దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఆటో షేర్ల ఒత్తిడితో బెంచ్ మార్క్ సూచీల రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 500.38 పాయింట్లు లేదా 0.61 శాతం తగ్గి 82,031.81 వద్ద, నిఫ్టీ50 159.45 పాయింట్లు లేదా 0.63 శాతం తగ్గి 25,227.95 వద్ద స్థిరపడ్డాయి.
టైటాన్ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిఫ్టీ50లో అత్యధిక నష్టాలు పొందాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.22 శాతం, 0.35 శాతం పడిపోయాయి. రంగాలపరంగా, నిఫ్టీ కన్స్యూమర్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో అత్యంత ప్రభావితమయ్యాయి, అయితే నిఫ్టీ సీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మీడియా మెరుగైన ప్రదర్శన కనబరిచాయి.


