క్రోమ్‌ బ్రౌజర్లో ఏఐ టూల్స్‌ | Google Built In AI To Chrome In India Supporting 50 Languages, Check Out Features Inside | Sakshi
Sakshi News home page

క్రోమ్‌ బ్రౌజర్లో ఏఐ టూల్స్‌

Mar 12 2026 9:00 AM | Updated on Mar 12 2026 9:52 AM

Google Built In AI to Chrome in India Supporting 50 Languages

తెలుగు సహా 8 ప్రాంతీయ భాషలకు సపోర్ట్‌ 

సురక్షితమైన, మెరుగైన బ్రౌజింగ్‌ అనుభూతిని కల్పించే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో  క్రోమ్‌ బ్రౌజర్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా బిల్ట్‌ ఇన్‌ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, హిందీలాంటి 8 ప్రాంతీయ భాషలతో పాటు 50 ల్యాంగేజ్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

లేటెస్ట్‌ జెమిని 3.1 మోడల్‌పై రూపొందించిన ఈ ఫీచర్లతో, బ్రౌజర్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని వివరించింది. ముందుగా డెస్క్‌టాప్‌, ఐవోఎస్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయని గూగుల్‌ డైరెక్టర్‌ షార్మెయిన్‌ డిసిల్వా తెలిపారు.

వీటిని తొలిసారిగా ప్రవేశపెడుతున్న మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని వివరించారు. కొత్త ఫీచర్ల ప్రకారం వేరే ట్యాబ్‌కి మారాల్సిన అవసరం లేకుండా యూజర్లు, ప్రస్తుత ట్యాబ్‌లోనే పైన కుడివైపున ఉండే బ్రౌజింగ్‌ అసిస్టెంట్‌ ఐకాన్‌ని క్లిక్‌ చేసి నేరుగా చాట్‌ చేయొచ్చు. చాంతాడంత కంటెంట్‌ను సంక్షిప్తంగా పొందవచ్చు. జీమెయిల్‌తో అనుసంధానించడం వల్ల ప్రస్తుత పేజీ నుంచి వేరే పేజీకి వెళ్లక్కర్లేకుండా, సైడ్‌ ప్యానెల్‌ నుంచే ఈమెయిల్స్‌ రాయొచ్చు, పంపించవచ్చు.

ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌.. తర్వాత దీని వంతే!

Advertisement
 
Advertisement
Advertisement