మౌలిక సదుపాయాలకు ఏఐ దన్ను | NVIDIA CEO Jensen Huang said AI Driving Historic Infrastructure Boom | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాలకు ఏఐ దన్ను

Mar 12 2026 1:38 PM | Updated on Mar 12 2026 1:57 PM

NVIDIA CEO Jensen Huang said AI Driving Historic Infrastructure Boom

లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి

పెద్ద ఎత్తున నిపుణులైన కార్మికులకు డిమాండ్‌

చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ (ఏఐ) తోడ్పడుతోందని ఎన్‌విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌ చెప్పారు. ఇందుకోసం లక్షల కోట్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఈ పరిణామాలతో నిపుణులైన కార్మికులకు భారీగా డిమాండ్‌ ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఏఐని గతంలోలాగా ఏదో సాధారణ అప్లికేషన్‌లాగా పరిగణించడానికి లేదని, విద్యుత్తు.. ఇంటర్నెట్‌లాగా కీలకమైన మౌలిక సదుపాయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని హువాంగ్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పారు. ‘మనం ఇప్పుడిప్పుడే నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఏదో, కొన్ని వందల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాం. కానీ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలంటే ఇది సరిపోదు. లక్షల కోట్ల డాలర్లు కావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో చిప్‌ ఫ్టాక్టరీలు, కంప్యూటర్‌ అసెంబ్లీ ప్లాంట్లు, ఏఐ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయి. ఇదంతా కూడా మానవ చరిత్రలోనే  అత్యంత భారీ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనగా మారబోతోంది‘ అని పేర్కొన్నారు.  

అయిదంచెల కేక్‌..  

విద్యుత్, చిప్‌లు, మౌలిక సదుపాయాలు, మోడల్స్, అప్లికేషన్ల మేళవింపుతో కృత్రిమ మేథ అయిదంచెల ’కేక్‌’గా ఉంటుందని హువాంగ్‌ అభివరి్ణంచారు. పరిశ్రమల్లో భారీ స్థాయి మార్పుల వల్ల సంప్రదాయ టెక్‌ రంగం పరిధికి వెలుపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఈ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు భారీ స్థాయిలో కారి్మకులు కావాలి. ఏఐ ఫ్యాక్టరీలకు ఎల్రక్టీíÙయన్లు, ప్లంబర్లు, పైప్‌ఫిట్టర్లు, స్టీల్‌వర్కర్లు, నెట్‌వర్క్‌ టెక్నీíÙయన్లు, ఇన్‌స్టాలర్లు, ఆపరేటర్లు కావాలి. మంచి జీతభత్యాలు ఉండి, నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలివి. అలాంటి నిపుణులకు కొరత నెలకొంది. ఈ పరివర్తనలో పాలుపంచుకునేందుకు కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీల్లాంటివేమీ అవసరం లేదు’ అని హువాంగ్‌ చెప్పారు.

సంప్రదాయ కంప్యూటింగ్‌ మోడల్‌ను కృత్రిమ మేథ ఏ విధంగా మార్చివేస్తోందనేది ఆయన వివరించారు. ఏఐ మోడల్స్‌ గతేడాది కీలకమైన దశలను దాటాయని పేర్కొన్నారు. ఔషధాల డిస్కవరీ , లాజిస్టిక్స్, కస్టమర్‌ సరీ్వసు, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, తయారీ తదితర రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపయోగపడుతోందని, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తోందని హువాంగ్‌ చెప్పారు. డీప్‌సీక్‌–ఆర్‌1లాంటి ఓపెన్‌ సోర్స్‌ మోడల్స్, ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని కితాబిచ్చారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ కోరిక నెరవేరుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement