యూఎస్‌ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా | US Senate Embraces AI Revolution ChatGPT Gemini Copilot Approved | Sakshi
Sakshi News home page

యూఎస్‌ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా

Mar 11 2026 8:10 PM | Updated on Mar 11 2026 8:45 PM

US Senate Embraces AI Revolution ChatGPT Gemini Copilot Approved

ఏఐ చాట్‌బాట్‌లకు సెనేట్ ఆమోదం

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన పరిపాలన, శాసన ప్రక్రియలో కృత్రిమ మేధ విప్లవానికి నాంది పలికింది. అమెరికా సెనేట్ అధికారిక కార్యకలాపాల కోసం ప్రముఖ ఏఐ చాట్‌బాట్‌లు.. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమిని, మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ ఏఐ పరికరాలు సెనేట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అంతర్భాగంగా మారి విధాన నిర్ణేతలకు సహాయంగా నిలవనున్నాయి.

పాలనలో వేగం.. పనిలో పారదర్శకత

సెనేట్ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా డ్రాఫ్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, అపారమైన సమాచారాన్ని విశ్లేషించి కచ్చితమైన డేటాను అందించడం, సుదీర్ఘమైన నివేదికలను క్లుప్తంగా బ్రీఫింగ్ నోట్స్ రూపంలోకి మార్చడం వంటి పనులు చేస్తాయి. ఒకే రకమైన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా అధికారుల సమయాన్ని ఇవి ఆదా చేయనున్నాయి.

అమెరికా ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక సంకేతంగా మారింది. పాలనలో ఏఐ కేవలం సహాయకారి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది అనివార్యమనే సంకేతాలు ఇస్తోంది. అయితే భద్రత, గోప్యత వంటి అంశాల్లో ఈ సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి: రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Advertisement
 
Advertisement
Advertisement