చైనాకు ఏఐ చిప్‌లను అమ్మడం అంటే.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను అమ్మడం లాంటిదని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడె వ్యాఖ్యానించారు. దీనిని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. ఈ పోటీలో అమెరికా, చైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూఎస్ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, చైనాకు AI చిప్‌లను విక్రయించడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
The Jensen Huang episode.
0:00:00 – Is Nvidia’s biggest moat its grip on scarce supply chains?
0:16:25 – Will TPUs break Nvidia’s hold on AI compute?
0:41:06 – Why doesn’t Nvidia become a hyperscaler?
0:57:36 – Should we be selling AI chips to China?
1:35:06 – Why doesn’t Nvidia… pic.twitter.com/ezDkUmoFWM— Dwarkesh Patel (@dwarkesh_sp) April 15, 2026
హువాంగ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చైనాకు ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటింగ్ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. అంటే, చైనా ఇప్పటికే AI రంగంలో ముందంజలో ఉంది. కాబట్టి, చిప్‌లను అమ్మకుండా నిరోధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు.
ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చైనా చిప్‌లను ఉపయోగించి అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు, ఇప్పటికే చైనాలో అలాంటి సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశాడు. అంటే, ఈ టెక్నాలజీని పూర్తిగా ఆపడం అసాధ్యమని ఆయన అభిప్రాయం.


