నెమ్మదించిన నిరుద్యోగ రేటు | India Unemployment Rate Falls in October | Sakshi
Sakshi News home page

నెమ్మదించిన నిరుద్యోగ రేటు

Nov 18 2026 9:10 AM | Updated on Nov 18 2026 9:24 AM

India Unemployment Rate Falls in October

దేశీయంగా నిరుద్యోగ రేటు అక్టోబర్‌లో స్వల్పంగా నెమ్మదించి 4.9 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఇది 5 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన కార్మిక సిబ్బంది సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగ రేటు గతేడాది అక్టోబర్‌లో 5.2 శాతంగా ఉండగా, ఈసారి 0.3 పర్సంటేజీ పాయింట్లు తగ్గింది.

పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం సెప్టెంబర్‌లో 6.9 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 6.7 శాతానికి దిగి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్దగా మార్పు లేకుండా 4.2 శాతంగా కొనసాగింది. మరోవైపు మహిళల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఉద్యోగ రేటు మెరుగుపడింది. ఉద్యోగాలు చేస్తున్న లేదా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళల శాతం (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) సెప్టెంబర్‌లో 34.6 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో 35 శాతానికి పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఇది 38.9 శాతం నుంచి 39.5 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో పెద్దగా మార్పు లేకుండా 25.9 శాతంగా కొనసాగింది. 3,70,475 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 2,11,474 మంది గ్రామీణ ప్రాంతాల వారు, 1,59,001 మంది పట్టణ ప్రాంతాల వారు ఉన్నారు.

ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement