విడియా వేగంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌నూ దాటేసి టాప్ కంపెనీగా నిలిచింది.తోడైన కృత్రిమ మేధ విప్లవంగ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ల్లో ఎన్విడియా ఆధిపత్యం ఏఐ మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి అటానమస్ వెహికల్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ వరకు అన్నింటికీ ఈ కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను వినియోగిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎన్విడియా 70% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. 44 బిలియన్ డాలర్లను దాటింది. ఇది విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ విపరీతంగా ఉందని, మనం కొత్త పారిశ్రామిక యుగ ఆవిర్భావాన్ని చూస్తున్నామని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చెబుతున్నారు.ప్రపంచ మార్కెట్లపై ప్రభావంఎన్విడియా ఇప్పుడు ఎస్ అండ్ పీ 500 లో 7.3% వాటాను కలిగి ఉంది. ఇది వారసత్వ టెక్ దిగ్గజాలను అధిగమించింది. దీని పెరుగుదల పెట్టుబడి పోర్ట్ఫక్షలియోలు, టెక్ రంగ డైనమిక్స్‌ను పునర్నిర్వచించింది.ఓ వైపు ఎగుమతి ఆంక్షలు, పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, ఎన్విడియా వృద్ధి "స్థితిస్థాపకంగా, అంతర్జాతీయంగా" ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇండియన్ బడ్డెట్‌కు 10 రెట్లుఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ .342.66 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ సంస్థల మార్కెట్ విలువను కలిపినా దీని కంటే తక్కువే. ఇది కేంద్ర బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. -
గర్ల్‌ఫ్రెండ్‌కు మాటిచ్చి! ‘సీఈవో’గానే మనువాడి..
ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈయన ఇటీవల హాంగ్ కాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో తన భార్య 'లోరీ హువాంగ్'ను ఎలా ఆకట్టుకున్నారనే విషయాలను వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో మొదటిసారి లోరీని కలుసుకున్నప్పుడు ఆమెను ఆకట్టుకోవడానికి.. ఆమె వద్దకు వెళ్లి, మీరు నా హోంవర్క్ చూడాలనుకుంటున్నారా?.. అని అడిగినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రతి ఆదివారం నాతో కలిసి హోంవర్క్ చేస్తే.. తప్పకుండా మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు, అని వాగ్దానం చేశారు. నిజానికి అప్పుడు హువాంగ్ వయస్సు కేవలం 17, లోరీ వయస్సు 19 సంవత్సరాలు.జెన్సన్ హువాంగ్ మాటలు విన్న లోరీ.. అతన్ని తెలివైనవాడిగా భావించిందని, ఆ తరువాత ఇద్దరూ కలిసి హోంవర్క్ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు.. నేను 30 ఏళ్ల వయసుకే సీఈఓ అవుతానని జెన్సన్ చెప్పినట్లు వెల్లడించారు. చెప్పినట్లుగానే సీఈఓ అయ్యాను, దీంతో లోరీకి నమ్మకం కుదిరింది.సీఈఓ అయిన తరువాత ఐదేళ్లకు లోరిని పెళ్లి చేసుకున్నట్లు జెన్సన్ తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కూతురు మాడిసన్ (ఎన్విడియాలో మార్కెటింగ్ డైరెక్టర్), కుమారుడు స్పెన్సర్ (ఎన్విడియాలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్). ప్రస్తుతం జెన్సన్ హువాంగ్ నికర విలువ రూ. 9 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. -
నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేశాను: ఎన్వీడియా సీఈఓ
'ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఎదిగినా (అభివృద్ధి చెందినా) వచ్చిన దారిని మర్చిపోకూడదు' అంటారు. దీనికి చక్కని ఉదాహరణ ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్'. ప్రస్తుతం ప్రపంచంలోనే 13వ ధనవంతుడుగా ఉన్న ఈయన ఒకప్పుడు టేబుల్స్ క్లీన్ చేసారు, గిన్నెలు కడిగారు, టాయిలెట్లను కూడా శుభ్రం చేసినట్లు తానే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు.జెన్సన్ హువాంగ్.. గత కొన్ని రోజులక్రితం స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ తానూ గతంలో చేసిన పనులను గురించి వివరించారు. నేను చాలా టాయిలెట్లను శుభ్రం చేసాను, మీ అందరి కంటే ఎక్కువ టాయిలెట్లను నేను శుభ్రం చేసానని చెప్పారు. మీరు అసాధారణమైన పనులు చేయాలనుకుంటే, అది సులభం కాదని కూడా ఆయన వెల్లడించారు.హువాంగ్ ప్రపంచంలోని అతిపెద్ద చిప్‌మేకింగ్ కంపెనీకి చీఫ్‌గా ఉన్నప్పటికీ.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల దగ్గర కూడా చాలా వినయంగా ఉంటారు. ఇదే ఆయన విజయానికి రహస్యమని పలువురు సన్నిహితులు చెబుతారు. -
ఎన్విడియా సీఈఓ నోట.. తోటమాలి నేర్పిన పాఠం
మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తీక్షణంగా పరిశీలిస్తే.. ప్రకృతి కూడా మనకు ఎన్నెన్నో జీవిత సత్యాలను చెబుతుంది. నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. జీవితంలో ఎంతోమందికి ఆదర్శమైన వారు కూడా తమకంటే ఉన్నతులు లేదా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని ఉంటారు. ఇటీవల ఎన్వీడియా సీఈఓ 'జెన్సన్ హువాంగ్' (Jensen Huang) ఓ తోటమాలి నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాన్ని వెల్లడించారు.జెన్సన్ హువాంగ్ గత వారం కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై, అక్కడ ప్రసంగిస్తూ.. జపాన్‌లోని క్యోటోలో తాను సిల్వర్ టెంపుల్ సందర్శించడానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడ ఎక్కువ ఎండగా ఉంది, ఆ ఎండలో కూడా ఓ తోటమాలి అక్కడ పనిచేస్తూ కనిపించారు. ఆయన దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను, ఆయన ఇక్కడ పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాను. ఈ తోటకు 25 సంవత్సరాలుగా తోటమాలిగా పని చేస్తున్నాను అని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.తోట పెద్దదిగా ఉంది పని చేయడానికి సాధ్యమవుతుందా అని నేను అడిగినప్పుడు.. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పనులను సమయం కేటాయిస్తాను అని పేర్కొన్నట్లు జెన్సన్ చెప్పారు. ఆ తోటమాలి చెప్పిన మాటలు జీవితంలో విలువైన పాఠాలను నేర్పినట్లు చెప్పుకొచ్చారు.మనకు జీవితంలో ఎన్నెన్నో పనులు, వాటికి ఎన్నెన్నో ఆటంకాలు. అవన్నింటిని చూసి భయపడవకూడదు, అన్నీ చేయాల్సిన అవసరమూ లేదు. నీకు జీవితంలో ఏదైతే ముఖ్యమైందో, దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో దానికి సమయాన్ని కేటాయించు. సమయం మిగిలి ఉంటే మిగిలిన పనులు చెయ్యి. తప్పకుండా సక్సెస్ సాధిస్తావన్నని ఆ తోటమాలి మాటలకు అర్థమని స్పష్టంగా తెలుస్తోంది.


